F సిరీస్ నుంచే రాబోయే ఈ అత్యాధునిక AI ఫీచర్స్ Galaxy F36 5G హ్యాండ్‌సెట్ జూలై 29 శనివారం మధ్యాహ్నం భారత్‌లో లాంఛ్ కానుంది.
Photo Credit: Samsung
గెలాక్సీ F36 5G లెదర్ ఫినిష్ రియర్ ప్యానెల్‌తో మూడు రంగుల ఎంపికలలో లభిస్తుంది
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ Samsung సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మన దేశంలోని మొబైల్ మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. F సిరీస్ నుంచే రాబోయే ఈ అత్యాధునిక AI ఫీచర్స్ హ్యాండ్‌సెట్ జూలై 29 శనివారం మధ్యాహ్నం భారత్‌లో లాంఛ్ కానుంది. గత ఏడాది మార్కెట్‌లోకి వచ్చిన Samsung Galaxy F35 5G మొబైల్‌కు కొనసాగింపుగా Galaxy F36 5G పేరుతో ఇది రానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. సరికొత్త AI ఫీచర్స్‌తో వస్తోన్న ఈ Hi-FAI ఫోన్‌కు సంబంధించిన పలు కీలక విషయాలను తెలుసుకుందాం.రెండు వేరియంట్‌లలో,గతంలో పరిచయం అయిన Galaxy F35 5G మోడల్ ధర రూ. 18,999లకు ఉండగా, రాబోయే Galaxy F36 5G ధర రూ. 20,000 వరకూ ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతే కాదు, ప్రీమియం డిజైన్‌తో వస్తోన్న F36 ఫోన్ 5G హ్యాండ్‌సెట్‌లలో తక్కువ ధర కలిగిందిగా కూడా చెప్పబడుతోంది. 4GB+ 128 GB, 6GB+ 128GB స్టోరేజీ సామర్థ్యం కలిగిన రెండు వేరియంట్‌లలో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది.
Samsung Galaxy F36 5G ఫోన్ మిస్టిక్ గ్రీన్, క్రిమ్సన్ రెడ్, ఎలక్ట్రిక్ బ్లాక్ మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. ఈ మోడల్ కంపెనీ అధికారిక వెబ్ సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా జూలై 29న కొనుగోలుకు అందుబాటులోకి ఉంటుంది. అంతే కాదు, దీనికి లాంఛ్ ఆఫర్స్‌తోపాటు డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్ వంటివి కూడా కంపెనీ అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ కొత్త Galaxy F36 5G హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల సూపర్ AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే, ఇది 120 హెచ్‌జెడ్ రిఫ్రిష్ రేట్‌తో రావడంతో యూజర్స్ సున్నితమైన స్క్రోలింగ్, సరికొత్త వీక్షణ అనుభాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్‌కు ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌ను అందించారు. ఇది మంచి శక్తివంతమైన పనితీరును కనబరచడంతోపాటు మల్టీటాస్కింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. అలాగే, USB టైప్ C పోర్ట్‌తోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
రాబోయే ఈ ఫోన్ కెమెరా విభాగానికి సంబంధించిన విషయాలను పరిశీలిస్తే.. దీనికి ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. అలాగే, వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఆడ్రాయిడ్ 15 ఓఎస్‌తో రన్ అవుతుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తోంది. కనెక్టివిటీ ఆప్షన్‌లలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, GPS + GLONASS, బ్లూటూత్ 5.3 వంటివి ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన