Photo Credit: Samsung
Samsung Galaxy Z Fold 7 ఆండ్రాయిడ్ 16 పై One UI 8 తో రన్ అవుతుంది
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 అధికారికంగా గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ అయింది. ఈ కొత్త బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ చిప్‌సెట్ వాడారు. కవర్ డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటెక్షన్‌ను ఇస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, 12GB + 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,74,999 నుంచి మొదలవుతుంది. 12GB + 512GB వేరియంట్ ధర రూ. 1,86,999 కాగా, 16GB + 1TB వేరియంట్ ధర రూ. 2,10,999గా ఉంది. ఇలా కలర్ విషయానికి వస్తే... బ్లూ షాడో, జెట్ బ్లాక్, సిల్వర్ షాడో కలర్స్ లో అందుబాటులో ఉండగా, మింట్ కలర్ మాత్రం ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తుంది..
డ్యూయల్ సిమ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఆండ్రాయిడ్ 16 మరియు వన్ UI 8 పై పనిచేస్తుంది. ఇందులో 8 ఇంచెస్ QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 368ppi పిక్సెల్ డెంసిటీ, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఔటర్ పార్ట్ లో 6.5 ఇంచెస్ ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఉంటుంది. దీనికి 422ppi పిక్సెల్ డెంసిటీ, 120Hz రిఫ్రెష్ రేట్, 21:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది.
ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ చిప్‌సెట్‌తో వస్తుంది. జెమినీ లైవ్, సర్కిల్ టూ సర్చ్, డ్రాయింగ్ అసిస్ట్, రైటింగ్ అసిస్ట్ వంటి అనేక AI ఫీచర్లు ఇందులో ఉన్నాయి. జూలై 12 లోపు ప్రీ-ఆర్డర్ చేసుకునే వారికి 12GB + 512GB వేరియంట్‌ను 256GB మోడల్ ధరకు పొందే అవకాశం ఉంది. జూలై 25 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి
గెలాక్సీ Z ఫోల్డ్ 7 లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది క్వాడ్ పిక్సెల్ ఆటోఫోకస్, OIS సపోర్ట్, 85 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉంది. దీనితో పాటు 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఫోన్‌లో రెండు 10MP కెమెరాలు ఉన్నాయి. ఒకటి కవర్ డిస్ప్లేపై, మరొకటి ఇన్నర్ స్క్రీన్ పై ఉంటుంది.
ఫోన్‌లో లేటెస్ట్ శాంసంగ్ ప్రో విజువల్ ఇంజిన్ కూడా ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సిలరొమీటర్, బారోమీటర్, జైరోస్కోప్, హాల్ సెన్సర్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అనేక సెన్సార్‌లు ఇందులో ఉన్నాయి. ఫోన్ సైడ్ ఎడ్జ్ లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ అర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. వీరితో పాటు IP48 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్‌లో 4,400mAh బ్యాటరీ బ్యాక్అప్ ఉంది. ఇదే 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 30 నిమిషాల్లో పాటు ఛార్జింగ్ పెడితే 50% ఛార్జ్ అవుతుందని శాంసంగ్ పేర్కొంది. అంతేకాకుండా ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 మరియు వైర్లెస్ పవర్‌షేర్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
గెలాక్సీ Z ఫోల్డ్ 7 గత సంవత్సర మోడల్స్‌తో పోలిస్తే మరింత సన్నగా ఉంది. ఫోన్ తెరిచినప్పుడు 4.2mm థిక్నెస్ తో ఉండగా, ఫోల్డ్ చేసినప్పుడు 8.9mm ఉంటుంది. 215 గ్రాములు బరువుతో మాత్రమే ఉంటుంది. మొత్తంగా చూస్తే, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 మల్టీటాస్కింగ్, ప్రొఫెషనల్ వర్క్, కంటెంట్ క్రియేషన్ వంటి అవసరాలకు సరిపోయే అత్యాధునిక ఫోల్డబుల్ ఫోన్. AI ఫీచర్లు, ప్రీమియం డిజైన్, హై రేంజ్ కెమెరాలతో ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.
ప్రకటన
ప్రకటన