మ్యూజిక్ లవర్స్, గేమర్స్, డైలీ యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ సిరీస్‌లో టాప్ మోడల్‌గా DUB X50 Pro నిలుస్తుంది. ఇది DUB Platinum Sound, Hi-Fi DSP సపోర్ట్‌తో హై క్వాలిటీ ఆడియోను అందిస్తుంది.
Photo Credit: HMD
హ్యూమన్ మొబైల్ డివైసెస్ (HMD) తన DUB సిరీస్ TWS ఇయర్‌బడ్‌లను ఆరు కొత్త మోడళ్లతో విస్తరించింది.
Human Mobile Devices (HMD) గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని తన DUB సిరీస్ TWS ఇయర్‌బడ్‌లను విస్తరించింది. ఈ కొత్త లైనప్‌లో మొత్తం ఆరు మోడళ్లు ఉన్నాయి. అవి DUB X50 Pro, DUB X50, DUB S60, DUB P70, DUB P60, DUB P50. మ్యూజిక్ లవర్స్, గేమర్స్, డైలీ యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ సిరీస్‌లో టాప్ మోడల్‌గా DUB X50 Pro నిలుస్తుంది. ఇది DUB Platinum Sound, Hi-Fi DSP సపోర్ట్‌తో హై క్వాలిటీ ఆడియోను అందిస్తుంది. బయట శబ్దాన్ని తగ్గించే Active Noise Cancellation (ANC), కాల్స్ కోసం ENC టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. Bluetooth 5.3 సపోర్ట్‌తో పాటు మల్టీపాయింట్ కనెక్టివిటీ ఉండటంతో ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ కావచ్చు. చార్జింగ్ కేస్‌తో కలిపి గరిష్టంగా 60 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. IPX4 రేటింగ్ ఉండటం వల్ల చెమట, నీటి చినుకుల నుంచి రక్షణ ఉంటుంది.
DUB X50 మోడల్ కూడా ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇందులో ANC లేకపోయినా, ENC, Hi-Fi DSP, లో లేటెన్సీ మోడ్ ఉన్నాయి. ఈ మోడల్ ప్రత్యేకత ఏమిటంటే, చార్జింగ్ కేస్‌తో కలిపి 70 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది. గేమింగ్, స్ట్రీమింగ్‌కు ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.
DUB S60 మోడల్‌లో Dolby Audio సపోర్ట్ అందించారు. HMD DUB యాప్ ద్వారా EQ మోడ్‌లను మార్చుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ సుమారు 35 గంటలు, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. డైలీ యూజ్‌కు ఇది బ్యాలెన్స్‌డ్ మోడల్‌గా కనిపిస్తుంది.
ఇక DUB P70 మరియు DUB P60 మోడళ్లు బాస్ ప్రియులను ఆకట్టుకునేలా Bass Boost, ENC, లో లేటెన్సీ మోడ్తో వస్తాయి. వీటిలో బ్యాటరీ బ్యాకప్ వరుసగా 35 గంటలు, 30 గంటలు ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
ఎంట్రీ లెవల్ మోడల్ అయిన DUB P50 కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ENC, లో లేటెన్సీ మోడ్, IPX4 రేటింగ్ ఉన్నాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి 25 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.
ధరలు విషయానికి వస్తే DUB X50 – P1990 (సుమారు రూ. 3,031), DUB S60 – P1890 (సుమారు రూ. 2,879), DUB P60 – P1390 (సుమారు రూ. 2,117)గా ఉన్నాయి.ప్రస్తుతం ఈ మోడళ్లలో కొన్ని ఫిలిప్పీన్స్, మలేషియా వంటి మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. భారత్ సహా ఇతర దేశాల్లో లాంచ్ వివరాలను HMD త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన