Photo Credit: Motorola
Moto Book 60 Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది
ఇండియాలో Motorola తమ Moto Book 60 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. లెనోవా యాజమాన్యంలోని బ్రాండ్ నుంచి మన దేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ల్యాప్‌ట్యాప్ ఇది. 14-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 65W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతులో 60Wh బ్యాటరీని ఈ ల్యాప్‌ట్యాప్‌కు అందించారు. అలాగే, ఇది కలర్ ఆప్షన్‌లలో లభించనుంది. ఇంటెల్ కోర్ 7 240H ప్రాసెసర్, 32 జీబీ RAM, 1TB వరకూ స్టోరేజీ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తుంది. మరో వారం రోజుల తర్వాత నుంచి ఈ Moto Book 60 ల్యాప్‌టాప్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.స్పెషల్ లాంఛ్ ధరలు,Moto Book 60 ఏప్రిల్ 23 నుంచి మన దేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలకు వస్తోంది. ఇంటెల్ కోర్ 5 సరీస్ ప్రాసెసర్‌తో 16GB వెర్షన్ ధర రూ.69,999గా ఉంది. అయితే, దీని స్పెషల్ లాంఛ్ ధర రూ.61,999 మాత్రమే. అలాగే, 16GB + 512GB, 16GB + 1TB RAM వెర్షన్‌లు ఇంటెల్ కోర్ 7 సిరీస్ ప్రాసెసర్‌తో అయితే, ధరలు వరుసగా రూ. 74,990, రూ. 78,990గా ఉన్నాయి. వీటిని లాంఛ్ డిస్కౌంట్‌తో పొందవచ్చు. అప్పుడు వీటి ధర ఒక్కక్కటీ రూ.73,999గా ఉంది.
హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ Moto Book 60 రన్నవుతోంది. టీయూవీ రీన్‌ల్యాండ్‌లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్‌లతో వస్తోంది. అలాగే, బటన్‌లెస్ మైలార్ టచ్‌ప్యాడ్‌ను కూడా అందించారు. ఇది ఇంటెల్ కోర్ 7 240H, ఇంటెల్ కోర్ 5 210H ప్రాసెసర్ ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్‌తో ఆప్షన్‌లలో లభించనుంది. దీనిని 32GB వరకూ డీడీఆర్ 5 RAM, 1TB PCIe 4.0 SSD స్టోరేజ్‌తో దీనిని అందించారు.
Moto Book 60లో యూజర్‌ల ప్రైవసీ షట్టర్‌తో కూడిన 1080p వెబ్‌క్యామ్, విండోస్ హలో ఫేస్ రికగ్నిషన్ కోసం IR కెమెరాను అందించారు. ఇది మిలిటరీ-గ్రేడ్ (MIL-STD-810H) క్వాలిటీతో వస్తోంది. డాల్బీ అట్మాస్, 2W ఆడియో అవుట్ పుట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌ను అందిస్తున్నారు. ఇక కనెక్టివిటీ ఆప్షన్‌లను చూస్తే.. Wi-Fi 7, బ్లూటూత్ 5.4లకు మద్దతు ఇస్తుంది. రెండు యూఎస్‌బి టైప్-ఏ 3.2 జెన్ 1 పోర్ట్‌లు, ఒక డిస్‌ప్లేపోర్ట్, రెండు యూఎస్‌బీ టైప్-సీ 3.2 జెన్ పోర్ట్‌లు, 3.5ఎంఎం ఆడియోజాక్ వంటివి ఉన్నాయి.
ఇది అనేక ఏఐ-ఆధారిత ఫీచర్స్‌ను కలిగి ఉంది. పీసీ, ఫోన్, ట్యాబ్, టీవీల డేటాను సులువుగా అటాచ్ చేసేందుకు, బదిలీ చేసుందుకు స్మార్ట్ కనెక్ట్, స్మార్ట్ క్లిప్‌బోర్డ్, ఫైల్ ట్రాన్స్‌ఫర్‌లను అందించారు. ఫర్మ్‌వేర్ టీపీఎం 2.0 సక్యూరిటీ చిప్‌తో వస్తుంది. ఇది 313.4 x 221 x 16.9mm పరిమాణంతో 1.39 కిలోల బరువు ఉంటుంది. బ్రాంజ్ గ్రీన్, వెడ్జ్ వుడ్ కలర్ ఆప్షన్‌లలో ఈ Moto Book 60 లభిస్తుంది.
ప్రకటన
ప్రకటన