Photo Credit: Infinix
Infinix Zero Flip has a 6.9-inch LTPO AMOLED inner screen that refreshes at 120Hz
Infinix కంపెనీ నుంచి మొట్టమొదటి క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ Infinix Zero Flipను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6.9-అంగుళాల LTPO AMOLED ఇన్నర్ స్క్రీన్, 3.64-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 8020 ప్రాసెసర్‌తో గరిష్టంగా 16GB RAMతో అటాచ్ చేయబడింది. Infinix Zero Flipలో రెండు 50-మెగాపిక్సెల్ ఔటర్ కెమెరాలు ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. అలాగే, రెండు ఆండ్రాయిడ్ OS వెర్షన్ అప్‌గ్రేడ్‌లతోపాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందొచ్చన్ని కంపెనీ వెల్లడించింది.
భారత్‌లో Infinix Zero Flip సింగిల్ 8GB + 512GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ 49,999గా ఉంది. ఇది బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అక్టోబర్ 24 నుండి మన దేశంలో విక్రయించబడుతుంది. వినియోగదారులు SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 5,000 తగ్గింపు పొందవచ్చు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుండి Infinix Zero Flipను కొనుగోలు చేసేటప్పుడు, లాంచ్ సమయంలో దీని ధర రూ. 44,999గా ఉంది.
ఇది డ్యూయల్ సిమ్ (నానో+నానో)ని కలిగి ఉండి, కంపెనీ XOS 14.5 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.9-అంగుళాల ఫుల్-HD+ LTPO AMOLED ఇన్నర్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. వెలుపల 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో 3.64-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. దీనికి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ అమర్చబడి, 8GB LPDDR4X RAMతో అటాచ్ చేయబడింది. ఇది 512GB UFS 3.1 స్టోరేజీతో వస్తుంది. ఎస్‌డీ కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజీని పెంచేందుకు అవకాశం లేదు.
Infinix Zero Flipకు ఔటర్ స్క్రీన్‌పై డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 114-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 4K/30fps వద్ద వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. లోపలి భాగంలో 4K/60fps వద్ద వీడియోను రికార్డ్ చేయగల 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ విషయానకి వస్తే.. Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది డ్యూయల్ JBL-ట్యూన్డ్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. బయోమెట్రిక్ కోసం పవర్ బటన్‌పై ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌ను అందించారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ 70W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 4,720mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది మడతపెట్టనప్పుడు 170.75x73.4x16.04mm, మడతపెట్టినప్పుడు 87.8x73.4x7.64mm పరిమాణంతో 195 గ్రాముల బరవుతో ఉంటుంది.
ప్రకటన
ప్రకటన