ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ పండుగ వైబ్‌కు సెట్ అయ్యేలా ఆకర్షణీయమైన యానిమేషన్‌లతోపాటు స్టిక్కర్ ప్యాక్‌లను అందిస్తోంది
Photo Credit: WhatsApp
వాట్సాప్‌లో నూతన సంవత్సర నేపథ్య అంశాలు అందుబాటులోకి వచ్చాయి
నూతన సంవత్సరానికి ముందే WhatsApp వినియోగదారులకు సరికొత్త అనుభవాలను అందించేందుకు సిద్ధమైంది. టెక్ట్, కాలింగ్‌లలో ఆహ్లాదాన్ని మరింత మెరుగుపరిచేలా కొత్త ఫీచర్లను అందించనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. WhatsApp వినియోగదారులు వీడియో కాల్‌ల సమయంలో న్యూ ఇయర్ థీమ్‌తో కొత్త కాలింగ్ ఫీచర్స్‌ను పరిమిత సమయం వరకు పొందవచ్చు. అలాగే, ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ పండుగ వైబ్‌కు సెట్ అయ్యేలా ఆకర్షణీయమైన యానిమేషన్‌లతోపాటు స్టిక్కర్ ప్యాక్‌లను అందిస్తోంది. మెటా ప్లాట్‌ఫారమ్‌ల యాజమాన్యంలోని మరొక యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఇటీవలే 2024 కోల్లెజ్‌గా పిలిచే లిమిటెడ్-టైం ఫీచర్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్‌ను దృష్టిలో పెట్టుకుని WhatsApp అందిస్తోన్న సరికొత్త ఫీచర్స్‌ను చూసేద్దామా?!
WhatsApp వెల్లడించిన దాని ప్రకారం ప్రకారం, ఈ సెలవు రోజుల్లో వినియోగదారులు వీడియో కాల్‌లలో కొత్త అనుభవాన్ని పొందవచ్చు. కొత్త సంవత్సరాన్ని గుర్తుచేసేలా పండుగ నేపథ్యాలు, ఫిల్టర్‌లు, ఎఫెక్ట్‌ను అటాచ్ చేయవచ్చు. అలాగే, ఇది కొత్త యానిమేటెడ్ రియాక్షన్‌ను కూడా తీసుకువస్తుంది. ఎవరైనా ఎంపిక చేసిన పార్టీ ఎమోజీలను ఉపయోగించి మెసేజ్‌కు ప్రతిస్పందించినప్పుడు, సెండర్‌తోపాటు స్వీకరించేవారికి ఇద్దరికీ కన్ఫెట్టి యానిమేషన్ కనిపించనుంది.
ఈ instant మెసేజింగ్ ఫ్లాట్‌ఫాం కూడా కొత్త స్టిక్కర్‌లను పరిచయం చేస్తోంది. క్యూరేటెడ్ న్యూ ఇయర్స్ ఈవ్ (NYE) స్టిక్కర్ ప్యాక్, న్యూ ఇయర్ థీమ్‌కి సెట్ అయ్యేలా అవతార్ స్టిక్కర్‌లతో అందుబాటులో ఉంది. అలాగే, హాలిడే శుభాకాంక్షలను సరదాగా, ఇంటరాక్టివ్‌గా తెలిపేందుకు ఈ ఫీచర్లు సరికొత్త వేదికని WhatsApp చెబుతోంది. ఇటీవల కొన్ని వారాల్లోనే ఈ ఫీచర్లు వాట్సాప్‌లో అటాచ్ అయ్యాయి. గత వారం, puppy ears, అండర్ వాటర్, కరోకే మైక్రోఫోన్‌తో సహా వీడియో కాల్‌ల కోసం మరిన్ని ఫీచర్స్‌ను అందించారు.
ప్రస్తుతం వినియోగదారులు మొత్తంగా పది ఎఫెక్ట్స్‌ను పొందవచ్చు. అలాగే, వినియోగదారులు మొత్తం చాట్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా గ్రూపులలో కాల్స్ కోసం నిర్దిష్ట పార్టిసిపెంట్‌లను ఎంపిక చేసుకోవచ్చు. గతంలోనే WhatsApp చాట్‌లలో రియల్ టైమ్ ఎంగేజ్‌మెంట్ కోసం టైపింగ్ ఇండికేటర్‌లను పరిచయం చేసింది. అయితే, దీనిని ప్రవేశపెట్టిన తర్వాత వినియోగదారు ఒకరితో ఒకరు లేదా గ్రూప్ కాలింగ్ సమయాల్లో టైప్ చేస్తున్న ప్రొఫైల్ పిక్చర్‌తోపాటు చాట్‌లలో visual cuesను చూడొచ్చు.
వాయిస్ మెసేజ్ ట్రాన్స్కిప్షన్ ఇటీవలి మరో అదనపు జోడింపుగా ఉంది. WhatsApp ఇతరుల నుండి స్వీకరించిన వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్-బేస్ట్ ట్రాన్స్కిప్షన్‌తో వినియోగదారులను అందిస్తోంది. అయితే, ఈ అవకాశం పంపినవారు కాకుండా రిసీవ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డివైజ్‌లో మాత్రమే ట్రాన్స్‌క్రిప్ట్‌లు రూపొందించబడతాయి, ఈ కంటెంట్‌ను మరెవరూ వినడం లేదా చదవడం చేయలేరని కంపెనీ స్పష్టం చేసింది. ప్రతి ఏటా అందించే విధంగానే వినియోగదారులకు సరికొత్త అనుభవాలను చేరువ చేస్తోన్న WhatsApp ఫీచర్స్ ఎంత వరకూ ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
ప్రకటన
ప్రకటన
Motorola Edge 70 Launched in India With 5,000mAh Battery, 50-Megapixel Triple Rear Cameras: Price, Specifications
Reliance Jio Launches Happy New Year 2026 Plans With Unlimited 5G Access, Google Gemini Pro