Photo Credit: Samsung
ఈ జనవరి 22న జరిగిన Galaxy అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో Samsung Galaxy S25 సిరీస్‌ను భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బేస్ Galaxy S25 మోడల్‌కు చెందిన 256GB, 512GB కాన్ఫిగరేషన్‌ల లభ్యతతోపాటు ధరలను మాత్రమే కంపెనీ ప్రకటించింది. అయితే, తాజా నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ తక్కువ ధరకు 128GB స్టోరేజ్ వేరియంట్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ స్పెసిఫికేషన్స్‌తో సరసమైన ధరకు లభించే స్మార్ట్ ఫోన్‌గా వినియోగదారులను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రిటైల్ వర్గాలతోపాటు 91Mobiles హిందీ నివేదిక ప్రకారం.. మన దేశంలో Samsung Galaxy S25 128GB మోడల్ ధర రూ. 74,999గా ఉంది. అంతేకాదు, గత ఏడాది Galaxy S24 కూడా ఇదే విధమైన కాన్ఫిగరేషన్‌లో ఇదే ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్‌లు ఇంకా ప్రారంభం కానప్పటికీ, ఈ నిర్దిష్ట కాన్ఫిగరేషన్‌ను తర్వాత తేదీలలో కొనుగోలుకు అందుబాటులో ఉంచవచ్చని నివేదిక చెబుతోంది.
ఈ మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్ లభ్యతపై చాలా సందేహాలు వస్తున్నాయి. అందుకు కారణం, అధికారిక Samsung India వెబ్‌సైట్‌లో 128GB మోడల్ లిస్ట్ అవుట్ చేయలేదు. దీనిని రిటైల్ షాపులు, ఇతర ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా మాత్రమే విక్రయించే అవకాశం ఉందని అంచనా. అలాగే, ఈ ఫోన్ USతోపాటు ఇతర మార్కెట్‌లలో అదే కాన్ఫిగరేషన్‌లో $799 (సుమారు రూ. 69,100)కి అందుబాటులో ఉంది.
Galaxy S25 మొదట భారతదేశంలో 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లలో ప్రారంభమైంది. దీని ధర వరుసగా రూ. 80,999, రూ. 92,999గా ఉంది. ఇది ఐసీ బ్లూ, మింట్, నేవీ, సిల్వర్ షాడో కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. అయితే, బ్లూ బ్లాక్, కోరల్రెడ్, పింక్‌గోల్డ్ కలర్ వేరియంట్‌లు Samsung ఆన్‌లైన్ స్టోర్‌లో లభించే ప్రత్యేకమైనవిగా చెప్పొచ్చు.
కొత్త Galaxy S25 ఫోన్ 6.2-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,340 పిక్సెల్స్) డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 2,600nits పీక్ బ్రైట్‌నెస్‌తో రూపొందించబడింది. ఇది Android 15-ఆధారిత One UI 7పై పనిచేసే డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్. అలాగే, 12GB LPDDR5x RAM, 512GB వరకు స్టోరేజీతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది.
Galaxy S25 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 2x ఇన్-సెన్సార్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, OISతో 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 4,000mAh బ్యాటరీతో దీనిని 25W వద్ద ఛార్జ్ చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన