అదనంగా, Vivo కంపెనీ Vivo Sans అనే కొత్త ఫాంట్‌ను ప్రవేశపెట్టింది

కంపెనీ వివరాల ప్రకారం, మొదటగా ఈ అప్‌డేట్ Vivo X200 సిరీస్ ఫోన్లకు నవంబర్ ప్రారంభంలో అందుతుంది.

అదనంగా, Vivo కంపెనీ Vivo Sans అనే కొత్త ఫాంట్‌ను ప్రవేశపెట్టింది

Photo Credit: Vivo

OriginOS 6 అప్‌డేట్‌ను Vivo, అక్టోబర్ 10న జరిగిన Developer Conference 2025లో అధికారికంగా పరిచయం చేసింది

ముఖ్యాంశాలు
  • నవంబర్‌లో Vivo X200 సిరీస్‌కి అప్‌డేట్
  • కొత్త స్మూత్ డిజైన్‌ మరియు వేగవంతమైన పనితీరు
  • 2026 మొదటి భాగంలో అన్ని ఫోన్లకు అందుబాటులోకి
ప్రకటన

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వీవో (Vivo) తన తాజా OriginOS 6 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అక్టోబర్ 10న చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఇదే సమయంలో కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లైన Vivo X300 Pro మరియు Vivo X300 స్మార్ట్‌ఫోన్‌లను కూడా పరిచయం చేసింది. ఇవి Android 16 ఆధారంగా రూపొందించిన ColorOS 6తో ముందుగానే వస్తాయి. ఇప్పటికే చైనా మరియు గ్లోబల్ మార్కెట్ల కోసం విడుదల షెడ్యూల్‌ను ప్రకటించిన వీవో, ఇప్పుడు భారత మార్కెట్‌ కోసం కూడా OriginOS 6 అప్‌డేట్ రోల్‌అవుట్ టైమ్‌లైన్‌ను వెల్లడించింది.

భారతదేశంలో OriginOS 6 విడుదల సమయాలు

కంపెనీ వివరాల ప్రకారం, మొదటగా ఈ అప్‌డేట్ Vivo X200 సిరీస్ ఫోన్లకు నవంబర్ ప్రారంభంలో అందుతుంది. తర్వాతి దశల్లో ఇతర మోడళ్లకు కూడా అప్‌డేట్ చేరుతుంది. మొత్తం రోల్‌అవుట్ ప్రక్రియ 2026 తొలి అర్ధభాగంలో పూర్తవుతుంది.

విడుదల షెడ్యూల్ వివరాలు:

నవంబర్ 2025 ప్రారంభంలో Vivo X200 Series, Vivo X Fold 5, Vivo V60.... నవంబర్ 2025 మధ్యలో Vivo X100 Series, Vivo X Fold 3 Pro
... డిసెంబర్ 2025 మధ్యలో Vivo V60e, Vivo V50, V50e, Vivo T4 Ultra, T4 Pro, T4R 5G.... 2026 తొలి అర్ధభాగంలో Vivo X90, V40, V30 Series, Vivo T4 5G, T4x 5G, T3 Series, Vivo Y400, Y300 5G, Y200, Y100, Y100A, Vivo Y58 5G, Y39 5G కి అప్డేట్స్ రానున్నాయి.

OriginOS 6లో ఉన్న కొత్త ఫీచర్లు:

OriginOS 6 అప్‌డేట్‌ను Vivo అక్టోబర్ 10న జరిగిన Vivo Developer Conference 2025 సందర్భంగా పరిచయం చేసింది. ఇందులో కొత్త Origin Smooth Engineను చేర్చడం ద్వారా యూజర్ అనుభవం మరింత మృదువుగా, వేగవంతంగా మారింది. అలాగే కంపెనీ యొక్క Ultra-core Computing మరియు Memory Fusion టెక్నాలజీలకు కూడా ఇది సపోర్ట్ ఇస్తుంది. Vivo ప్రకారం, ఈ అప్‌డేట్‌తో యూజర్లు 5,000 ఫోటోలు ఉన్న ఆల్బమ్‌ను కొన్ని సెకన్లలోనే ఓపెన్ చేయగలరు. ఓల్డ్ వెర్షన్‌తో పోల్చితే ఇది 106 శాతం వేగంగా డేటా లోడ్ చేస్తుంది. చైనా వెలుపల ఉన్న యూజర్లకు OriginOS 5 అందుబాటులో లేనందున, ఈ కొత్త అప్‌డేట్ Funtouch OS 15 స్థానాన్ని తీసుకుంటుంది.

మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ మరియు స్మార్ట్ ఫీచర్లు:

OriginOS 6లో కొత్త Dual Rendering Architecture ఉపయోగించడంతో యాప్‌లు వేగంగా, సమర్థంగా పని చేస్తాయి. కొత్తగా డిజైన్ చేసిన UIలో ఐకాన్‌లు మరియు విడ్జెట్‌లు డైనమిక్‌గా కదులుతాయి. మార్ఫింగ్ యానిమేషన్స, వన్ షాట్ యానిమేషన్స్, లైట్ అండ్ షాడో స్పేస్, డైనమిక్ గ్లో వంటి గ్రాఫిక్ ఎఫెక్ట్‌లు ఇంటర్‌ఫేస్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

అదనంగా, Vivo కంపెనీ Vivo Sans అనే కొత్త ఫాంట్‌ను ప్రవేశపెట్టింది, ఇది 40 కంటే ఎక్కువ భాషలను సపోర్ట్ చేస్తుంది. అలాగే, Origin Island అనే కొత్త స్మార్ట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు మ్యూజిక్ కంట్రోల్స్, కాపీ చేసిన నంబర్లకు కాల్ లేదా మెసేజ్ షార్ట్‌కట్లు, మీటింగ్ వివరాలు వంటి సమాచారం నేరుగా హోమ్‌స్క్రీన్‌లోనే చూడగలరు. ముఖ్యంగా, ఈ అప్‌డేట్ యూజర్లకు ఆపిల్ పరికరాలతో కనెక్ట్ అయ్యే సదుపాయం కూడా ఇస్తుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. హువావే నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్, 5500mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌
  2. Huawei ఇప్పటివరకు Nova Flip S ప్రాసెసర్ లేదా RAM వివరాలను అధికారికంగా వెల్లడించలేదు
  3. అదనంగా, Vivo కంపెనీ Vivo Sans అనే కొత్త ఫాంట్‌ను ప్రవేశపెట్టింది
  4. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది
  5. వాట్సప్‌లో అదిరే అప్డేట్.. త్వరలోనే ప్రారంభం
  6. ఆపిల్ నుంచి కొత్త మ్యాక్ బుక్ ప్రో.. అదిరే ఫీచర్స్
  7. ఇన్ స్టాగ్రాంలో దీపావళి స్పెషల్.. ఈ ఎడిట్ గురించి మీకు తెలుసా?
  8. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్26 ఎడ్జ్ మోడల్‌కి గుడ్ బై.. దాని స్థానంలో రానున్నది ఇదే
  9. ఒప్పో వాచ్ ఎస్ ప్రారంభం.. కళ్లు చెదిరే ధర, ఫీచర్స్
  10. ఈ రెండు ఫోన్లూ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »