Photo Credit: Redmi
Qualcomm నుండి స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా Redmi A4 5G మన దేశంలో ఆవిష్కరించబడింది. న్యూఢిల్లీలో జరుగుతున్న వార్షిక ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024 ఈవెంట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను పరిచయం చేశారు. ఇది రూ. 10,000 కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుంది. అలాగే, భారతదేశంలో అత్యంత సరసమైన ధరలో 5G సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సరికొత్త Redmi A4 5Gకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా?!
భారతదేశంలో Redmi A4 5G ధర రూ. 10,000 వరకూ ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ ప్రకటన ఆదారంగా ఈ హ్యాండ్‌సెట్‌ను "త్వరలో" భారతదేశంలో లాంచ్ చేస్తామని ప్రకటించింది. అయితే, దీని ప్రారంభానికి సంబంధించిన అధికారిక తేదీని వెల్లడించలేదు. IMC 2024లోని Redmi యొక్క లాంచ్ ఈవెంట్‌లో ఇది నలుపు, తెలుపు రంగులలో ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శించబడింది.
Redmi A4 5G మోడల్ స్పెసిఫికేషన్‌లను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది Snapdragon 4s Gen 2 ప్రాసెసర్ ఆధారితమైన మొదటి హ్యాండ్‌సెట్ అని మాత్రం స్పష్టమైంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ Qualcomm 4nm ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించబడింది. అలాగే, LPDDR4x RAMకి సపోర్ట్‌తోపాటు 2GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీని స్నాప్‌డ్రాగన్ 5G మోడెమ్-RF సిస్టమ్ 1Gbps వరకు డౌన్‌లోడ్ స్పీడ్‌కు సపోర్ట్ చేస్తూ.. 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ధరలో ఈ తరహా ఫీచర్స్ కొనుగోలుదారలుకు ఉపయోగకరంగానే భావించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ Snapdragon 4s Gen 2 ప్రాసెసర్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్-HD+ డిస్‌ప్లేలకు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే, Qualcomm డాక్యుమెంటేషన్ ప్రకారం.. ఇది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు రెండు 13-మెగాపిక్సెల్ కెమెరాలు లేదా ఒకే 25-మెగాపిక్సెల్ కెమెరాకు సపోర్ట్‌తో డ్యూయల్ 12-బిట్ ISPలను కలిగి ఉంది. IMC 2024లో కంపెనీ ప్రదర్శించిన Redmi A4 5G వృత్తాకారంగా వెనుక డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.
Snapdragon 4s Gen 2 ప్రాసెసర్ ద్వారా ప్రారంభించబడిన ఈ హ్యాండ్‌సెట్ ఇతర ఫీచర్‌లను చూస్తే.. డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS (L1+L5), NavIC శాటిలైట్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఇది డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 5, బ్లూటూత్ 5.1, NFC కనెక్టివిటీకి సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ ప్రాసెసర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్‌తో పాటు USB 3.2 Gen 1 ట్రాన్స్‌వర్ వేగం (5Gbps) వరకు సపోర్ట్ చేయగలవు. ఈ అంచనాలకు పూర్తిస్థాయిలో దృవీకరణ కావాలంటే మాత్రం కంపెనీ ఈ మోడల్ స్పెసిఫికేషన్స్‌ను అధికారికంగా విడుదల చేయాల్సిందే!
ప్రకటన
ప్రకటన