Photo Credit: Oppo
Oppo F29 5G సిరీస్ IP66, IP68 మరియు IP69 రేటింగ్‌లకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.
తాజాగా Oppo F29 5Gతో పాటు Oppo F29 Pro 5Gని కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లు AI లింక్‌బూస్ట్ టెక్నాలజీ, హంటర్ యాంటెన్నా ఆర్కిటెక్చర్‌కు సపోర్ట్ చేయడం ద్వారా సిగ్నల్ బూస్టింగ్‌కు సహాయపడుతుందని చెబుతున్నారు. ఇవి 360-డిగ్రీల ఆర్మర్ బాడీని కలిగి ఉండడంతోపాటు మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H-2022 సర్టిఫికేషన్‌తో ఉన్నాయి. దుమ్ము, నీటి-నియంత్రణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తున్నాయి. బేస్ Oppo F29 5G స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ద్వారా, F29 Pro వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తాయి.
ఇండియాలో Oppo F29 5G 8GB + 128GB వేరియంట్ ధర రూ. 23,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 25,000గా ఉంది. ఇది ప్రస్తుతం Oppo ఇండియా ఈ-స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. అంతే కాదు, డెలివరీలు మార్చి 27 నుండి మొదలుకానున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ గ్లేసియర్ బ్లూ, సాలిడ్ పర్పుల్ షేడ్స్‌లో లభిస్తోంది. Oppo F29 Pro 5G ధర 8GB + 128GB కాన్ఫిగరేషన్ ధర రూ. 27,999 నుండి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1 నుండి షిప్పింగ్ ప్రారంభమవుతుండగా, ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది గ్రానైట్ బ్లాక్, మార్బుల్ వైట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
Oppo F29 5G, F29 Pro 5G ఫోన్‌లు 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,412 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తున్నాయి. అలాగే, స్టాండర్డ్ వేరియంట్ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ సిరీస్ 12GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు Android 15-ఆధారిత ColorOS 15.0తో రన్ అవుతాయి.
ఈ రెండూ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌లతో పాటు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌లు, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌లను కలిగి ఉంటాయి. ప్రో వేరియంట్ ప్రధాన కెమెరా OISకు సపోర్ట్ చేస్తుంది. అయితే, బేస్ వెర్షన్ EISకు సపోర్ట్ చేస్తుంది. Oppo F29 5G సిరీస్ ఫోన్‌లు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. మరీ ముఖ్యంగా, ఇవి నీటి అడుగున ఫోటోగ్రఫీ ఫీచర్‌ను కూడా కలిగి ఉన్నాయి.
Oppo F29 5G 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని, F29 Pro 80W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఇవి ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌లతో వస్తున్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్‌లో 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్, OTG, GPS, USB టైప్-C వంటివి ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన