Photo Credit: Samsung
ఈ జనవరి 22న Samsung Galaxy Unpacked జరగనుంది. ఈ నేపథ్యంలో Samsung Galaxy S25 సిరీస్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈవెంట్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సిరీస్‌లోని Galaxy S25, Galaxy S25+, Galaxy S25 Ultra మోడల్స్ గురించిన మరిన్ని వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, కంపెనీ నుంచి రాబోతున్న Galaxy S సిరీస్ ఫోన్‌ల ధరలపై కొత్త లీక్ బహిర్గతమైంది. ఈ కొత్త సిరీస్ దేశంలోని Galaxy S24 సిరీస్ కంటే అన్ని కాన్ఫిగరేషన్‌లలోనూ ఖరీదైనదిగా కనిపిస్తోంది.
తరుణ్ వాట్స్ (@tarunvats33) అనే వినియోడదారు X వేదికగా భారత్‌లోని Samsung Galaxy S25 సిరీస్ ధరను లీక్ చేశారు. రాబోయే Galaxy S25 మోడల్ 12GB RAM, 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ ధర రూ. 84,999 ఉండవచ్చని అంచనా. అలాగే, 12GB+512GB వేరియంట్ ధర రూ. 94,999గా ఉండవచ్చని వెల్లడించారు. గత సంవత్సరం లాంచ్ అయిన Galaxy S24 8GB+128GB మోడల్ ప్రారంభ ధర రూ. 74,999గా ఉంది.
సిరీస్‌లోని Samsung Galaxy S25+ మోడల్ 12GB+256GB వేరియంట్ ధర రూ. 1,04,999గా ఉండగా, Vats ప్రకారం చూస్తే, ఇది Galaxy S24+ ప్రారంభ ధర రూ. 99,999 కంటే ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే, ఈ మోడల్‌లో 12GB+512GB వేరియంట్ ధర రూ. 1,14,999 అని వాట్స్ వెల్లడించింది. ఇతర కంపెనీలు సైతం ఈ సిరీస్ నుంచి వచ్చే మోడల్స్ ధరలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
వీటిలో టాప్-ఎండ్ Samsung Galaxy S25 Ultra మోడల్ 12GB+256GB వేరియంట్ ధర రూ. 1,34,999 ఉంటుందని, 16GB+512GB వేరియంట్ ధర రూ. 1,44,999, టాప్-ఆఫ్-ది-లైన్ 16GB+1TB మోడల్ ధర రూ. 1,64,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన Galaxy S24 Ultra బేస్ 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 1,29,999గా ఉంది. దీంతో పోల్చి చూసినప్పుడు ధర మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తోంది.
తాజా లీక్ ప్రకారం, Samsung కొత్త లైనప్‌లోని అన్ని వేరియంట్‌లలోనూ కంపెనీ స్వల్పంగా ధర పెరుగుదలను తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రూపొందించడం వల్ల కూడా గత సంవత్సరం వచ్చిన మోడల్‌ల కంటే ఈ Samsung ఫోన్‌ల ధర ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 22న Samsung తన Galaxy Unpacked ఈవెంట్‌ను నిర్వహించనుంది. ప్రస్తుతం కంపెనీ ఇండియా వెబ్‌సైట్, Samsung ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా దేశీయ మార్కెట్‌లో కొత్త Galaxy S25 సిరీస్ స్మార్ట్ ఫోన్‌ల కోసం బుకింగ్‌లను స్వీకరిస్తోంది.
ప్రకటన
ప్రకటన