Microsoft తెలిపిన ప్రకారం, 2026 జనవరి 15 తరువాత Copilot ఇక WhatsAppలో పనిచేయదు. అదే రోజున WhatsApp కొత్త పాలసీలు అమల్లోకి వస్తుండటంతో, సేవను కొనసాగించే మార్గం లేకుండా పోయిందని కంపెనీ తెలియజేసింది.వినియోగదారుల కోసం మార్పు సాఫీగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, మొబైల్, వెబ్, PCలో Copilot యాక్సెస్‌ను అలాగే కొనసాగించవచ్చని Microsoft తన బ్లాగ్‌లో తెలిపింది.
Photo Credit: Microsoft
మైక్రోసాఫ్ట్ మొదటిసారిగా 2024లో వాట్సాప్‌లో కోపైలట్‌ను ప్రవేశపెట్టింది.
Microsoft మంగళవారం ఒక కీలక ప్రకటన చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, దాని AI చాట్‌బాట్ అయిన Copilot త్వరలో WhatsApp నుంచి పూర్తిగా వైదొలగనుంది. Meta ఆధ్వర్యంలోని WhatsApp ఇటీవల తన బిజినెస్ API పాలసీలను మార్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం, AI చాట్‌బాట్లు లేదా వాటి డెవలపర్‌లు WhatsApp Business Solutionను ఉపయోగించడం నిషేధం. గత నెలలో OpenAI తన ChatGPT చాట్‌బాట్‌ను WhatsApp నుంచి తీసేసిన తరువాత, ఇదే దారిలో నడుస్తున్న రెండో పెద్ద సంస్థ Microsoft అవుతోంది.
Microsoft తెలిపిన ప్రకారం, 2026 జనవరి 15 తరువాత Copilot ఇక WhatsAppలో పనిచేయదు. అదే రోజున WhatsApp కొత్త పాలసీలు అమల్లోకి వస్తుండటంతో, సేవను కొనసాగించే మార్గం లేకుండా పోయిందని కంపెనీ తెలియజేసింది. వినియోగదారుల కోసం మార్పు సాఫీగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, మొబైల్, వెబ్, PCలో Copilot యాక్సెస్‌ను అలాగే కొనసాగించవచ్చని Microsoft తన బ్లాగ్‌లో తెలిపింది.
అయితే, WhatsAppలో ఉన్న Copilot చాట్‌లను ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మార్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే అవి “unauthenticated conversations” గా పరిగణించబడతాయి. ఆ సంభాషణలను సేవ్ చేయాలనుకునే యూజర్లు, WhatsApp అందించే ఎక్స్‌పోర్ట్ టూల్స్‌ని వాడుకోవాలని సూచించింది.
WhatsApp నుంచి తప్పుకుంటున్నప్పటికీ, Copilot సేవలు పూర్తిగా ఆగిపోవు. ఇది copilot.microsoft.com వెబ్‌సైట్‌లో, అలాగే iOS మరియు Android కోసం ఉన్న Copilot మొబైల్ యాప్‌లలో యథావిధిగా అందుబాటులో ఉంటుంది. ఇందులో WhatsAppలో అందుబాటులో ఉన్న మూల ఫీచర్లు మాత్రమే కాకుండా, అదనంగా కొన్ని విస్తృత సామర్థ్యాలు కూడా ఉండనున్నాయని Microsoft తెలిపింది.
WhatsApp తాజాగా చేసిన పాలసీ మార్పుల ప్రకారం, AI లేదా మెషీన్ లెర్నింగ్‌పై ఆధారపడి పనిచేసే టెక్నాలజీల డెవలపర్‌లు LLMs, జనరేటివ్ AI ప్లాట్‌ఫార్మ్స్, సాధారణ AI అసిస్టెంట్లు WhatsApp Business Solutionను వాడటం పూర్తిగా నిషేధం. ముఖ్య సేవగా AI ఫీచర్లను అందించే ఏ ప్లాట్‌ఫారమ్ అయినా ఈ నిబంధనల పాటింపు తప్పనిసరి.
OpenAI ఇప్పటికే ఈ మార్పులకు అనుగుణంగా ChatGPTను WhatsApp నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2025 జనవరి 15 తర్వాత ChatGPT కూడా WhatsAppలో పనిచేయదు. యూజర్లు తమ ChatGPT అకౌంట్‌ను WhatsAppతో లింక్ చేస్తే, పాత చాట్‌లు ChatGPT యాప్‌లోని హిస్టరీ సెక్షన్‌లో కనిపిస్తాయని కంపెనీ తెలిపింది.
ప్రకటన
ప్రకటన
Redmi Pad 2 Pro, Redmi Buds 8 Pro Could Launch in China Soon