హానర్ 13,080mAh బ్యాటరీ సామర్థ్యం ఉన్న 'Honor X80 GT'ను లాంచ్ చేయనుంది.
Photo Credit: Gadgets 360
ఈ ఫోన్ దగ్గరుంటే చార్జర్ అడ్రస్ మర్చిపోవాల్సిందే
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఇప్పుడు టెక్నాలజీ పోటీ కేవలం కెమెరాలు, ప్రాసెసర్ల చుట్టూనే కాకుండా బ్యాటరీ లైఫ్ వైపు కూడా వేగంగా మళ్లుతోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'హానర్' తన యూజర్లను ఆశ్చర్యపరిచేలా ఒక భారీ బ్యాటరీ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. గత కొద్ది నెలలుగా హానర్ సంస్థ 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలతో రకరకాల మోడల్స్‌ను ఇప్పటికే పరిచయం చేసింది. అయితే ఇప్పుడు రాబోయే 'Honor X80 GT' స్మార్ట్‌ఫోన్ ఆ రికార్డులన్నింటినీ తిరగరాస్తుందని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఏడాది మొదటి సగభాగంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉన్న ఈ ఫోన్, స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయానికి తెరలేపనుంది.
చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో 'సిస్టర్ బేర్' అనే టిప్‌స్టర్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, Honor X80 GT ఏకంగా 13,080mAh బ్యాటరీతో రాబోతోంది. సాధారణంగా మనం వాడే స్మార్ట్‌ఫోన్లలో 5,000mAh బ్యాటరీ ఉంటేనే అది పెద్దదిగా భావిస్తాం, కానీ హానర్ ఏకంగా దానికంటే రెట్టింపు కంటే ఎక్కువ సామర్థ్యాన్ని ఒకే హ్యాండ్‌సెట్‌లో ఇమడ్చడం విశేషం. ఇంత భారీ కెపాసిటీ ఉన్న ఫోన్ మన చేతిలో ఉంటే, ఇక పవర్ బ్యాంక్‌లతో అవసరమే ఉండదని చెప్పవచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కనీసం మూడు నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకునే వెసులుబాటు ఈ ఫోన్ కల్పిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేటి జనరేషన్‌కు, గేమర్లకు ఇది ఒక అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పాలి.
నిజానికి హానర్ సంస్థకు ఇలాంటి భారీ బ్యాటరీ ఫోన్లు తయారు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనే హానర్ విన్ సిరీస్‌లో 10,000mAh బ్యాటరీని, ఆ తర్వాత హానర్ పవర్ 2 లో 10,080mAh బ్యాటరీని ప్రయోగాత్మకంగా అందించి సక్సెస్ అయింది. ఇప్పుడు X80 GT ద్వారా ఆ పరిమితులను మరింత పెంచుతూ ఏకంగా 13,000mAh మార్కును దాటేస్తోంది. అయితే ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మరీ లావుగా లేదా బరువుగా ఉండకుండా చూసేందుకు కంపెనీ సరికొత్త సిలికాన్-కార్బన్ సెల్స్ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడుతోంది. ఈ టెక్నాలజీ వల్ల తక్కువ ప్లేస్‌లో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసే అవకాశం ఉంటుంది, తద్వారా ఫోన్ డిజైన్ స్లిమ్‌గానే ఉంటూ భారీ పవర్‌ను అందిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్ లీడర్లుగా ఉన్న యాపిల్, గూగుల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు ఇప్పటికీ 5,000mAh బ్యాటరీల దగ్గరే ఆగిపోయాయి. అవి సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఫిజికల్ కెపాసిటీ విషయంలో హానర్ వంటి చైనీస్ బ్రాండ్ల దూకుడు ముందు వెనుకబడి ఉన్నాయి. ఈ పోటీని తట్టుకోవడానికి శామ్‌సంగ్ కూడా ఇప్పుడు మేల్కొన్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో రాబోయే తమ డివైజ్‌ల కోసం శామ్‌సంగ్ ఏకంగా 12,000mAh నుండి 18,000mAh వరకు సామర్థ్యం గల బ్యాటరీ సెల్స్‌ను టెస్టింగ్ చేస్తోందని సమాచారం. దీనివల్ల రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాకుండా, అది ఒక మూవింగ్ పవర్ స్టేషన్‌లా మారబోతోందని అర్థమవుతోంది.
ప్రస్తుతానికి Honor X80 GT కి సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్లు లేదా అధికారిక లాంచ్ డేట్ గురించి కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ లీక్ అయిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ అతి త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. 13,080mAh బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటే, ఇది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్ అవుతుందనడంలో సందేహం లేదు. ఎప్పుడూ ఛార్జింగ్ కేబుల్ పట్టుకుని తిరిగే అవసరం లేకుండా, ఫ్రీగా స్మార్ట్‌ఫోన్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది. మరి ఆనర్ ఈ అద్భుతాన్ని ఎప్పుడు ఆవిష్కరిస్తుందో చూడాలి.
ప్రకటన
ప్రకటన