nova 15 సిరీస్‌తో పాటు పరిచయం చేసిన ఈ కొత్త MatePad, ముఖ్యంగా చదువు, వినోదం, అలాగే రోజువారీ అవసరాలకు అనువుగా రూపొందించబడింది.
Photo Credit: Huawei
మేట్‌ప్యాడ్ 11.5 (2026) విడుదలతో HUAWEI చైనాలో తన టాబ్లెట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.
హువావే తన టాబ్లెట్ విభాగాన్ని మరింత విస్తరించుతూ చైనాలో HUAWEI MatePad 11.5 (2026) టాబ్లెట్‌ను అధికారికంగా విడుదల చేసింది. nova 15 సిరీస్‌తో పాటు పరిచయం చేసిన ఈ కొత్త MatePad, ముఖ్యంగా చదువు, వినోదం, అలాగే రోజువారీ అవసరాలకు అనువుగా రూపొందించబడింది. ఈ టాబ్లెట్ Standard, Soft Light, మరియు Full Network అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. డిజైన్ విషయానికి వస్తే, MatePad 11.5 (2026) పూర్తిగా మెటల్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది. అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ఫోర్జింగ్, బెండింగ్ ప్రక్రియల ద్వారా తయారు చేసిన ఈ బాడీ, మునుపటి మోడళ్లతో పోలిస్తే 10 శాతం పలుచగా ఉండగా, నిర్మాణ బలాన్ని 30 శాతం పెంచింది. మైక్రో-ఆర్క్ గుండ్రని అంచులు పట్టుకోవడంలో సౌకర్యాన్ని పెంచుతాయి. దీని కొలతలు 262.6 × 177.5 × 6.1 మిల్లీమీటర్లు కాగా, బరువు సుమారు 515 గ్రాములు మాత్రమే.
ఈ టాబ్లెట్‌లో 11.5 అంగుళాల IPS డిస్‌ప్లే ఉంది. ఇది 2456 × 1600 పిక్సెల్స్‌తో 2.5K రిజల్యూషన్‌ను అందిస్తుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 256 PPI పిక్సెల్ డెన్సిటీతో పాటు 60Hz, 90Hz, 120Hz మధ్య ఆటోమేటిక్‌గా మారే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకత. ముఖ్యంగా Soft Light వేరియంట్ లో నానో మాగ్నెటిక్ ఆప్టికల్ కోటింగ్ ఉపయోగించడం వల్ల ప్రతిఫలాన్ని 60 శాతం వరకు తగ్గిస్తుంది. అదనంగా DC డిమ్మింగ్, ఆటో బ్రైట్‌నెస్, హార్డ్‌వేర్ స్థాయి లో బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి. Soft Light వేరియంట్‌కు SGS Low Visual Fatigue 2.1 గోల్డ్ సర్టిఫికేషన్, TÜV Rheinland సర్టిఫికేషన్లు లభించాయి.
కెమెరాల విషయానికి వస్తే, వెనుక భాగంలో 13MP f/1.8 అపర్చర్ ఆటోఫోకస్ కెమెరా ఉంది. ముందు భాగంలో 8MP f/2.0 కెమెరా వీడియో కాల్స్, ఆన్‌లైన్ క్లాసుల కోసం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాసెసర్ పరంగా, Standard వేరియంట్ లో Kirin T82B, Soft Light వేరియంట్ లో Kirin T82 చిప్‌సెట్‌ను అందించారు. ఈ టాబ్లెట్ HarmonyOS 5.1 పై పనిచేస్తుంది. 8GB లేదా 12GB RAM, 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ స్థిరంగా ఉండేందుకు త్రీ-డైమెన్షనల్ హీట్ డిసిపేషన్ మ్యాట్రిక్స్‌ను ఉపయోగించారు. 10,100 mAh బ్యాటరీతో ఇది 14 గంటల వరకు లోకల్ వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. 40W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఇతర ఫీచర్లలో AI ఆధారిత హోంవర్క్ కరెక్షన్, Minor Mode, Study Mode, Eye Protection Mode, Huawei Notes లో అడ్వాన్స్ హ్యాండ్‌రైటింగ్, స్కెచ్ సపోర్ట్, ఫార్ములా గుర్తింపు వంటి అంశాలు ఉన్నాయి. HUAWEI M-Pencil, Smart Keyboard సపోర్ట్ కూడా ఉంది. ధరల విషయానికి వస్తే, Standard వేరియంట్ (8GB + 128GB) ధర 1,799 యువాన్‌గా నిర్ణయించారు. Soft Light వేరియంట్ ధరలు 2,099 యువాన్ నుంచి ప్రారంభమై 2,599 యువాన్ వరకు ఉన్నాయి. Full Network వేరియంట్ ధర 2,799 యువాన్. ఈ టాబ్లెట్ ఫెదర్ సాండ్ పర్పుల్, ఫ్రోస్ట్ సిల్వర్, ఐలాండ్ బ్లూ, డీప్ స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, అమ్మకాలు డిసెంబర్ 25, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి..
ప్రకటన
ప్రకటన
Oppo Reno 15 Series India Launch Date, Price Range Surface Online; Tipster Leaks Global Variant Price, Features
Clair Obscur: Expedition 33's Game of the Year Win at Indie Game Awards Retracted Over Gen AI Use