అసర్ నైట్రో లైట్ 16లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రీ-ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. 16 అంగుళాల WUXGA (1920x1200 pixels) రిజల్యూషన్ కలిగిన IPS LCD డిస్‌ప్లే 165Hz రిఫ్రెష్‌రేట్‌తో వస్తుంది. ఇది గేమింగ్‌కు మరియు వీడియో ఎడిటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.
Photo Credit: Acer
ఏసర్ నైట్రో లైట్ 16 హైలైట్ చేసిన WASD కీలను కలిగి ఉంది
గేమింగ్ ప్రియులకు శుభవార్త... ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ అసర్, భారత మార్కెట్లోకి తన కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. "అసర్ నైట్రో లైట్ 16" పేరుతో ఈ మోడల్ బుధవారం విడుదలైంది. అత్యాధునిక ఫీచర్లతో, స్టైలిష్ డిజైన్తో, స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్, ఇన్టెల్ 13 జెన్ కోర్ i5, i7 ప్రాసెసర్లతో వస్తోంది. అలాగే, 6GB వీడియో మెమొరీతో కూడిన NVIDIA GeForce RTX 4050 గ్రాఫిక్స్ కార్డుతో కూడా ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. అసర్ నైట్రో లైట్ 16 ప్రారంభ ధర రూ.79,990గా నిర్ణయించబడింది. ఈ ధరకు వచ్చే బేసిక్ వెర్షన్‌లో Intel Core i5-13420H ప్రాసెసర్, 16GB RAM ఉంటాయి. Intel Core i7-13620H ప్రాసెసర్‌తో వచ్చిన మరో వేరియంట్ ధర రూ.89,999గా ఉంది. ప్రస్తుతం ఇది పెరల్ వైట్ కలర్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ మోడల్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవారు అసర్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు మరియు అసర్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
అసర్ నైట్రో లైట్ 16లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రీ-ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. 16 అంగుళాల WUXGA (1920x1200 pixels) రిజల్యూషన్ కలిగిన IPS LCD డిస్‌ప్లే 165Hz రిఫ్రెష్‌రేట్‌తో వస్తుంది. ఈ ఆప్షన్ వల్ల లాప్టాప్ యూసేజ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది గేమింగ్‌కు మరియు వీడియో ఎడిటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో అత్యధికంగా Intel Core i7-13620H ప్రాసెసర్‌తో పాటు RTX 4050 GPU (6GB GDDR6 VRAM), 16GB DDR5 RAM, 512GB SSD స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు రెండు స్టీరియో స్పీకర్లు, వీడియో కాలింగ్ కోసం ఫుల్ హెచ్‌డీ వెబ్‌కెమ్, అదనంగా ప్రైవసీ కోసం వెబ్‌కెమ్ షట్టర్ కూడా ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా చూస్తే Wi-Fi 6, Bluetooth 5.1, USB 3.2 Gen A పోర్ట్, USB 3.2 పోర్ట్, థండర్‌బోల్ట్ 4 పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, HDMI 2.1 పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. బ్యాక్లిట్ కీబోర్డ్‌లో ప్రత్యేకమైన “Copilot” కీ కూడా ఉంది, ఇది విండోస్ కో పైలట్ ఫీచర్‌కు ఫాస్ట్ యాక్సెస్ అందిస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ 3-సెల్ 53Wh లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది, ఇది 100W USB-PD ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ లాప్టాప్ 1.95 కిలోల బరువు, 362.2×248.47×22.9mm థిక్నెస్ తో వస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే, అసర్ నైట్రో లైట్ 16 ల్యాప్‌టాప్ గేమింగ్‌కు, వీడియో ఎడిటింగ్కు, అధిక పనితీరు అవసరమయ్యే ప్రొఫెషనల్ వర్క్‌కు కూడా సరిగ్గా సరిపోతుంది. పవర్ఫుల్ హార్డ్వేర్, మోడర్న్ డిజైన్, ఆకర్షణీయమైన ధరలతో ఇది మార్కెట్లో బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఒకటే కలర్ ఆప్షన్ ఉండడం, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడం దీనికి బాడ్ డ్రాప్స్ గా చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన
Neutrino Detectors May Unlock the Search for Light Dark Matter, Physicists Say
Uranus and Neptune May Be Rocky Worlds Not Ice Giants, New Research Shows
Steal OTT Release Date: When and Where to Watch Sophie Turner Starrer Movie Online?
Murder Report (2025): A Dark Korean Crime Thriller Now Streaming on Prime Video