దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని అందించారు. గతేడాది వచ్చిన Infinix Note 40X 5Gకి కొనసాగింపుగా Infinix Note 50X 5G మోడల్ వచ్చింది.
Photo Credit: Infinix
ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఏప్రిల్ 3 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి వస్తుంది.
Transsion Holdings అనుబంధ సంస్థ నుండి తాజా నోట్-సిరీస్ ఆఫర్‌గా Infinix Note 50X 5G మన దేశంలో లాంఛ్ అయ్యింది. ఈ కొత్త 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌పై 8GB వరకు RAMతో రన్ అవుతుంది. Infinix Note 50X 5G ఆండ్రాయిడ్ 15 ఆధారంగా XOS 15 ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని అందించారు. గతేడాది వచ్చిన Infinix Note 40X 5Gకి కొనసాగింపుగా ఈ కొత్త మోడల్ వచ్చింది.
Infinix Note 50X 5G మోడల్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 12,999గా ఉంది. ఇది ఎన్చాన్టెడ్ పర్పుల్, సీ బ్రీజ్ గ్రీన్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. సీ బ్రీజ్ గ్రీన్ షేడ్ వీగన్ లెదర్ ఫినిషింగ్ కలిగి ఉండగా, మిగిలినవి మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తున్నాయి. కొనుగోలుదారులు రూ. 1,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందొచ్చు. ఆఫర్లతో Infinix Note 50X 5G బేస్ వేరియంట్‌ను రూ. 10,499 కు కొనుగోలు చేయవచ్చు. ఇది ఏప్రిల్ 3 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి వస్తోంది.
Infinix Note 50X 5G డ్యూయల్ సిమ్ (నానో)తో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా XOS 15 పై రన్ అవుతుంది. కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌ను ప్యాక్ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. మెమ్‌ఫ్యూజన్ టెక్నాలజీతో, ఆన్‌బోర్డ్ మెమరీని 6GB నుండి 12GB వరకు, 8GB నుండి 16GB వరకు పెంచవచ్చు.
దీని వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్‌ను అందించారు. దీనికి 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అమర్చారు. ప్రైమరీ కెమెరా 4K రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయగలదు. 12 కంటే ఎక్కువ ఫోటోగ్రఫీ మోడ్‌లను అందిస్తుంది. జెమ్-కట్ కెమెరా మాడ్యూల్‌లో యాక్టివ్ హాలో లైటింగ్ అనే LED లైటింగ్ అందించారు. ఇది నోటిఫికేషన్‌లు, కాల్‌లు, ఛార్జింగ్ కోసం ప్రకాశిస్తుంది.
Infinix Note 50X 5Gలో DTS-ఆధారిత డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. మిలిటరీ-గ్రేడ్ (MIL-STD-810H) క్వాలటీ ధృవీకరణ ఉంది. ఈ ఫోన్ నీరు, ధూళి నియంత్రణకు IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఇది వన్-ట్యాప్ ఇన్ఫినిక్స్ AI కార్యాచరణతో వస్తోంది. ఆన్-స్క్రీన్ అవేర్‌నెస్, AI నోట్, సర్కిల్ టు సెర్చ్, రైటింగ్ అసిస్టెంట్, ఇన్ఫినిక్స్ AI అసిస్టెంట్, ఫోలాక్స్ వంటి అనేక AI-ఆధారిత ఫీచర్స్‌ను అందిస్తోంది. ఈ బ్యాటరీ 10W వైర్డు రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ప్రకటన
ప్రకటన
Honor Power 2 Chipset, Display Specifications Tipped; Could Launch With 10,080mAh Battery
Hollow Knight: Silksong's First Major Expansion, Sea of Sorrow, Announced; Launch Set for 2026