Photo Credit: Vivo
Vivo Y37c launched featuring a 90Hz display and a massive 5,500mAh battery for long-lasting use
ప్రముఖ మొబైల్ కంపెనీ Vivo వరుసగా సరికొత్త మోడల్స్‌ను లాంఛ్ చేస్తోంది. ఈ సంస్థ చైనాలో గత ఏడాది Dimensity 6300 ప్రాసెసర్‌తో Vivo Y37, Vivo Y37m స్మార్ట్ ఫోన్‌లను పరిచయం చేసింది. ఇప్పుడు తాజాగా, Y37c పేరుతో మరో కొత్త మోడల్‌ను చైనాలో ఆవిష్కరించి మార్కెట్ వర్గాల చూపును తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇది 15W ఛార్జింగ్‌తో ఇది 5500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతే కాదు, ఈ కొత్త హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్‌తోపాటు ధర సైతం బహిర్గతం అయ్యాయి.దీని డిస్‌ప్లే ప్రత్యేకలు,రాబోయే Vivo Y37c స్మార్ట్ ఫోన్‌కు అందించిన డిస్‌ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 570 నిట్స్ బ్రైట్ నెస్‌తో కూడిన 6.56 అంగుళాల పెద్ద వాటర్‌డ్రాప్ నాఛ్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఈ స్క్రీన్ బ్లూ లైట్ ప్రభావన్ని తగ్గించడం ద్వారా కంటి చూపునకు ప్రొటక్షన్ కల్పించి, వీక్షణకు సౌకర్యవంతగా ఉంటుంది. ఇది దుమ్ము, నీటి నియంత్రణకు ఐపీ-64 రేటింగ్‌ను కలిగి ఉండడంతో రోజువారీ వినియోగంలో మరింత సహాయపడుతుంది.
ఈ కొత్త హ్యాండ్‌సెట్ కెమెరా విభాగాన్ని చూస్తే.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం దీని ఫ్రంట్ ఫేసింగ్‌కు 5- మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. అలాగే, వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో అటాచ్ చేసిన 13- మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ కెమెరా సాధారణ ఫోటోగ్రఫీ వినియోగం కోసం రూపొందించబడింది. ఇది OriginOS 4- ఆధారిత ఆండ్రాయిడ్ 14 పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ఫ్రింట్ స్కానర్‌ను కూడా అందించారు.
కొత్త Vivo Y37c మొబైల్ Unisoc T7225 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. 6జీబీ LPDDR4x ర్యామ్, 128జీబీ ఈఎంఎంసీ 5.1 స్టోరేజీతో వస్తోంది. అంతే కాదు, మల్టీ టాస్కింగ్ ఫంక్షనింగ్ మరింత మెరుగుపరిచేందుకు అడిషనల్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫీచర్ రాబోయే ఫోన్‌కు మరింత బలాన్ని చేకూర్చ వచ్చు. 15 W ఛార్జింగ్‌తో ఇది 5500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్‌లలో డ్యూయల్ 4జీ, బ్లూటూత్ 5.2, Wi-Fi 5, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ సీ వంటివి అందించారు. 167.30x 76.95x 8.19 ఎంఎం పరిమాణంతో 199 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
చైనాలో Vivo Y37c స్మార్ట్ ఫోన్ 6జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1199 యువాన్‌లు (సుమారు$275)గా ఉంది. ఆ దేశంలో ఈ మోడల్ కొనుగోలుకు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. డార్క్ గ్రీన్, టైటానియం అనే రెండు కలర్ ఆప్షన్‌లలో ఇది లభిస్తోంది. అయితే, ఇతర మొబైల్ మార్కెట్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ప్రకటన
ప్రకటన