ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల పూర్తి HD+ (1920x1200 పిక్సెల్స్) IPS డిస్‌ప్లేతో వస్తుంది. 16:10 యాస్పెక్ట్ రేషియో, 60Hz రిఫ్రెష్ రేట్, 45% NTSC కలర్ గామట్, 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
Photo Credit: Asus
ఆసుస్ వివోబుక్ 14 (X1407QA) ప్రత్యేకమైన కోపైలట్ కీని కలిగి ఉంది
భారత్ మార్కెట్లోకి ఆసూస్ కొత్త వివో బుక్ 14 ల్యాప్‌టాప్ (X1407QA) ప్రవేశించింది. జూలై 22న విడుదలైన ఈ మోడల్‌లో క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ X ప్రాసెసర్ తోపాటు, హెక్సగాన్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని కలిపారు. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పనులను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది.ఈ ల్యాప్‌టాప్ ధర రూ.65,990గా నిర్ణయించారు. ఆసూస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫోటోల ప్రకారం, ఇది డార్క్ గ్రే రంగులో లభించే అవకాశం ఉంది. వివో బుక్ 14లో 14 అంగుళాల ఫుల్ HD+ (1920x1200 pixels) IPS డిస్‌ప్లే వుంది. ఇది 16:10 యాస్పెక్ట్ రేషియో, 60Hz రిఫ్రెష్ రేట్, 45% NTSC కలర్ గామట్, 300 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. TÜV Rheinland సర్టిఫికేషన్ ఉన్న ఈ డిస్‌ప్లే, తక్కువ బ్లూ లైట్ విడుదల చేసేలా రూపొందించారు.
డిస్‌ప్లే 180 డిగ్రీల వరకూ తిరుగుతుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ X1-26-100 ఆక్టా కోర్ చిప్ ఉంది. దీని గరిష్ట క్లాక్ స్పీడ్ 2.97GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో ఇంటిగ్రేటెడ్ GPU వాడారు. AI పనితీరును మెరుగుపర్చేందుకు 45 TOPS వేగంతో పని చేసే హెక్సగాన్ NPU ఉంది. ఈ వివో బుక్14 లో 16GB LPDDR5x RAM ఉండగా, 512GB PCIe 4.0 NVMe M.2 SSD వరకు స్టోరేజ్ సపోర్ట్ అందుతుంది.
కెమెరా, సెక్యూరిటీ:
వీడియో కాల్స్ కోసం ఫుల్ HD IR కెమెరా ఉంది. దీనితో Windows Hello ద్వారా ఫేషియల్ లాగిన్ సపోర్ట్ ఉంటుంది. కెమెరాకు ప్రైవసీ షట్టర్ కూడా ఇచ్చారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ...Wi-Fi 6E, Bluetooth 5.3 వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డేటా భద్రత కోసం మైక్రోసాఫ్ట్ ప్లుంటన్ చిప్‌ను కలిపారు. టైపింగ్ కోసం ఎర్గోసెన్స్ కీబోర్డ్ ఉంది. ఇందులో విండోస్ కోపైలట్ యాక్సెస్‌కు ప్రత్యేక కీ ఉంది. ఈ డివైస్ లో మొత్తం నాలుగు USB పోర్టులు ఉన్నాయి. రెండు USB 3.2 Gen 1 Type-A (5Gbps) పోర్టులు, రెండు USB 4.0 Gen 3 Type-C (డేటా, పవర్ డెలివరీ, డిస్‌ప్లే – 40Gbps వరకు) పోర్టులు ఉంటాయి. వీటికి అదనంగా HDMI 2.1 పోర్టు, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఇక ఆడియో విషయానికి వస్తే ఇది
డోల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లతో వస్తుంది. వివో బుక్ 14లో 50Wh బ్యాటరీ ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం, బ్యాటరీ బ్యాకప్ సుమారు 29 గంటల వరకూ ఉండవచ్చు.
ఈ ల్యాప్‌టాప్ 315.1 x 223.4 x 17.9 mm డైమెన్షన్స్ తో, 1.49 కిలోలు బరువుతో వస్తుంది. దీని లైట్ వెయిట్ డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ, AI ఫీచర్స్ కారణంగా ఇది విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటివ్ యూజర్లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ప్రకటన
ప్రకటన