ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్‌పై గరిష్టంగా 75 శాతం వరకు తగ్గింపు ఉండగా, SBI క్రెడిట్ కార్డు మరియు EMI లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది.
Photo Credit: Amazon
అమెజాన్ ఇండియా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది.
అమెజాన్ ఇండియా తన ప్రతిష్టాత్మక గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026ను జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు తదితర విభాగాల్లో భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని ఎంపిక చేసిన డీల్స్‌ను ముందుగానే వెల్లడించిన అమెజాన్, ప్రైమ్ మెంబర్లకు అదనపు సేవింగ్స్ కూడా ప్రకటించింది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్‌పై గరిష్టంగా 75 శాతం వరకు తగ్గింపు ఉంది.
స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఈ సేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆపిల్ ఐఫోన్ 15 (128GB) బ్లూ వేరియంట్‌ను రూ.50,249కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256GB) కోస్మిక్ ఆరెంజ్ రంగులో రూ.1,40,400కి, ఐఫోన్ 17 ప్రో (256GB) అదే రంగులో రూ.1,25,400కి లభించనుంది. ఐఫోన్ ఎయిర్ (256GB) స్కై బ్లూ వేరియంట్ ధర రూ.91,249గా నిర్ణయించారు. వన్‌ప్లస్ అభిమానులకు కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ 15 ధర రూ.68,999గా ఉండగా, వన్‌ప్లస్ 15R రూ.44,999కే లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 5ను రూ.30,999కి, వన్‌ప్లస్ 13Rను రూ.37,999కి, వన్‌ప్లస్ 13ను రూ.57,999కి కొనుగోలు చేయవచ్చు.
సామ్‌సంగ్ విభాగంలో గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర రూ.1,04,999గా ఉండగా, గెలాక్సీ A55 5G రూ.23,999కి లభిస్తుంది. గెలాక్సీ M17 5G రూ.12,999కే అందుబాటులో ఉండగా, గెలాక్సీ M06 5G ధర రూ.9,249గా ఉంది. iQOO బ్రాండ్‌లో iQOO 15ను రూ.65,999కి, iQOO నియో 10 5Gను రూ.33,999కి, iQOO Z10R 5Gను రూ.18,499కి పొందవచ్చు. నార్జో 80 ప్రో 5G ధర రూ.16,999గా ఉండగా, నార్జో 80 లైట్ 5Gను రూ.11,499కే కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ A4 5G రూ.8,299కి, రెడ్‌మీ 13 5G రూ.12,499కి, రెడ్‌మీ నోట్ 14 5G రూ.16,498కి, పోకో C75 5G రూ.8,799కి అందుబాటులో ఉన్నాయి. లావా బ్రాండ్‌లో బోల్డ్ N1 5G ధర రూ.7,249గా ఉండగా, లావా స్టోర్మ్ ప్లే 5Gను రూ.9,249కి కొనుగోలు చేయవచ్చు.
టాబ్లెట్ విభాగంలో సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్ (6GB/128GB) ధర రూ.31,999గా ఉంది. లెనోవో ఐడియా ట్యాబ్ 5G పెన్‌తో కలిపి రూ.20,999కి లభిస్తుంది. షియోమీ ప్యాడ్ 7 (12GB/256GB) ధర రూ.25,999గా ఉండగా, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 (8GB/256GB)ను రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు. ఆడియో విభాగంలో వన్‌ప్లస్ బడ్స్ 4 రూ.4,999కి, బోట్ నిర్వాణా అయాన్ రూ.1,399కి, సోనీ WH-1000XM6 హెడ్‌ఫోన్స్ రూ.37,990కి లభించనున్నాయి. హోమ్ థియేటర్ మరియు సౌండ్‌బార్‌లలో కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. సోనీ S20R రూ.14,999కి, JBL బార్ 1000 ప్రో రూ.69,999కి, బోస్ అల్ట్రా సౌండ్‌బార్ రూ.79,990కి అందుబాటులో ఉన్నాయి.
ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, గేమింగ్ డివైస్‌లు, రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, స్మార్ట్ టీవీలు వంటి విభాగాల్లో కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లలో SBI కార్డుతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అపరిమిత 5 శాతం క్యాష్‌బ్యాక్, GST ద్వారా గరిష్టంగా 18 శాతం వరకు సేవింగ్స్ లభిస్తాయి.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Redmi Note 15 Pro 5G India Launch Seems Imminent After Smartphone Appears on Geekbench