ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp తమ యూజర్ల భద్రత విషయంలో అస్సలు రాజీ పడదు. ఇందు భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. తాజాగా WhatsApp యూజర్ల కోసం సరికొత్త ప్రొటెక్షన్ ఫీచర్‌ని పరిచయం చేస్తోంది. ఫీచర్ ట్రాకర్ గుర్తించిన వివరాల ప్రకారం.. త్వరలో WhatsApp తెలియని వారి నుంచి అందుకునే నిర్దిష్టమైన సందేశాల నుండి యూజర్లకు రక్షణ కల్పించే ఫీచర్‌ను అందిస్తోంది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వినియోగదారులకు తెలియని ఖాతాల నుండి వచ్చే సందేశాలను బ్లాక్ చేయడానికి అనుమతించే ఒక ఫీచర్‌పై అధ్యయనం చేస్తోంది.
WhatsApp మెసేజింగ్ యాప్‌లో స్టేటస్ అప్‌డేట్‌లను "లైక్" చేసే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇతర యూజర్లు అప్‌లోడ్ చేసిన ఫోటో, వీడియో మరియు టెక్స్ట్ కథనాలకు త్వరగా స్పందించడానికి ఈ ఆప్షన్ వినియోగదారులను ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఫీచర్ ట్రాకర్ WABetaInfo ఆండ్రాయిడ్ 2.24.17.24 కోసం WhatsApp బీటాలో కొత్త బ్లాక్ అన్‌నౌన్ అకౌంట్‌ల మెసేజ్‌లను టోగుల్ చేసింది. ఇటీవల ఆండ్రాయిడ్‌లోని బీటా టెస్టర్‌లకు ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉండడంతో వినియోగదారులు ఈ ఫీచర్ ప్రయత్నించడానికి అవకాశం లేదు.
స్క్రీన్ షాట్ ద్వారా చూడొచ్చు..
సెట్టింగ్‌ల యాప్‌లో ప్రైవసీ> అడ్వాన్స్‌డ్ మెను దిగువన కనిపించే కొత్త సెట్టింగ్ స్క్రీన్‌షాట్ కూడా WABetaInfo ద్వారా షేర్ చేయబడింది. నిర్దిష్ట వాల్యూమ్‌ను మించి ఉంటే, తెలియని ఖాతాల నుండి వచ్చే సందేశాలను WhatsApp బ్లాక్ చేస్తుందని ఆ ఫీచర్‌కు సంబంధించిన వివరణ ఈ స్క్రీన్ షాట్ ద్వారా చూడొచ్చు. అలాగే, స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ పనితీరుపై ప్రభావం పడకుండా ఉండేలా చూడడంతోపాటు వినియోగదారు ఖాతాను సురక్షితంగా ఉంచడానికి WhatsApp తెలియని వారు పంపిన ఈ తరహా సందేశాలను బ్లాక్ చేస్తుందని తెలుస్తోంది. అయితే, భవిష్యత్తులో బ్లాక్ చేసిన తెలియని ఖాతాల నుంచి కొన్ని సందేశాలను అనుమతించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల మాదిరిగానే..
సిగ్నల్ డిఫాల్ట్‌గా తెలియని ఖాతాల ద్వారా వచ్చిన సందేశాలను నియంత్రిస్తుంది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే అన్‌నౌన్ ఖాతా నుంచి వచ్చే చాట్ అంగీకరించమని లేదా రిపోర్ట్ చేయమని వినియోగదారులను అడుగుతుంది. అలా యూజర్ ఏదో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకునేవరకూ వచ్చిన సందేశం చూసినట్లుగా అవతలివారికి చూపించదు. అలాగే, వాట్సాప్ బీటా టెస్టర్లు ఇప్పుడు స్టేటస్ అప్‌డేట్‌లకు రిప్లై ఇవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల మాదిరిగానే 24 గంటల పాటు టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలను అప్‌లోడ్ చేయడానికి ఖాతాదారులను హార్ట్ ఎమోజీతో అనుమతించే ఫీచర్ ఇది. దీంతోపాటు Facebook, Instagram రెండూ ఒకే ట్యాప్‌తో మెసేజ్‌లకు రిప్లై ఇచ్చే అవకశాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఇదే తరహాలో WhatsApp యొక్క తాజా బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.
WABetaInfo షేర్ చేసిన వివరాల ప్రకారం..
Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా Android 2.24.17.21 WhatsApp బీటా అప్‌డేట్ చేసిన తర్వాత, స్క్రీన్ కింద కుడివైపున రిప్లై బాక్స్ పక్కన కొత్త హార్ట్ ఐకాన్ కనిపించాలి. అయితే, ఇంకా ప్రయోగ దశలో ఉన్నందున ఈ ఫీచర్ నెమ్మదిగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. WABetaInfo షేర్ చేసిన వివరాల ప్రకారం.. ఖాతాదారులు తమ స్టోరీని వీక్షించిన కాంటాక్ట్‌లను చూపించడం ద్వారా వారి స్టోరీకి ఎవరు స్పందించారో చూడగలరు. లైకింగ్ స్టేటస్ అప్‌డేట్‌లు ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే పనిచేస్తాయని ఇది సూచిస్తోంది. ఇక్కడ వినియోగదారులు తమ స్టోరీని ఎవరు లైక్ చేశారో చూడగలరు. ఈ ఫీచర్ iOSతోపాటు Androidలోని వినియోగదారులకు రాబోయే యాప్ వెర్షన్‌తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.