కొద్దిరోజుల క్రితం కొన్ని యూజర్లు ChatGPTలో సంభాషణల మధ్య, సమాధానాల కింద ప్రకటనల మాదిరి కంటెంట్ కనిపిస్తున్నాయని చెబుతూ స్క్రీన్‌షాట్‌లు పోస్ట్ చేశారు. ముఖ్యంగా, పేడ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకూ ఈ “యాడ్స్ లాంటి” సూచనలు వచ్చాయని చెబడం పెద్ద దుమారానికే దారితీసింది
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని స్క్రీన్‌షాట్‌ల కారణంగా, ChatGPT పేడ్ యూజర్లకు కూడా యాడ్స్ కనిపిస్తున్నాయి అనే వాదన చర్చనీయాంశంగా మారింది. అయితే OpenAI అధికారులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. సోషల్ మీడియాలో షేర్ అయిన స్క్రీన్‌షాట్‌లు “అసలు యాడ్స్ కావొచ్చు లేదా పూర్తిగా నిజం కాకపోవచ్చు” అని వారు స్పష్టంచేశారు.కొద్దిరోజుల క్రితం కొన్ని యూజర్లు ChatGPTలో సంభాషణల మధ్య, సమాధానాల కింద ప్రకటనల మాదిరి కంటెంట్ కనిపిస్తున్నాయని చెబుతూ స్క్రీన్‌షాట్‌లు పోస్ట్ చేశారు. ముఖ్యంగా, పేడ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకూ ఈ “యాడ్స్ లాంటి” సూచనలు వచ్చాయని చెబడం పెద్ద దుమారానికే దారితీసింది.ఈ విషయంలో OpenAI చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ మార్క్ చెన్ మాట్లాడుతూ, యాప్‌లో యాడ్‌లా అనిపించే ఏదైనా వస్తే అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అంశమని అంగీకరించారు. “ఈ సందర్భంలో మాత్రం మనం నిర్లక్ష్యం చేశాం” అని ఆయన తెలిపారు.
డిసెంబర్ 3న వచ్చిన ఒక X పోస్టు ఇదే వివాదాన్ని అత్యధిక స్థాయికి తీసుకెళ్లింది. @BenjaminDEKR అనే యూజర్ Windows BitLocker గురించి ChatGPTలో ప్రశ్నించగా, వెంటనే Target స్టోర్‌లో షాపింగ్‌కు సంబంధించిన సూచన కనిపించిందని చెప్పారు. పేడ్ Plus సబ్‌స్క్రిప్షన్ ఉపయోగిస్తున్నానని చెప్పిన ఆ యూజర్, “నేను Windows BitLocker గురించి అడుగుతుంటే Targetలో షాపింగ్ చేయమని ChatGPT చెబుతోంది” అని విమర్శించారు. ఈ పోస్టుకు లక్షలాదిగా వ్యూస్ రావడంతో OpenAI స్పందించాల్సి వచ్చింది.
OpenAI డేటా సైంటిస్ట్ డానియల్ మెకాలే దీనికి స్పందిస్తూ, అది ప్రకటన కాదని, ChatGPTలో ఇంటిగ్రేట్ చేసిన థర్డ్-పార్టీ యాప్ నుంచి వచ్చిన సూచన మాత్రమేనని చెప్పారు. “DevDay తర్వాత భాగస్వామ్య యాప్‌లను ChatGPTలో సహజంగా కనిపించేలా మార్చే పనిలో ఉన్నాం” అని వ్యాఖ్యానించారు. అయితే యూజర్లు దీనిని అంగీకరించలేదు. “సంబంధం లేని చాట్‌లో బ్రాండ్‌లు తమను తాము చొప్పించుకొని షాపింగ్ చేయమని చెప్పడం కూడా యాడ్‌లాంటిదే” అని వారు తిరిగి స్పందించారు.
ఇక మార్క్ చెన్ మరో స్పందనలో, ఇలాంటి సూచనలను తాత్కాలికంగా ఆపేశామని, మోడల్ ప్రెసిషన్ మెరుగుపడిన తర్వాత మాత్రమే తిరిగి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అవసరమైతే యూజర్లు వీటి ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవడానికి లేదా పూర్తిగా ఆఫ్ చేయడానికి కొత్త నియంత్రణలను కూడా అందించనున్నట్టు చెప్పారు.
ChatGPT హెడ్ నిక్ టర్లు కూడా దీనిపై వివరణ ఇస్తూ, కంపెనీ ఎలాంటి యాడ్ టెస్టులు కూడా ప్రస్తుతం నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న స్క్రీన్‌షాట్‌లు “యాడ్స్ కావొచ్చు లేదా పూర్తిగా తప్పుడు సమాచారం కావొచ్చు” అని తెలిపారు. “భవిష్యత్తులో ఎప్పుడైనా యాడ్స్ గురించి ఆలోచిస్తే, అది చాలా ఆలోచనాత్మకంగా, యూజర్ నమ్మకాన్ని దెబ్బతీయకుండా చేస్తాం” అని కూడా చెప్పారు.
ప్రకటన
ప్రకటన
Samsung's One UI 8.5 Beta Update Rolls Out to Galaxy S25 Series in Multiple Regions
Elon Musk Says Grok 4.20 AI Model Could Be Released in a Month