Photo Credit: ASUS
Chromebook CX14 (చిత్రంలో) మరియు CX15 లు MIL-STD-810H మిలిటాను పొందుతాయి
ప్రముఖ ల్యాప్‌ట్యాప్ తయారీ సంస్థ Asus కంపెనీ ఇంటెల్ సలెరాన్ ప్రాసెసర్‌లతో రన్ అయ్యే Chromebook CX14, Chromebook CX15 సిరీస్ ల్యాప్‌ట్యాప్‌ల రిఫ్రెష్డ్ లైనప్‌ను ప్రకటించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు మోడల్స్ కూడా 14- అంగుళాలు, 15- అంగుళాల స్క్రీన్ సైజ్ ఆప్షన్‌లలో ఫుల్ హెడీ స్క్రీన్, 180- డిగ్రీల lay- flat హంజ్ డిజైన్‌తో మార్కెట్‌లోకి వస్తున్నాయి. Asus Chromebook ప్లస్ మోడల్స్‌ను సైతం పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్స్ ఇంటెల్ కోర్ 3 ఎన్355 సీపీయూల వరకూ పవర్‌ను కలిగి ఉంటాయి. ఇన్‌బిల్డ్ గూగుల్ కృత్రిమ మేదస్సు ఫీచర్స్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి.టైటాన్ సీ సెక్యూరిటీ చిప్,కొత్త రాబోతోన్న Asus Chromebook CX14 మోడల్ 45 శాతం ఎన్‌టీఎస్‌సీ కలర్ గామట్ కవరేజ్‌ను అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. అంతే కాదు, Chromebook CX15 మోడల్ 15.6- అంగుళాల ఫుల్ హెఛ్‌డీ స్క్రీన్‌ను ఒకే స్పెసిఫికేషన్‌లతో వస్తోంది. ఈ రెండు ల్యాప్‌ట్యాప్‌లు కూడా ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్ ఎన్4500 ద్వారా శక్తిని గ్రహిస్తాయి. అంతే కాదు, రెండు మోడల్స్ కూడా టైటాన్ సీ సెక్యూరిటీ చిప్‌నుతో రూపొందించబడ్డాయి.
ఈ సిరీస్ కనెక్టివిటీ ఆప్షన్‌ల విషయానికి వస్తే.. డిస్‌ప్లేపోర్ట్ 1.2 సపోర్ట్‌తో యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-సీ పోర్ట్, హెచ్‌డీఎంఐ 1.4బి పోర్ట్, యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-ఏ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, కన్సింగ్టన్ లాక్ వంటివి ఉన్నాయి. అలాగే, ఈ రెండు మోడల్స్ కూడా డ్యూయల్ 2W స్టీరియో స్పీకర్లతో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ మైక్రో ఫోన్‌లు, గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇవి 1.35ఎంఎం కీబోర్డ్‌తో వస్తున్నాయి. అలాగే, CX14, CX15 వరుసగా 42Wh, 50Wh బ్యాటరీలతో రూపొందించబడ్డాయి.
ఈ సిరీస్‌లోని కొన్ని మోడల్స్ ఇంటెల్ ట్విన్ లేక్ లైనప్‌తో భాగమైన ఇంటెల్ కోర్ 3 ఎన్355 ప్రాసెసర్‌తోపాటు ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌తో శక్తిని ఇస్తాయి. ఈ చిప్ 16జీబీ వరకూ LPDDR5 RAM, 256జీబీ వరకూ ఆన్‌బోర్డ్ eMMC స్టోరేజ్‌తో జత చేయబడి ఉంది. వాటిని కూడా కొనుగోలుదారులు ఎంపిక చేయొచ్చు. అలాగే, రెండు మోడల్స్‌లోనూ కంపెనీ Wi-Fi 6E సామర్థ్యాలను అందిస్తోంది. అయితే, వీటిలో ఇతర స్పెసిఫికేషన్స్ Chromebook మోడల్స్ మాదిరిగానే ఉంటాయి.
ఈ క్రోమ్‌బుక్ ప్లస్ ల్యాప్‌ట్యాప్‌లు ఏడాది పాటు గూగుల్ ఒన్ ఏఐ ప్రీమియం ప్లాన్‌తో ఎలాంటి అదనపు ఖర్చూ లేకుండా అందిస్తుంది. అలాగే, ఇది జెమెని అడ్వాన్స్, 2టీబీ క్లౌడ్ స్టోరేజ్, ఇంటిగ్రేటెడ్ ఏఐ టూల్స్‌కు జీమెయిల్, Docs, గూగుల్ సూట్‌లోని ఇతర యాప్‌లలో యాక్సెస్ అందిస్తోంది. అయితే, రాబోయే ఈ కొత్త మోడల్స్‌కు సంబంధించిన ధరల వివరాలు కంపెనీ ఇంత వరకూ అధికారికంగా వెల్లడించలేదు.
ప్రకటన
ప్రకటన