చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన లేటెస్ట్ 'ఫ్యాన్ ఎడిషన్' మోడల్ Vivo V70 FEని ఇండియాలోకి దించడానికి రంగం సిద్ధం చేస్తోంది.
Photo Credit: Gadgets 360
మార్కెట్లోకి వివో కొత్త ఫ్యాన్ ఎడిషన్
చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన లేటెస్ట్ 'ఫ్యాన్ ఎడిషన్' మోడల్ Vivo V70 FEని ఇండియాలోకి దించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల మొదట్లోనే ఇండోనేషియా మార్కెట్లో సందడి చేసిన ఈ ఫోన్, ఇప్పుడు మన దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుండటం టెక్ ప్రియుల్లో ఆసక్తిని రేపుతోంది. సాధారణంగా వివో వి సిరీస్ అంటేనే స్టైలిష్ లుక్, అదిరిపోయే కెమెరా ఫీచర్స్ గుర్తొస్తాయి. ఈ క్రమంలోనే వివో V70తో పాటు ఈ FE మోడల్‌ను కూడా లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే వస్తుందని అందరూ భావించినప్పటికీ, తాజా అప్‌డేట్స్ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో ఇది ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
ప్రముఖ టెక్ బ్లాగర్ పరాస్ గుగ్లానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. ఇండియాలో ఈ ఫోన్ ధర సుమారు 35,000 రూపాయల లోపు ఉండొచ్చని అంచనా. ఇండోనేషియాలో లాంచ్ అయిన ధరతో పోలిస్తే మన దగ్గర కొంత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. అక్కడ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ దాదాపు 35 వేల రూపాయలకు అందుబాటులో ఉంది. అయితే ఇండియాలో దీని బేస్ వేరియంట్ ధరను మరింత అగ్రెసివ్‌గా ఉంచడం ద్వారా కాంపిటీషన్‌ను ఎదుర్కోవాలని వివో భావిస్తోంది. ఇది బ్లూ, లైట్ పర్పుల్, సిల్వర్ వంటి ట్రెండీ కలర్ ఆప్షన్లలో లభించనుంది.
ఈ ఫోన్ కేవలం ధర విషయంలోనే కాకుండా ఫీచర్ల పరంగా కూడా నేటి తరం యువతను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇందులో 6.83 అంగుళాల 1.5K Q10+ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీని 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్, స్క్రోలింగ్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. ఇక 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతేకాకుండా దీనికి IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి, అంటే ఇది నీరు , ధూళి నుండి ఫోన్‌కు గట్టి రక్షణ ఇస్తుంది. అడ్వెంచర్స్ ఇష్టపడే వారికి, రఫ్ యూసేజ్ చేసే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 4ఎన్ఎమ్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ను వాడారు. ఇది మల్టీ టాస్కింగ్, హెవీ గేమింగ్‌ను సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు. దీనికి తోడు LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని జత చేయడం వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. మరో విశేషమేమిటంటే, ఈ ఫోన్ ఇండియాలో eSIM సపోర్ట్‌తో రాబోతోంది. ఇది యూజర్లకు సిమ్ కార్డ్ మార్చుకునే పని లేకుండా మరింత సౌకర్యాన్ని ఇస్తుంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ మన దేశంలో అమ్మకానికి రానుందని సమాచారం, దీని కోసం ఫ్యాన్స్ ఇప్పటికే వేచి చూస్తున్నారు.
కెమెరా పిచ్చోళ్ల కోసం వివో ఇందులో ఒక భారీ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. ఏకంగా 200 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఈ ఫోన్‌లో ఇచ్చారు. దీనివల్ల ఫోటోలు అత్యంత స్పష్టతతో, ప్రొఫెషనల్ కెమెరా క్వాలిటీతో వస్తాయి. దీనికి తోడు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు, ఇది సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారికి, వీడియో కాల్స్ ఎక్కువగా మాట్లాడే వారికి బాగా యూజ్ అవుతుంది. తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫోటోలు తీసే సెన్సార్లను ఇందులో పొందుపరిచారు.
చివరగా ఈ ఫోన్‌లోని బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పుకోవాలి. స్మార్ట్‌ఫోన్ చరిత్రలో అరుదుగా కనిపించే 7,000mAh భారీ బ్యాటరీని ఈ మోడల్‌లో అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, దీనికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల చాలా త్వరగా ఫోన్ రీఛార్జ్ అవుతుంది. సాధారణంగా భారీ బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా ఉంటుందని అనుకుంటాం, కానీ వివో దీనిని చాలా స్లిమ్ అండ్ స్టైలిష్‌గా డిజైన్ చేసింది. ఏప్రిల్ నెలలో లాంచ్ కాబోతున్న ఈ ఫోన్ ఖచ్చితంగా మిడ్-రేంజ్ మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన