రెండో దశలో, 52.5 మిలియన్ డాలర్ల వ్యయంతో పూర్తి స్థాయి నిర్మాణం, పరికరాల అమరిక జరుగుతుంది. ఈ కేంద్రం 2026 మూడో త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని అంచనా. .
ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ గుర్తు
ఆపిల్‌కు ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ మరోసారి అమెరికాలో తన కార్యకలాపాలను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈసారి కంపెనీ కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్ నగరాన్ని ఎంచుకుంది. లూయిస్విల్ మేయర్ క్రెగ్ గ్రీన్‌బర్గ్, కెంటకీ గవర్నర్ ఆండీ బషీర్ చేసిన అధికారిక ప్రకటనల ప్రకారం, ఫాక్స్‌కాన్ ఇక్కడే తమ తొలి అమెరికా తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫాక్స్‌కాన్ దాదాపు 174 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని, దీని ద్వారా 180 కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లూయిస్విల్‌లోని రాండీ కో లేన్ వద్ద ఉన్న 23 ఎకరాల స్థలంలో, 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గోదాంను ఫ్యాక్టరీగా మార్చనున్నారు. ఇప్పటికే ఉన్న ఈ భవనాన్ని ఆధునీకరించడానికి ఫాక్స్‌కాన్ మొత్తం 62.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.
ఈ అప్‌గ్రేడ్లు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో, సుమారు 10 మిలియన్ డాలర్లతో భారీ తయారీ యంత్రాలను మోయగల కొత్త కాంక్రీట్ ఫౌండేషన్లు, అంతర్గత మార్పులు చేపడతారు. రెండో దశలో, 52.5 మిలియన్ డాలర్ల వ్యయంతో పూర్తి స్థాయి నిర్మాణం, పరికరాల అమరిక జరుగుతుంది. ఈ కేంద్రం 2026 మూడో త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని అంచనా.
ఫాక్స్‌కాన్ ప్రధానంగా పెట్టుబడి పెట్టినా, కెంటకీ రాష్ట్రం నుంచి కొన్ని ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఇందులో భాగంగా, 10 ఏళ్లపాటు గరిష్టంగా 3.4 మిలియన్ డాలర్ల ప్రోత్సాహక ఒప్పందం, అదనంగా 6 లక్షల డాలర్ల పన్ను రాయితీలు ఉన్నాయి. ఈ పెట్టుబడి వల్ల మంచి జీతాల ఉద్యోగాలు, కొత్త అవకాశాలు, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి లభిస్తాయని స్థానిక పాలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫాక్స్‌కాన్ యూఎస్‌ఏ సీఈఓ బెన్ లియావ్ దీనిని “అమెరికన్ మాన్యుఫాక్చరింగ్‌లో కొత్త అధ్యాయం”గా పేర్కొన్నారు.
అయితే, ఈ ఫ్యాక్టరీలో ఏ ఉత్పత్తులు తయారవుతాయనే అంశంపై స్పష్టత లేదు. ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపయోగిస్తారని మాత్రమే చెబుతున్నారు. ఫాక్స్‌కాన్-ఆపిల్ భాగస్వామ్యం దృష్ట్యా, ఇది ఆపిల్ కోసం అనుకుంటున్నప్పటికీ, పరిమాణం, పెట్టుబడి స్థాయి చూస్తే ఐఫోన్ లేదా ఐప్యాడ్ లాంటి ప్రధాన ఉత్పత్తులకు ఇది అనుకూలంగా కనిపించడం లేదు.
అంతేకాదు, డిజైన్ దశలో కూడా AI వాడతారన్న సమాచారం, ఆపిల్ సాధారణ తయారీ విధానాలకు సరిపోలడం లేదు. అందువల్ల ఇది ఫాక్స్‌కాన్ ఇతర క్లయింట్ల కోసం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో విస్కాన్సిన్‌లో ఫాక్స్‌కాన్ ప్రతిపాదించిన భారీ ప్రాజెక్ట్‌తో పోలిస్తే, ఇది చిన్న స్థాయి ప్రాజెక్ట్ అయినప్పటికీ, అయితే అమలులోకి వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అదనంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ కెంటకీ ఫ్యాక్టరీ కోసం లూయిస్విల్ బిజినెస్ ఫస్ట్ వెలికితీసిన అనుమతుల పత్రాల్లో అప్‌గ్రేడ్లు పూర్తిగా అంతర్గత నిర్మాణ మార్పులకే పరిమితమవుతాయని స్పష్టంగా ఉంది. అలాగే, గతంలో యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్, సరైన స్థాయి రోబోటిక్ ఆర్మ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆపిల్ అమెరికాలో తయారీకి ముందుకు వస్తుందని వ్యాఖ్యానించిన విషయం ఈ ప్రాజెక్ట్ సందర్భంలో ప్రస్తావనీయంగా మారుతోంది.
ప్రకటన
ప్రకటన
Wednesday Season 3 Set for July 2027 on Netflix: Jenna Ortega Returns as the Iconic Addams Heir
Lakshmi Manchu’s Daksha: The Deadly Conspiracy Available for Streaming on Amazon Prime Video