Photo Credit: Samsung
ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ Samsung దేశీయ మొబైల్ మార్కెట్‌లోకి Samsung Galaxy M55s 5G హ్యాండ్‌సెట్ విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ఫ్యూజన్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని వెనుక ప్యానెల్ డ్యూయల్-టెక్చర్డ్ ఫినిషింగ్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, ఇప్పటికే మన దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న Samsung Galaxy M55 5G, Samsung Galaxy F55 5Gలతో పోల్చినప్పుడు ఈ మోడల్ వాటికి దగ్గరగా ఉంటోంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన ధరతోపాటు స్పెసిఫికేషన్స్‌ను తెలుసుకుందాం!
మనదేశంలో Samsung Galaxy M55s 5G ప్రారంభ ధర 8GB + 128GB వేరియంట్ రూ. 19,999, అలాగే, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 22,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ మోడల్ Amazon, Samsung India వెబ్‌సైట్ ద్వారా దేశీయమార్కెట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే, సెప్టెంబర్ 26 నుండి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కూడా లభిస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ రెండు రంగులలో అందుబాటులోకి వస్తుంది.
Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ఫుల్-HD+ sAMOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1,000nits గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 1 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB వర్చువల్ RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో సహా 16GB వరకు RAMకి సపోర్ట్ ఇస్తుంది. Samsung Galaxy M55s 5G 5,000mAh బ్యాటరీ కెపాసిటీతోపాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది Samsung నాక్స్ వాల్ట్ భద్రత, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రూపొందించబడింది. దీని పరిమాణం విషయాని వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 7.8mm మందం కలిగి ఉంటుంది.
ఈ కొత్త మోడల్ కెమెరా విషయానికి వస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో జత చేసిన 8-మెగాపిక్సెల్ సెన్సార్, ఏ2- మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. అలాగే, ఫ్రంట్ కెమెరాలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ఒకేసారి ముందు మరియు వెనుక కెమెరాలతో రికార్డ్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఖచ్చితంగా కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన