Photo Credit: OnePlus
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన OnePlus 12R స్మార్ట్ ఫోన్‌కు కొనసాగింపుగా OnePlus 13Rను కంపెనీ పరిచయం చేయనున్నట్లు సమాచారం. తాజాగా, ఈ హ్యాండ్‌సెట్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. అంతేకాదు, కంపెనీ ఇప్పటికే చైనాలో ఫ్లాగ్‌షిప్ OnePlus 13ని పరిచయం చేసింది. అలాగే, రాబోయే నెలల్లోనే ఈ హ్యాండ్‌సెట్‌ను గ్లోబల్ మార్కెట్లలోకి అందుబాటులోకి తీసుకురానుంది. కంపెనీ హై-ఎండ్ స్మార్ట్ ఫోన్‌తో పాటు అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్న OnePlus 13R నుంచి ఎలాంటి ఫీచర్స్‌ను కోరుకోవచ్చే విషయంపై మొబైల్ మార్కెట్‌లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
Geekbenchలో లిస్ట్‌లో OnePlus CPH2645 మోడల్ నంబర్‌తో కూడిన ఓ స్మార్ట్ ఫోన్ కనిపించింది. ఈ హ్యాండ్‌సెట్ OnePlus 13Rగా మార్కెట్‌కు పరిచయం కానున్నట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి కంపెనీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. గడిచిన కొన్నేళ్లుగా చూస్తే.. కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్, కొంచెం తక్కువ ప్రీమియం స్పెసిఫికేషన్‌లతో తక్కువ ఖరీదైన మోడల్ ఇలా రెండు స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ వీటికి భిన్నంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజాగా om Geekbench లిస్ట్‌వుట్‌లో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో పైనాపిల్ అనే మదర్‌బోర్డును అమర్చినట్లు స్పష్టం చేసింది. అంతేకాదు, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో OnePlus 13R ఫోన్‌ను రూపొందించినట్లు సూచిస్తోంది. అయితే, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న OnePlus 12 హ్యాండ్‌సెట్‌లోనూ ఇదే ప్రాసెసర్ వస్తోంది. తద్వారా అదే ప్రాసెసర్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఇందులోని కీలకమైన మార్పులకు సంబంధించిన ఎలాంటి విషయాలు కూడా బహిర్గతం కాలేదు.
అలాగే, Geekbench లిస్ట్‌వుట్‌ను బట్టీ.. కనీసం 12GB RAMతో OnePlus 13R ఫోన్ రానున్నట్లు అంచనా వేయవచ్చు. అయితే, దీని స్టోరేజీ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడికాలేదు. అలాగే, OnePlus 13 మాదిరిగానే ఇది కూడా ఆండ్రాయిడ్ 15తో వస్తుంది అని, కంపెనీ ఆక్సిజన్‌ఓఎస్ 15 స్కిన్ పైన రన్ కానున్నట్లు మార్కెట్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. అంతేకాదు, బెంచ్‌మార్క్ రిజల్ట్ సైతం ఆండ్రాయిడ్ అదే వెర్షన్‌లో రన్ అవుతోన్న ఫోన్‌ను చూపిస్తోంది. దీని ఆధారంగా ఫోన్ ఓఎస్‌పై పూర్తి స్పష్టత వచ్చిందని చెప్పొచ్చు.
అలాగే, OnePlus 13R బెంచ్‌మార్క్ స్కోర్‌ల పనితీరును పరిశీలిస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ నుండి ఎలాంటి ఫీచర్స్‌ను ఆశించవచ్చు అనే అభిప్రాయాలకు సమాధానం దొరుకుతుంది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 2,238 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షలో 6,761 పాయింట్లను సాధించినట్లు స్పష్టమైంది. అలాగే, Geekbenchలో OnePlus 12తో పోల్చినట్లయితే ఈ ఫలితాలు కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు చెప్పొచ్చు. ఈ పరీక్షల ఆధారంగా రాబోయే హ్యాండ్‌సెట్ నుంచి ఎలాంటి అదనపు ఫీచర్స్‌ను పొందవచ్చనేది స్పష్టంగా తెలిసిపోతుంది.
ప్రకటన
ప్రకటన