చైలా లాంచ్ అయిన Redmi Turbo 4 స్మార్ట్ ఫోన్.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేషన్స్ మీకోసం

Redmi Turbo 4 హ్యాండ్‌సెట్‌కు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 1.5K OLED డిస్‌ప్లేను అందించారు

చైలా లాంచ్ అయిన Redmi Turbo 4 స్మార్ట్ ఫోన్.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేషన్స్ మీకోసం

Photo Credit: Redmi

Redmi Turbo 4 లక్కీ క్లౌడ్ వైట్, షాడో బ్లాక్ మరియు షాలో సీ బ్లూ షేడ్స్‌లో వస్తుంది

ముఖ్యాంశాలు
  • Redmi Turbo 4 ఫోన్‌ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వ‌స్తు
  • ఆండ్రాయిడ్ 15-ఆధారిత HyperOS 2.0తో ర‌న్ అవుతుంది
  • లక్కీ క్లౌడ్ వైట్, షాడో బ్లాక్, షాలో సీ బ్లూ రంగుల‌లో ల‌భిస్తుంది
ప్రకటన

చైనాలో Redmi Turbo 4 ఫోన్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఫోన్‌ MediaTek Dimensity 8400-Ultra ప్రాసెస‌ర్‌తో వ‌స్తోన్న వ‌స్తున్న మొద‌టి స్మార్ట్ ఫోన్‌గా గుర్తింపు పొందింది. అలాగే, 6,550mAh బ్యాటరీతో 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. దుమ్ము, నీటి నియంత్ర‌ణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది Xiaomi HyperOS 2.0 స్కిన్‌తో Android 15లో ర‌న్ అవుతోంది.

చైనాలో ధ‌ర ఇలా

Redmi Turbo 4 ఫోన్‌ చైనాలో 12GB + 256GB వేరియంట్ ధ‌ర‌ CNY 1,999 (సుమారు రూ. 23,500) నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే, 16GB + 256GB వేరియంట్ CNY 2,199 (సుమారు రూ. 25,800), 12GB + 512GB, 16GB + 512GB వేరియంట్‌లు వ‌రుస‌గా CNY 2,299 (దాదాపు రూ. 27,000), CNY 2,499 (దాదాపు రూ. 29,400)గా ఉన్నాయి. Xiaomi చైనా ఈ-స్టోర్ ద్వారా ఈ ఫోన్ ఆ దేశంలో అమ్మకానికి అందుబాటులోకి వ‌చ్చింది. ఈ హ్యాండ్‌సెట్ లక్కీ క్లౌడ్ వైట్, షాడో బ్లాక్, షాలో సీ బ్లూ రంగుల ఎంపిక‌ల‌లో ల‌భిస్తుంది.

మొదటి స్మార్ట్ ఫోన్‌గా

ఈ Redmi Turbo 4 స్మార్ట్ ఫోన్‌ 6.67-అంగుళాల 1.5K (1,220 x 2,712 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1,920Hz PWM డిమ్మింగ్ రేట్, 2,560Hz వరకు ఇన్స్‌టెంట్ ట‌చ్‌ నిట్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొట‌క్ష‌న్ ఉంటుంది. ఇది HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. Turbo 4 హ్యాండ్‌సెట్ Mali-G720 MC6 GPUతో 4nm ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 8400-Ultra ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని గ్ర‌హిస్తుంది. 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేసిన చిప్‌సెట్‌తో వ‌స్తోన్న‌ మొదటి స్మార్ట్ ఫోన్‌గా గుర్తింపు పొందింది.

50-మెగాపిక్సెల్ కెమెరా

దీని కెమెరా విష‌యానికి వ‌స్తే.. Redmi Turbo 4 ఫోన్‌ 1/1.95-అంగుళాల 50-మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రైమరీ రియర్ సెన్సార్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్‌తో వ‌స్తుంది. అలాగే, సెల్ఫీ, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 1/4-అంగుళాల 20-మెగాపిక్సెల్ OV20B సెన్సార్‌ను అందించారు. ఈ హ్యాండ్‌సెట్ స్టీరియో స్పీకర్‌లతో వ‌స్తోంది.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

ఇది సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ విష‌యానికి వ‌స్తే.. 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 6.0, GPS, గెలీలియో, GLONASS, QZSS, NavIC, NFC, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 160.95 x 75.24 x 8.06mm ప‌రిమాణంతో 203.5 గ్రాముల బ‌రువుతో వ‌స్తుంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »