వీడియో ఎడిటింగ్ కోసం ఏసర్ స్విఫ్ట్‌ నియోలో ప్రత్యేక ఫీచర్

ప్రముఖ బ్రాండ్ ఏసర్ నుంచి ఏసర్ స్విఫ్ట్ నియో శుక్రవారం ఇండియాలో విడుదలైంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 సీపీయూ, 32జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్ కేపాసిటీ కలిగి ఉంది. ఇది అల్యూమినియంతో తయారై ప్రీమియం లుక్‌లో అట్రాక్ట్ చేస్తోంది.

వీడియో ఎడిటింగ్ కోసం ఏసర్ స్విఫ్ట్‌ నియోలో ప్రత్యేక ఫీచర్

Photo Credit: Acer

ఏసర్ స్విఫ్ట్ నియో రోజ్ గోల్డ్ కలర్ వేలో లభిస్తుంది

ముఖ్యాంశాలు
  • ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది
  • ఆన్-డివైస్ AI ఆధారిత పనితీరును ఈ డివైస్ అందిస్తుంది
  • డైమండ్-కట్ టచ్‌ప్యాడ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించబడింది
ప్రకటన

భారత మార్కెట్లోకి మరొ కొత్త ల్యాప్‌ టాప్ విడుదలైంది. ప్రముఖ బ్రాండ్ ఏసర్ ఇండియాలో ఏసర్ స్విఫ్ట్ నియో పేరుతో శుక్రవారం లాంచ్ చేసింది. ఇందులో శక్తివంతమైన ఇంటెల్ కోర్ అల్ట్రా 5 CPU, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌ కార్డ్ అమర్చారు. ఇది 32జీబీ ర్యామ్‌తో వస్తోంది. ఈ ల్యాప్‌టాప్ కోపిలట్, ఇంటెల్ AI బూస్ట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఆన్-డివైస్ AI-ఆధారిత పనితీరును మెరుగుపరుస్తుందని ఏసర్ పేర్కొంది. స్విఫ్ట్ నియో.. డైమండ్-కట్ టచ్‌ప్యాడ్, ఫింగర్‌ప్రింట్ రీడర్‌తో వస్తోంది. దీనిలో కోపైలట్ డెడికేటెడ్ కీలతో బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉంది. దీని హింజ్‌ను ఒకే చేతితో సులువుగా తెరవవచ్చు, మూసివేయవచ్చని కంపెనీ వెల్లడించింది.భారత్‌లో ఏసర్ స్విఫ్ట్ నియో ధర,ఇండియన్ మార్కెట్‌లో ఇది రూ. 61,990 ధరకు లభిస్తోంది. దీనిని ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఏసర్ నియో స్విఫ్ట్ రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది చూడటానికి ప్రీమియం లుక్‌లో ఆకర్షనీయంగా ఉంది.
ఏసర్ నియో స్విఫ్ట్ స్పెసిఫికేషన్లు

ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల WUXGA (1,920×1,200 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 92% NTSC, 100% sRGB కలర్ గామట్ కవరేజ్‌ కలిగి ఉంది. ఏసర్ స్విఫ్ట్ నియోలో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 CPU ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 32జీబీ ర్యామ్ ఉంది. 1TB వరకు NVMe PCIe Gen 4 SSD స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ గ్యాడ్జెట్ అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్ 64 బిట్ విండోస్ 11 హోమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 1080p ఫుల్ హెచ్‌డీ వెబ్‌ కెమెరా అమర్చబడి ఉంది. ఇది కోపైలట్, ఇంటెల్ ఏఐ బూస్ట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో వీడియో కాలింగ్ కోసం AI యాప్‌లు, మెరుగైన గోప్యత, సామర్థ్యం కోసం ఆన్-డివైస్ AI ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి.

ఈ ఫీచర్లు వినియోగదారులు ఒకేసారి వివిధ రకాల టాస్క్స్‌ చేయడంలో సహాయపడుతాయి. అలాగే హై క్వాలిటీ వీడియో ఎడిటింగ్‌ చేసే ఎలాంటి ఆటంకం లేకుండా తోడ్పాటు అందిస్తాయి.
లాంగ్ బ్యాటరీ

ఏసర్ స్విఫ్ట్ నియో లాంగ్ లైఫ్ బ్యాటరీని అందిస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8.5 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 55Wh బ్యాటరీని కలిగి ఉంది. 65W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఇందులో Wi-Fi 6, బ్లూటూత్ 5.2, హెచ్‌డీఎంఐ, డ్యూయల్ USB టైప్-C పోర్ట్‌లు ఉన్నాయి.

సూపర్బ్ సెక్యూరిటీ ఫీచర్స్

భద్రత పరంగా ఏసర్ స్విఫ్ట్ నియోలో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇది హార్డ్‌వేర్ స్థాయిలో సెక్యూర్డ్-కోర్ PC ప్రొటెక్షన్ కలిగి ఉంది. బయోమెట్రిక్ నిర్ధారణ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఇక డిజైన్ పరంగా ఈ ల్యాప్‌టాప్ స్లిమ్‌గా ఆకర్షనీయంగా ఉంది. అల్యూమినియంతో తయారు కావడం వల్ల ప్రీమియం లుక్‌లో ఉంటుంది. ఇది కేవలం 1.2kg బరువు ఉండి తేలికగా ఉంటుంది. ఇది 315×240×14.9 మిమీ సైజులో ఉంటుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »