Primebook 2 Neo (ప్రైమ్ బుక్ 2 నియో) ల్యాప్‌టాప్ ఇండియన్ మార్కెట్లోకి జూలై 31న రాబోతోంది. దీని ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. కేవలం రూ. 15, 990కే ఈ న్యూ మోడల్ ల్యాప్‌టాప్ రాబోతోంది.
Photo Credit: Primebook
ప్రైమ్‌బుక్ 2 నియోలో 6GB LPDDR4X RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ ఉంటాయి
టెక్నాలజీ ప్రాముఖ్యత పెరిగిన ఈ కాలంలో ల్యాప్‌టాప్ ప్రతి ఒక్కరికి చాలా అవసరమైంది. చదువుకోవడానికైనా, ఏ పని చేసుకోవడానికైనా ల్యాప్‌టాప్ కీలకంగా మారింది. అందుకే దేశంలో ల్యాప్‌టాప్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. దీనికనుగుణంగా ల్యాప్‌టాప్‌లో కొత్త మోడళ్లు ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వాళ్లకి భారతీయ టెక్ బ్రాండ్ Prime Book 2 Neo నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ బ్రాండ్ నుంచి కొత్త ల్యాప్‌టాప్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా వెలువడింది. ఈ ల్యాప్‌టాప్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ప్రాసెసర్, బలమైన ఆపరేటింగ్ సిస్టమ్, Ram, AI టెక్నాలజీలకు సంబంధించి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయిPrimebook 2 Neo ల్యాప్‌టాప్ 6GB RAMతో పాటు MediaTek Helio G99 ప్రాసెసర్‌తో రానుంది. ల్యాప్‌టాప్‌లో ఇన్‌బిల్ట్ ఆన్-స్క్రీన్ AI అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 512 GB వరకు స్టోరేజ్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఇంకో అదిరిపోయే న్యూస్ ఏంటంటే ఈ ల్యాప్‌టాప్ అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.
Prime Book 2 Neo ల్యాప్‌టాప్ జూలై 31న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ. 15,990లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ప్రైమ్‌బుక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిపై మంచి ఆఫర్ కూడా ఉంది. అధికారిక వెబ్‌సైట్‌లో మొదటి 100 మంది కొనుగోలుదారులకు డిస్కౌంట్ కూడా లభింనుంది. ల్యాప్‌టాప్ ధర కంటే రూ. 1,000లు తక్కువకే అందించనున్నారు.
ప్రైమ్‌బుక్ 2 నియో కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత Prime OS 3.0 పై నడుస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి99 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది 6GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో రాబోతోంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను 512GB వరకు విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. ఇవే కాదు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. నిత్యం ల్యాప్‌టాప్‌పై పని చేసేవారికి అనుకూలంగా ఉండే విధంగా ఇందులో ఆధునాతనమైన ఫీచర్లను ఏర్పాటు చేశాు. AI టెక్నాలజీ ఉపయోగం పెరిగిన ఈ తరుణంలో దీనికి అనుగుణంగా ల్యాప్‌టాప్‌లో ప్రైమ్‌బుక్ 2 నియో AI కంపానియన్ మోడ్ అని పిలువబడే ఇన్‌బిల్ట్ ఆన్-స్క్రీన్ AI అసిస్టెంట్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా పనులు మరింత సులభం కానున్నాయి. ఎందుకంటే ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు PDF డాక్యుమెంట్లను, ఆర్టికల్స్ వెబ్ కంటెంట్‌ను పొందవచ్చు. ఏ విషయంలోనైనా సమాచారం కోసం వెదికే క్రమంలో ఈ AI ఆప్షన్ చాలా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా Primebook 2 Neo ల్యాప్‌టాప్‌లో AI పవర్డ్ గ్లోబల్ సెర్చ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా సరే సులువుగా ఫైల్‌లు, సెట్టింగ్‌లు, యాప్‌లలో సెర్చింగ్ చేసుకోవచ్చు. ఇది పూర్తి Linux, Windows (క్లోజ్డ్ బీటా) క్లౌడ్ PCతో ప్రీలోడ్ చేయబడుతుంది. కొత్త పరికరం Android గేమ్‌ల కోసం మెరుగైన నావిగేషన్, నియంత్రణ కోసం ఇంటిగ్రేటెడ్ కీమ్యాపింగ్ మద్దతుతో గేమింగ్ ఆప్టిమైజ్డ్ మోడ్‌ను కలిగి ఉంది. అంటే విద్యార్థులైనా, స్కాలర్లు, ఉద్యోగులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, బిజినెస్ మ్యాన్‌లు ఇలా ఎవరైనా సరే ఎంతో సౌకర్యంగా పని చేసుకునే విధంగా ఈ ల్యాప్‌టాప్‌ని రూపొందించడం జరిగింది.
ఇక ల్యాప్‌ట్యాప్ చూడ్డానికి చాలా చాలా అందంగా ఉండనంది. చాలా సన్నగా, తేలికైన డిజైన్‌ను కలిగి ఉండనుంది. అంటే దీనిని ఎక్కడకికంటే అక్కడే తేలీక క్యారీ చేయవచ్చు. అంతేకాదు ఇందులో ఉండే ప్రత్యేక యాప్ స్టోర్ ద్వారా 50,000 కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. దీంతోపాటు బడ్జెట్‌లో కొనాలనకునే వినియోగదారులకు ఈ ల్యాప్‌టాప్ మంచి ఆప్షన్. ఎందుకంటే ఇంత ఆధునికమైన ఫీచర్లున్న ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర కేవలం 15,990లు మాత్రమే. దీంతో ప్రతి ఒక్కరూ ఈ ల్యాప్‌టాప్‌లను సొంతం చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
New Images of Interstellar Object 3I/ATLAS Show a Giant Jet Shooting Toward the Sun
NASA’s Europa Clipper May Cross a Comet’s Tail, Offering Rare Glimpse of Interstellar Material
Newly Found ‘Super-Earth’ GJ 251 c Could Be One of the Most Promising Worlds for Alien Life
New Fossil Evidence Shows Dinosaurs Flourished Until Their Final Days