ఆపిల్ కంపెనీ యొక్క ఇట్స్ గ్లోటైమ్ లాంచ్ ఈవెంట్‌లో iPhone 16 Pro, iPhone 16 Pro Max స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇవి కంపెనీ యొక్క అత్యంత సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లుగా పేర్కొంది. అలాగే, శక్తివంతమైన Apple A18 Pro చిప్‌సెట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. iOS 18 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతూ.. కంపెనీలో భాగమైన కొత్త Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు శక్తినిస్తుంది. గతంలో వచ్చిన మోడల్స్ కంటే ఈ కొత్త ఫోన్‌లు డిస్‌ప్లేలతోపాటు అప్‌గ్రేడ్ చేసిన అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో రూపొందించబడ్డాయి.
iPhone 16 Pro ధర బేస్ 128GB వేరియంట్ $999 (సుమారు రూ. 84,000) నుండి ప్రారంభమవుతుంది. అయితే, iPhone 16 Pro Max 256GB ధర అయితే మాత్రం $1,199 (సుమారు రూ. 1,00,700) వద్ద ప్రారంభమవుతుంది. డెజర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్ టైటానియం కలర్ ఆప్షన్‌లలో 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 13 నుండి iPhone 16 Pro, iPhone 16 Pro Max కోసం ముందస్తు ఆర్డర్‌లను స్వీకరిస్తుండగా, సెప్టెంబర్ 20 నుండి Apple వెబ్‌సైట్‌తోపాటు అధీకృత రిటైలర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.
ఈ రెండు ఫోన్‌లు డ్యూయల్ సిమ్ (US: eSIM, వరల్డ్‌వైడ్: Nano+eSIM)తో వస్తున్నాయి. అలాగే, ఇవి Apple సెకండ్ జనరేషన్ 3nm A18 ప్రో చిప్ ద్వారా శక్తిని పొందుతాయి. గత సంవత్సరం మోడళ్లతో పోల్చితే వీటి పనితీరులో 15 శాతం పెరుగుదల ఉంటుందని కంపెనీ చెబుతోంది. అందుకోసం 20 శాతం తక్కువ శక్తిని ఉపయోగిస్తోంది. వీటి డిస్‌ప్లేలు వరుసగా 6.3-అంగుళాలు, 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేలతో వస్తున్నాయి. ఇవి 120Hz రిఫ్రెష్ రేట్ (ప్రోమోషన్), గరిష్టంగా 2,000నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, Apple అప్‌గ్రేడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో రూపొందించారు.
iPhone 16 Proలో రెండూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంటాయి. ఇందులో ఎఫ్/1.78 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ వైడ్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో అప్‌గ్రేడ్ చేసిన 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. 12-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా f/2.8 ఎపర్చర్, 5x వరకు ఆప్టికల్ జూమ్ పనితీరును అందించే 'టెట్రాప్రిజం' పెరిస్కోప్ లెన్స్ అందించారు. వీడియో కాల్స్, సెల్ఫీలకు ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ TrueDepth కెమెరా f/1.9 అపెర్చర్‌తో ఉంటుంది. ఫోన్‌లు 4K 120fps రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లు దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌తో 1TB వరకు స్టోరేజీ ఉంటుంది. USB 3.0 టైప్-సి పోర్ట్‌తో పాటు 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, NFC, GPS కనెక్టివిటీని కలిగి ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన