ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఇక మీ జేబులో.. వివో X300sతో అద్భుతమైన కెమెరా సెటప్.. డీటెయిల్స్ ఇవే..!

వివో తన తదుపరి పవర్‌హౌస్ స్మార్ట్‌ఫోన్ వివో X300sని త్వరలో లాంచ్ చేయనుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500+ చిప్‌సెట్‌ను వాడే అవకాశం ఉంది.

ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఇక మీ జేబులో.. వివో X300sతో అద్భుతమైన కెమెరా సెటప్.. డీటెయిల్స్ ఇవే..!

Photo Credit: Beebom Gadgets

వివో X300sని త్వరలో లాంచ్

ముఖ్యాంశాలు
  • వివో X300sని త్వరలో లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9500+ చిప్‌సెట్‌ ఉంది
  • 200 మెగాపిక్సెల్ జైస్ ట్యూన్డ్ కెమెరా ఉంటుంది
ప్రకటన

వివో తన తదుపరి పవర్‌హౌస్ స్మార్ట్‌ఫోన్ 'వివో X300s' గురించి అధికారికంగా నోరు విప్పడంతో టెక్ ప్రపంచంలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఇటీవల జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఈ ఫోన్ తాలూకు లీకులు వైరల్ కాగా, ఇప్పుడు కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ హాన్ బాక్సియా స్వయంగా వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలోనే చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ స్మార్ట్‌ఫోన్, గతంలో మనం విన్న వివో X300 మ్యాక్స్ మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రాబోతోంది. ముఖ్యంగా గతేడాది మార్కెట్లోకి వచ్చిన వివో X200s విజయ పరంపరను కొనసాగిస్తూ, ఈ సరికొత్త మోడల్ మరిన్ని హై-ఎండ్ ఫీచర్లతో యూజర్లను పలకరించేందుకు సిద్ధమైంది.

డిస్‌ప్లే విషయానికొస్తే వివో ఈసారి కళ్లకు రక్షణ ఇచ్చే టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఫోన్ 6.78 అంగుళాల భారీ స్క్రీన్‌తో వస్తోంది, ఇది 144Hz రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉపయోగించిన BOE Q10 ప్లస్ మెటీరియల్ ఫోన్ లుక్‌ను ప్రీమియంగా మార్చడమే కాకుండా, సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ 2.0 టెక్నాలజీ ద్వారా మన కంటిపై పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ కాలంలో గంటల తరబడి స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారికి ఈ ఐ-ప్రొటెక్షన్ ఫీచర్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. విజువల్స్ పరంగా 1.5K OLED డిస్‌ప్లేతో కూడిన ఈ ఫోన్ కచ్చితంగా గేమింగ్, మూవీ ప్రియులను ఆకట్టుకుంటుంది.

కెమెరా విభాగంలో వివో ఎప్పుడూ తన మార్కును చూపిస్తూనే ఉంటుంది. ఈ కొత్త X300s మోడల్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్ జైస్ ట్యూన్డ్ కెమెరాను అమర్చినట్లు కంపెనీ నిర్ధారించింది. దీనికి తోడు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండటంతో దూరంగా ఉన్న వస్తువులను కూడా అత్యంత స్పష్టతతో షూట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక వెనుక భాగంలో ఉండే సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఫోన్‌కు ఒక ఐకానిక్ లుక్‌ని ఇస్తుంది. ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్న వారికి, ముఖ్యంగా సోషల్ మీడియాలో క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేసే కుర్రకారుకు ఈ కెమెరా సెటప్ ఒక పండగ లాంటి అనుభూతిని మిగిలిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా ఆడియో, వైబ్రేషన్ అనుభూతిని కూడా వివో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇందులో "1511 వార్ డ్రమ్ మాస్టర్" అనే సిమెట్రికల్ డ్యూయల్ స్పీకర్ సిస్టమ్ ఉంది, ఇది గేమింగ్ సమయంలో 120 శాతం మెరుగైన సౌండ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, గ్రేటర్ బ్యాండ్‌విడ్త్ కలిగిన సరికొత్త హ్యాప్టిక్ మోటార్‌ను ఇందులో ఉపయోగించారు. ఇది సాధారణ ఫోన్ల కంటే రెండు రెట్లు ఎక్కువ వైబ్రేషన్ సెన్సేషన్‌ను ఇస్తుంది. గేమ్ ఆడుతున్నప్పుడు లేదా టైపింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ వైబ్రేషన్ ఫీల్ యూజర్‌కు ఫోన్‌తో మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది, ఇది ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ కానుంది.

పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే వివో X300s లో అత్యంత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500+ చిప్‌సెట్‌ను వాడే అవకాశం ఉంది. దీనికి తోడుగా 7,000mAh భారీ బ్యాటరీని అమర్చడం విశేషం. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీని మనం తక్కువగా చూస్తుంటాం. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా హెవీ యూసేజ్ ఉన్నా చింతించాల్సిన పనిలేదు. పాత మోడల్ X200s లో ఉన్న 6,200mAh కంటే ఇది చాలా పెద్ద జంప్ అని చెప్పాలి. పవర్, ఎఫిషియన్సీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వివో ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది, తద్వారా గేమర్స్,మల్టీ టాస్కర్లకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర, గ్లోబల్ లాంచ్ తేదీ గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ, మార్చి నెలాఖరులోపు చైనాలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతేడాది X200s ప్రారంభ ధర సుమారు 49 వేల రూపాయలుగా ఉంది, కాబట్టి ఈ కొత్త మోడల్ కూడా అదే రేంజ్ లేదా కొంచెం ఎక్కువ ధరతో వచ్చే అవకాశం ఉంది. 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఇక మీ జేబులో.. వివో X300sతో అద్భుతమైన కెమెరా సెటప్.. డీటెయిల్స్ ఇవే..!
  2. బటన్ అంత సైజు.. 1TB డేటా స్టోరేజ్.. శాన్‌డిస్క్ నుంచి ప్రపంచంలోనే అత్యంత చిన్న టైప్-సి ఫ్లాష్ డ్రైవ్ లాంచ్..!
  3. ఛార్జింగ్ టెన్షన్‌కు బై-బై.. గెలాక్సీ M17e 5G లో 6000mAh భారీ బ్యాటరీ.. రోజంతా వాడినా తగ్గదు..!
  4. స్టైలిష్ 'స్క్విర్కిల్' లుక్.. సరికొత్త కెమెరా డిజైన్.. అదిరిపోయే రంగుల్లో వన్‌ప్లస్ 15T దర్శనం..!
  5. మడత లేని మ్యాజిక్.. ఒప్పో Find N6 వచ్చేస్తోంది.. 200MP కెమెరా, శాటిలైట్ కనెక్టివిటీతో ఫోల్డబుల్ సంచలనం!
  6. వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఎమోజీ టైప్ చేస్తే చాలు.. దానికి తగ్గ స్టిక్కర్ ప్రత్యక్షం..!
  7. ఈ వారం ఓటీటీ సందడి: విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్' నుంచి అనిల్ కపూర్ 'సుబేదార్' వరకు.. ముచ్చటగా 10 సినిమాలు!
  8. యాపిల్ నుంచి చౌకైన ల్యాప్‌టాప్.. మ్యాక్‌బుక్ నియో వర్సెస్ ఎయిర్ M5.. మీ అవసరానికి ఏది సరిపోతుంది..?
  9. వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు షాక్.. నేటి నుంచే 'సిమ్ బైండింగ్' రూల్.. ఇకపై సిమ్ లేకపోతే యాప్ బంద్..!
  10. పోకో నుంచి పవర్‌ఫుల్ 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులు గడిచిపోవాల్సిందే..!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »