ఆ మోడ‌ల్ స్మార్ట్ ఫోన్‌ల‌కు Samsung Galaxy M35 5G గ‌ట్టి పోటీనిస్తుందా?

Samsung కంపెనీ దేశీయ మార్కెట్‌లోకి Samsung Galaxy M35 5G పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. బ‌డ్జెట్ ధ‌ర‌తో సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా దీనిని తీసుకొచ్చింది.

ఆ మోడ‌ల్ స్మార్ట్ ఫోన్‌ల‌కు Samsung Galaxy M35 5G గ‌ట్టి పోటీనిస్తుందా?
ముఖ్యాంశాలు
  • Samsung Galaxy M35 5G, ఇండియాలో రిలీజ్‌, Samsung సిరీస్‌, వన్‌ప్లస్‌ నార్
  • ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ 6.60-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో 2340x108
  • Samsung Galaxy M35 5G Android 14ని నడుపుతుంది మరియు 6000mAh బ్యాటరీతో పని
ప్రకటన
ద‌క్షిణ కొరియాకు చెందిన ప్ర‌ముఖ ఎల‌క్ట్రానికి కంపెనీ Samsung దేశీయ మార్కెట్‌లోకి Samsung Galaxy M35 5G పేరుతో స‌రికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. రెండు నెలల క్రితం బ్రెజిల్‌లో ఆవిష్కరించబడిన ఈ మోడ‌ల్‌ను తాజాగా మ‌న దేశంలోనూ రిలీజ్ చేశారు. 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లేతో రూపొందించ‌బ‌డింది. అంతేకాదు,  ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 1380 ప్రాసెసర్‌తో న‌డుస్తుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతోపాటు 50 ఎంపీ కెమెరాతో కొనుగోలుదారుల‌ను ఆక‌ర్షిస్తోంది. మొబైల్ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌, నథింగ్‌ 2ఏ, రెడ్‌మీ 13 5జీ వంటి స్మార్ట్‌ఫోన్‌ల‌కు ఈ మోడ‌ల్‌ గట్టి పోటీనిస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. బ‌డ్జెట్ ధ‌ర‌తో సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా కంపెనీ ఈ మోడల్‌ను తీసుకొచ్చింద‌నే చెప్పాలి. మ‌రెందుకు ఆల‌స్యం ఈ మోడ‌ల్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను చూసేద్దామా?!

మూడు వేరియంట్‌ల‌లో..

శాంసంగ్ మ‌న‌దేశంలో ఇటీవ‌ల విడుద‌ల చేసిన Samsung Galaxy M35 5G మూడు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి ధ‌ర‌లు ప‌రిశీలిస్తే.. 6GB + 128GB మోడల్‌కు ప్రారంభ ధర రూ. 19,999గా నిర్ణ‌యించారు. అలాగే, 8GB + 128GB మరియు 8GB + 256GB వేరియంట్‌ల ధ‌ర‌లు వ‌రుస‌గా రూ. 21,499, రూ. 24,299గా ఉన్నాయి. కంపెనీ నిర్ణ‌యించిన ధ‌ర‌ల‌ను చూస్తే ఈ ఫోన్‌ను మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని తీసుకొచ్చిన‌ట్లు ఎవ్వ‌రికైనా అర్థ‌మైపోతుంది. ఈ మోడ‌ల్‌ అమెజాన్, సామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా జూలై 20 నుండి దేశంలో అమ్మకానికి అందుబాటులోకి ఉన్నాయి. అన్ని ర‌కాల‌ బ్యాంక్‌ కార్డులపైనా రూ.2 వేల తగ్గింపు ఉంటుంది. అలాగే, రూ.1000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫ‌ర్ చేస్తోంది. వీటితోపాటు మరో వెయ్యి రూపాయలు అమెజాన్‌ పే క్యాష్‌బ్యాక్‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ మూన్‌లైట్‌ బ్లూ, డే బ్రేక్‌ బ్లూ, థండర్‌ గ్రే మూడు రంగుల్లో దొరుకుతుంది. 

అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాతో..

స్పెసిఫికేషన్‌ల‌ను ప‌రిశీలిస్తే.. Samsung Galaxy M35 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,340 పిక్సెల్‌లు) సూపర్ AMOLED ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 1,000 నిట్‌ల వరకు పీక్‌ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్ష‌న్‌ కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్‌ వెనుక భాగంలో 50 ఎంపీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాను అమ‌ర్చారు. 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ను రూపొందించారు. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ వంటివాటి కోసం 13 ఎంపీ కెమెరాను అందించారు. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 25W ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంద‌ని కంపెనీ తెలిపింది. 

ఐదేళ్ల‌ సెక్యూరిటీ అప్ డేట్స్..

ఈ మోడ‌ల్‌కు అందించిన 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ గ‌రిష్టంగా గరిష్టంగా 53 గంటల టాక్ టైమ్ లేదా 97 గంటల మ్యూజిక్ ప్లేటైమ్ లేదా 27 గంటల వరకు ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను చేసుకునేంత వ‌ర‌కూ చార్జ్ సపోర్ట్ చేస్తుంది. Dolby Atmosతో స్టీరియో స్పీకర్లతో వ‌స్తుంది. 5జీ కనెక్టివిటీ, వైఫై 6, బ్లూటూత్‌ 5.3, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో పాటు శాంసంగ్‌ నాక్స్‌ సెక్యూరిటీతో కూడిన ట్యాప్‌ అండ్‌ పే ఫీచర్‌ను కూడా అందించారు. నాలుగేళ్ల‌ పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, ఐదేళ్ల‌పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ కంపెనీ అందిస్తోంది. హ్యాండ్‌సెట్ 162.3 x 78.6 x 9.1మీ.మీ పరిమాణం మరియు 222గ్రాముల‌ బరువుతో వ‌స్తుంది. మ‌రెందుకు ఆల‌స్యం.. మీ బ‌డ్జెట్‌లోనే Samsung Galaxy M35 5G  ఉంది అనుకుంటే వెంట‌నే బుక్ చేసుకుని, డిస్కౌంట్ పొందండి!

ces_story_below_text

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో బ్రాండెడ్ వస్తువులపై నో-కాస్ట్ EMI ఆప్షన్, భారీ డిస్కౌంట్లు
  2. అమెజాన్‌‌లో రిపబ్లిక్ డే 2026 సేల్లో మంచి డిస్కౌంట్లు, డబుల్ రిఫ్రిజిరేటర్లపై రూ. 23 వేల వరకు ఆదా
  3. ఈ పరిస్థితుల్లోనూ vivo మరియు OPPO మాత్రమే డబుల్ డిజిట్ వార్షిక వృద్ధిని సాధించగలిగాయి.
  4. ఇందులో 108MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంది
  5. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 నుంచి ప్రారంభమై ఇప్పుడు ఐదో రోజులోకి ప్రవేశించింది.
  6. ఈ ఇప్పుడు, రూ. 10,000 లోపు అద్భుత డీల్‌లలో ఉన్న బెస్ట్ ప్రింటర్స్ లిస్ట్‌ను చూద్దాం.
  7. Magic UI 10.0 ఆధారంగా Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
  8. ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
  9. వాషింగ్ మెషీన్స్ మీద వేలకు వేల తగ్గింపు.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లోని ఆఫర్స్ ఇవే
  10. ఏసీలపై వేలల్లో తగ్గింపు.. వేసవిలో తాపం తగ్గించుకోవాలనుకునే వారికి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ గ్రేట్ ఆఫర్స్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »