Huawei Nova Flip S ధర CNY 3,388 (ఇండియాలో సుమారు రూ. 41,900) నుంచి ప్రారంభమవుతుంది.
Photo Credit: Huawei
Huawei Nova Flip S ప్రాసెసర్, RAM వివరాలు ఇంకా తెలియని వో, Kirin 8000 ఉపయోగించవచ్చని అంచనా
చైనా టెక్ దిగ్గజం Huawei తన కొత్త Nova Flip S ఫ్లిప్ ఫోన్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఇది గత ఏడాది ఆగస్టులో విడుదలైన Nova Flip మోడల్‌తో పోలిస్తే దాదాపు అదే ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ, ధర మరింత తక్కువగా ఉండటం మరియు రెండు కొత్త రంగుల ఆప్షన్‌లు అందుబాటులోకి రావడం ప్రత్యేకత. ఈ ఫోన్‌లో 4,400mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పరికరంలో 2.14 అంగుళాల కవర్ డిస్‌ప్లే మరియు 6.94 అంగుళాల ఫోల్డబుల్ ప్రధాన స్క్రీన్ ఉన్నాయి. పనితీరు పరంగా, ఇది స్టాండర్డ్ Nova Flip మోడల్‌లో ఉన్న Kirin 8000 ప్రాసెసర్‌నే ఉపయోగించే అవకాశం ఉంది.
Huawei Nova Flip S ధర CNY 3,388 (ఇండియాలో సుమారు రూ. 41,900) నుంచి ప్రారంభమవుతుంది. 512GB వేరియంట్ ధర CNY 3,688 (దాదాపు రూ. 45,600). ఈ ఫోన్ మొత్తం న్యూ గ్రీన్, జీరో వైట్, సకురా పింక్, స్టార్ బ్లాక్ స్కై, స్కై బ్లూ ,అండ్ ఫెదర్ సాండ్ బ్లాక్ అనే ఆరు రంగులలో లభిస్తుంది.
Huawei Nova Flip Sలో 6.94 అంగుళాల ఫుల్-HD+ (2690×1136 పిక్సెల్స్) OLED ఫోల్డబుల్ ప్రధాన స్క్రీన్, అలాగే 2.14 అంగుళాల OLED కవర్ స్క్రీన్ ఉన్నాయి. కవర్ స్క్రీన్ రిజల్యూషన్ 480×480 పిక్సెల్స్, మరియు రెండు డిస్‌ప్లేలు రౌండెడ్ కార్నర్‌లతో డిజైన్ చేయబడ్డాయి. ప్రధాన స్క్రీన్ P3 వైడ్ కలర్ గాముట్, 120Hz LTPO అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1440Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, మరియు 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ చేస్తుంది. వీటివల్ల స్క్రీన్ మరింత స్మూత్ గా ఉంటుంది.
Huawei ఇప్పటివరకు Nova Flip S ప్రాసెసర్ లేదా RAM వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇది స్టాండర్డ్ Nova Flipలో ఉపయోగించిన Kirin 8000 చిప్‌సెట్నే ఉపయోగించే అవకాశం ఉంది. ఫోన్ 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది HarmonyOS 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం, ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (f/1.9) మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా (f/2.2) ఉన్నాయి. ప్రధాన కెమెరా 4K వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ తెలిపిన ప్రకారం, ఫోటో క్వాలిటీ వాడే షూటింగ్ మోడ్‌పై ఆధారపడి మారవచ్చు. అంతర్గత స్క్రీన్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (f/2.2) కూడా ఉంది.
పవర్ పరంగా, 4,400mAh బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ అందించబడింది. ఫోన్‌ను పూర్తిగా ఓపెన్ చేసినప్పుడు దాని మందం కేవలం 6.88 మిల్లీమీటర్లు, బరువు 195 గ్రాములు మాత్రమే ఉంటుంది. సెక్యూరిటీ కోసం, ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వబడింది, ఇది వేగవంతమైన అన్లాక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
ప్రకటన
ప్రకటన