Photo Credit: HMD
HMD Fusion (pictured) was unveiled in September this year
నోకీయా స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్థ HMD సరికొత్త HMD Fusion హ్యాండ్‌సెట్‌ను ఈ సంవత్సరం సెప్టెంబర్ IFA 2024లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా HMD Fusion వెనమ్ ప్రత్యేక ఎడిషన్ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన ఫీచర్స్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ IP52-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. అలాగే, iFixit కిట్‌ని ఉపయోగించి మరమ్మతులు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా యూనిట్‌తోపాటు 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో దీనిని రూపొందించారు. HMD కంపెనీ ఓవైపు బడ్జెట్ ఫోన్‌లను తీసుకొస్తూనే మరోవైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లపై ఫోకస్ పెడుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. HMD Fusion వెనమ్ ఎడిషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్కేద్దాం రండి!
ఈ అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలయ్యే మార్వెల్స్ వెనమ్.. ది లాస్ట్ డ్యాన్స్ సహకారంతో ప్రత్యేక ఎడిషన్ Fusion ఫోన్ కోసం ఇది "ది అల్టిమేట్ సింబయోటిక్ ఫోన్" అనే ట్యాగ్‌లైన్‌తో HMD టీజర్‌ను X పోస్ట్‌లో షేర్ చేసింది. దీంతో వెనమ్ ఎడిషన్ చలనచిత్రం నుండి ప్రేరణ పొందిన డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే ఉన్న వెర్షన్‌లో ఉన్నాయి.
HMD Fusion కొత్త ఎడిషన్ మార్కెట్ ధర EUR 249 (దాదాపు రూ. 24,000) వద్ద ప్రారంభమవుతుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ (720 x 1,612 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉండి, ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 8GB వరకు RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో రూపొందించారు. మెమురీని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.
HMD Fusion ఎడిషన్ కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే.. 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ముందు కెమెరాలో 50-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.2, GPS/AGPS, GLONASS, BDS, గెలీలియో, OTG, USB టైప్-సి పోర్ట్, వైఫై ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
HMD Fusion స్మార్ట్ అవుట్‌ఫిట్‌లు అని పిలువబడే మార్చుకోగలిగిన కవర్‌లతో ఫంక్షనాలిటీలను అటాచ్ చేయవచ్చు. ఉదాహరణకు, ఫ్లాషీ అవుట్‌ఫిట్‌లో మూడ్ లైట్‌తోపాటు మరిన్నింటిని నియంత్రించేందుకు ముందు, వెనుక కెమెరాలు లేదా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఎమర్జెన్సీ (ICE) బటన్‌ను కలిగి ఉన్న IP68-రేటెడ్ రగ్గడ్ అవుట్‌ఫిట్ రెండింటిలోనూ ఇన్‌బిల్ట్ రింగ్ లైట్‌ను అందించారు.
ప్రకటన
ప్రకటన