భారత్‌లో లాంచ్ అయిన Samsung Galaxy S25 Ultra: ధర, స్పెసిఫికేషన్‌లు తెలుసా

Samsung Galaxy S25 అల్ట్రా 12GB RAM, 1TB వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం అప్‌గ్రేడ్ చేయబడిన 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది.

భారత్‌లో లాంచ్ అయిన Samsung Galaxy S25 Ultra: ధర, స్పెసిఫికేషన్‌లు తెలుసా

Photo Credit: Samsung

Samsung Galaxy S25 Ultra One UI 7లో కొత్త Galaxy AI ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది

ముఖ్యాంశాలు
  • Samsung Galaxy S25 Ultra 5000mAh బ్యాటరీతో వ‌స్తోంది
  • ఈ హ్యాండ్‌సెట్ Samsung యాప్‌ల లోపల జెమిని AI ఫీచ‌ర్స్‌కు సపోర్ట్ చేస్తుంద
  • దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొట‌క్ష‌న్ కలిగి ఉంది
ప్రకటన

Galaxy S25 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా Samsung Galaxy S25 అల్ట్రా లాంచ్ అయింది. ఈ వారం జరిగిన Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ దక్షిణ కొరియా సంస్థ హ్యాండ్‌సెట్‌ను ప్రదర్శించింది. ఇది Galaxy చిప్ కోసం కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా శక్తిని గ్ర‌హిస్తుంది. అలాగే, 12GB RAM, 1TB వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం అప్‌గ్రేడ్ చేయబడిన 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రో మోడల్‌ల మాదిరిగానే లాగ్ వీడియోను రికార్డ్ చేయగలదు.

Google జెమిని AI అసిస్టెంట్

అప్‌డేట్ అయిన‌ లైనప్‌లోని ఇతర రెండు మోడళ్ల మాదిరిగానే Samsung Galaxy S25 అల్ట్రా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఉన్న One UI 7తో వ‌స్తోంది. ఇది కొత్త Now Brief ఫీచర్‌కు, క‌ల‌ర్‌ రంగు పిల్ లోపల ముఖ్యమైన సమాచారాన్ని స‌ర్ఫేస్‌ చేసే లాక్ స్క్రీన్‌పై కొత్త Now బార్‌కు కూడా స‌పోర్ట్ చేస్తుంది. కంపెనీ యాప్‌లు Google జెమిని AI అసిస్టెంట్ స‌పోర్ట్‌తో అప్‌డేట్ చేయ‌బ‌డ్డాయి. అలాగే, వినియోగదారులు YouTube వంటి యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు Samsung Notes వంటి యాప్‌లతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది.

మ‌న దేశంలో ధర రూ. 1,29,999

12GB RAM, 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ Samsung Galaxy S25 Ultra ధర $1,299 (సుమారు రూ. 1,12,300)గా నిర్ణయించబడింది. మ‌న దేశంలో ధర రూ. 1,29,999 నుండి ప్రారంభమవుతుంది. టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్‌బ్లూ, టైటానియం వైట్‌సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు ఇప్ప‌టికే USలో ప్రారంభమవ్వ‌గా, ఫిబ్రవరి 7 నుండి ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని Samsung తెలిపింది.

ఆర్మర్ 2 ప్రొట‌క్ష‌న్

ఏడు సంవత్సరాల Android OS, సెక్యూరిటీ అప్‌డేట్‌ల‌ను పొందనుంది. 6.9-అంగుళాల (1,400x3,120 పిక్సెల్‌లు) డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌తో 1Hz-120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2600nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో రూపొందించారు. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొట‌క్ష‌న్ కలిగి ఉంది.

నాలుగు వెనుక కెమెరాలు

ఈ హ్యాండ్‌సెట్‌లో నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి. ఇందులో 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, UWB, GPS, USB టైప్-C పోర్ట్‌లకు స‌పోర్ట్ చేస్తుంది. Samsung S పెన్ స్టైలస్‌కు కూడా స‌పోర్ట్ చేస్తుంది. ఇది దుమ్ము, నీటి నియంత్ర‌ణ‌ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో 45W వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 (15W), వైర్‌లెస్ పవర్ షేర్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. 162.8×77.6×8.2mm ప‌రిమాణంతో 218 గ్రాముల బ‌రువు ఉంటుంది.

ces_story_below_text

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 200MP HP2 సెన్సార్ ఇదే ఇప్పటికే Galaxy S25 Ultraలో కూడా ఉపయోగించారు.
  2. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఈ డివైస్‌లో పలు ఇంటిగ్రేటెడ్ AI టూల్స్ ఉన్నాయి.
  3. వాట్సప్‌లో న్యూ ఇయర్ స్పెషల్ ఫీచర్స్.. ఇక ప్రత్యేకం కానున్న కొత్త ఏడాది
  4. Find N6లో శక్తివంతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.
  5. వాట్సప్‌లో న్యూ ఇయర్ స్పెషల్ ఫీచర్స్.. ఇక ప్రత్యేకం కానున్న కొత్త ఏడాది
  6. దీంతో ఫోటోగ్రఫీ మరియు జూమ్ క్వాలిటీలో కొత్త స్థాయిని అందించే అవకాశముంది
  7. అందువల్లే ఇది అమెజాన్‌లో వేగంగా పెరుగుతున్న విభాగాల్లో ఒకటిగా మారిందని తెలిపారు.
  8. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 7,000mAh భారీ బ్యాటరీ ఉండగా, దానికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
  9. కళ్లు చెదిరే ఫీచర్స్‌తో వివో ఎక్స్300 అల్ట్రా.. దీని ప్రత్యేకతలివే
  10. గెలాక్సీ ఎస్26 సిరీస్‌లో శాటిలైట్ వాయిస్ కాల్స్?.. ఈ విషయాల గురించి తెలుసా?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »