Photo Credit: Samsung
Galaxy F06 5G భారతదేశంలో ఫిబ్రవరి 20 నుండి విక్రయించబడుతుంది
మన దేశంలో Samsung అత్యంత సరసమైన 5G స్మార్ట్ ఫోన్‌గా Galaxy F06 5G విడుదల చేసింది. దీని ప్రారంభ ధర దీనిని రూ. 10,000 కంటే తక్కువగా ఉండనుంది. నిజంగా ఇది Samsung నుంచి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ప్రధానంగా OEMలకు మాస్ మార్కెట్‌గా పరిగణించబడే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ మోడల్‌ను కంపెనీ పరిచయం చేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ధర రేంజ్‌లో Samsung లెటెస్ట్ స్మార్ట్ ఫోన్ నుంచి ఆశించే అన్ని రకాల ఫీచర్స్‌నూ అందిస్తోంది.
Gadgets 360, Samsung ఇండియా MX బిజినెస్ జనరల్ మేనేజర్ అక్షయ్ ఎస్ రావుతో మాట్లాడగా.. వినియోగదారులకు అవసరమైన ప్రధాన అంశాలను గుర్తించినట్లు చెప్పారు. వాటిని అందించడంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఈ మోడల్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో 5Gకి సపోర్ట్ చేసే ఫోన్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగా 5G ఫోన్‌ను SA, NSA, అన్ని క్యారియర్ అగ్రిగేషన్‌తో సహా టెలికాం ఆపరేటర్స్ సపోర్ట్‌తో దీనిని తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు.
Samsung తమ R&Dలో స్ట్రెంత్ కలిగి ఉండడంతోపాటు ఈ మోడల్‌కు పూర్తి 5G అనుభవాన్ని అందించడం, డిజైన్ ఎంపిక వంటి అంశాలు కలిసొచ్చాయని అన్నారు. యువతే ప్రధాన లక్ష్యంగా దీనిని రూపొందించారు. ఈ బడ్జెట్‌లో ఓ మాస్ 5G ఫోన్ తీసుకుంటున్నాం అనే భావన కలగకుండా ప్రీమియం మోడల్‌లా కనిపించేలా దీని డిజైన్, కలర్ ఆప్షన్, షైనింగ్ ఉంటాయి. అలాంటి ప్రొడక్ట్‌నే యువత కూడా కోరుకుంటారు. 4GB + 128GB స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,499 వరకూ ఉండొచ్చన్నారు.
నాలుగేళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించే ఆలోచన ఎలా వచ్చిందని అడిగినప్పుడు.. భారత్‌లో తమ సంస్థకున్న బలాన్ని గుర్తు చేశారు. ఇక్కడ పెద్ద స్థాయిలో పరిశోధన కేంద్రాలు ఉండడం కూడా ఓ కారణంగా చెప్పుకొచ్చారు. ఆప్టిమైజ్ చేయడంతోపాటు ఉత్పత్తి కేంద్రాలు తమకు ఉండడంతో ఇతర అవసరాల కోసం ఎదరు చూడాల్సిన అవసరం లేకుండా తామే అందించగలమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్ల OS అప్‌గ్రేడ్‌లను మరెవరూ ఈ ధరలో ప్రకటించలేరని, ఇది తమ వినియోగదారులకు కంపెనీ ఇచ్చే భరోసా అని తెలిపారు.
Samsung Galaxy F-సిరీస్ కొంతకాలంగా ఆకర్షణీయమైన డివైజ్‌లను అందిస్తోంది. తాజా మోడల్ 800nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వెనుక 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. అండర్ ది హుడ్ MediaTek D6300 ప్రాసెసర్‌తో 4GB + 128GB, 6GB + 128GB ఆప్షన్‌లలో వస్తుంది. 25W ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది Android 15-ఆధారిత One UI 7.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో లాంచ్ అవుతుంది.
ప్రకటన
ప్రకటన