Photo Credit: poco
మరికొన్ని వారాల్లోనే Poco M7 Pro 5G, Poco C75 5G ఫోన్‌లు భారత్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా Poco సైతం ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ల లాంచ్ తేదీని ధృవీకరించడంతోపాటు కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్‌ను వెల్లడించింది. అంతేకాదు, Poco C-సిరీస్ స్మార్ట్‌ఫోన్ సోనీ కెమెరాతో వస్తుందంటూ టీజ్ చేసింది. అంతేకాదు, AMOLED డిస్‌ప్లేను Poco M7 Pro 5G హ్యాండ్‌సెట్‌కు అందించారు. ఈ రెండు ఫోన్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. అండర్ ది హుడ్ స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో Poco C75 5G వచ్చేలా కనిపిస్తోంది. Poco C75 5G సోనీ సెన్సార్‌తో దేశంలోనే అత్యంత సరసమైన 5G ఫోన్‌గా గుర్తింపు పొందనుంది.
తాజాగా, X వేదికగా Poco ఇండియా హెడ్ హిమాన్షు టాండన్ Poco M7 Pro 5G, Poco C75 5Gల రాబోయే లాంచ్ గురించి టీజర్‌ను షేర్ చేశారు. దీనిని బట్టీ ఈ ఫోన్‌లు డిసెంబర్ 17న మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి రానున్నాయ. Poco M7 Pro 5G AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. Poco C75 5G ఫోన్‌ను సోనీ కెమెరాతో రూపొందించినట్లు వెల్లడైంది. దీని ధర రూ. 9,000గా నిర్ణయించారు. ఈ హ్యాండ్‌సెట్ 5G SAకు సపోర్ట్ చేస్తుంది. అయితే, Airtel వినియోగించే 5G NSA (నాన్-స్టాండలోన్)కి మాత్రం సపోర్ట్ చేయదు.
కొత్త ఫోన్‌ల గురించి కంపెనీ లాంచ్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లోని స్పెషల్ మైక్రోసైట్ ద్వారా ఫస్ట్ లుక్‌ని అందిస్తోంది. Poco M7 Pro 5G ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 92.02 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 2,100nits పీక్ బ్రైట్‌నెస్, HDR 10+ సపోర్ట్‌తో లిస్ట్ అవుట్ చేయబడింది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, TUV ట్రిపుల్ సర్టిఫికేషన్, SGC ఐ కేర్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. దీనికి ఇన్- డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
4GB RAMతో పాటు స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో Poco C75 5G ఫోన్‌ను రూపొందించారు. ఈ హ్యాండ్‌సెట్ 4GB వరకు టర్బో RAMను అందిస్తోంది. స్పెషల్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. వృత్తాకార కెమెరా మాడ్యూల్‌తో కొత్త Poco C సిరీస్ ఫోన్‌ను ఆకర్షణీయంగా డిజైన్ చేశారు.
గతంలో వచ్చిన లీక్‌లను బట్టీ.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేతో Poco C75 5G ఫోన్‌ను రూపొందించారు. ఇది 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన