ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను అందుకున్న మొట్టమొదటి నోకియా స్మార్ట్ ఫోన్‌గా HMD పల్స్ ప్రో

HMD పల్స్ ప్రో కోసం తాజా Android 15 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో వ‌ర్కింగ్‌ బూస్ట్, అడాప్టివ్ బ్యాటరీ డెవ‌ల‌ప్‌మెంట్‌, ప్రైవ‌సీ లాంటి ఫీచర్లను తీసుకువస్తుందని నివేదిక‌లో వెల్ల‌డైంది

ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను అందుకున్న మొట్టమొదటి నోకియా స్మార్ట్ ఫోన్‌గా HMD పల్స్ ప్రో

Photo Credit: HMD

MD పల్స్ ప్రో రెండు Android OS అప్‌గ్రేడ్‌లు మరియు మూడు సంవత్సరాల భద్రతా నవీకరణలను స్వీకరించడానికి సెట్ చేయబడింది

ముఖ్యాంశాలు
  • ఆండ్రాయిడ్ 15 వ‌ర్కింగ్‌ బూస్ట్, బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ను HMD పల్స్ ప్రోకి
  • అప్‌డేట్ సుమారుగా 3.12GB పరిమాణంలో ఉన్నట్లు వెల్ల‌డైంది
  • Google డిసెంబర్ Android సెక్యూరిటీ ప్యాచ్ కూడా అప్‌డేట్‌లో చేర్చబడింది
ప్రకటన

ఒక నివేదిక ప్ర‌కారం.. ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను అందుకున్న మొట్టమొదటి నోకియా స్మార్ట్ ఫోన్‌గా HMD పల్స్ ప్రో అవతరించింది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్‌లో ప‌రిచ‌య‌మైంది. అలాగే, ఇది ఆక్టా-కోర్ యునిసోక్ T606 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతోంది. అయితే, HMD పల్స్ ప్రో కోసం తాజా Android 15 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో వ‌ర్కింగ్‌ బూస్ట్, అడాప్టివ్ బ్యాటరీ డెవ‌ల‌ప్‌మెంట్‌, ప్రైవ‌సీ లాంటి ఫీచర్లను తీసుకువస్తుందని వెల్ల‌డైంది. అలాగే, ఇందులో సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లు, లేటెస్ట్‌ నోటిఫికేషన్ కంట్రోల్ సిస్ట‌మ్ వంటివి ఉన్నాయి. ఈ నివేదిక‌లో వెల్ల‌డైన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు చూసేద్దాం.

స్మార్ట్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌

తాజా NokiaMob నివేదిక ప్రకారం HMD పల్స్ ప్రో ఫోన్ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ వెర్షన్ 2.370ని కలిగి ఉండ‌డంతోపాటు దాదాపు 3.12GB పరిమాణంలో ఉంటుంది. వేగవంతమైన యాప్ లాంచ్ స్పీడ్‌, మెరుగైన బ్యాటరీ లైఫ్ మేనేజ్‌మెంట్‌తో సహా ఆప్టిమైజ్ చేయబడిన సిస్టమ్ పనితీరును అందిస్తుంద‌ని స్ప‌ష్ట‌మైంది. ఈ హ్యాండ్‌సెట్ స్మార్ట్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కూడా క‌లిగి ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. ఇది వినియోగ విధానాల లెర్న్ంగ్‌తోపాటు బ్యాటరీ లైఫ్ పెంచేందుకు అనుగుణంగా రిసోర్సెస్‌ను అందిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుద‌లైన HMD పల్స్ ప్రో ఫోన్‌ ఆక్టా-కోర్ యునిసోక్ T606 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

లేటెస్ట్‌ నోటిఫికేషన్ కంట్రోల్ సిస్టమ్

ఈ ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ తర్వాత, HMD పల్స్ ప్రో ఫోన్‌ మరింతగా లేటెస్ట్‌ నోటిఫికేషన్ కంట్రోల్ సిస్టమ్ నుండి ప్రయోజనం పొందే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే, నివేదిక ప్రకారం.. ఇది ఎలాంటి యాప్‌లు, ఈవెంట్‌ల అల‌ర్ట్‌ల‌ను పంపించ‌వచ్చ‌ని నియంత్రణను ఇవ్వడం ద్వారా వినియోగదారులకు మ‌రింత స‌హాయ‌ప‌డుతుంది. అప్‌డేట్‌ల‌కు సంబంధించిన‌ ఇతర మార్పులలో ముఖ్య‌మైన‌విగా యాప్ ప‌ర్మిష‌న్స్‌, ఆటోమేటిక్ ప‌ర్మిష‌న్‌ రీసెట్స్‌, డెవ‌ల‌ప్డ్‌ డేటా ఎన్‌క్రిప్షన్‌లు ఉన్నాయి. వీటిలో మ‌రో కీల‌క‌మైన‌ది డిసెంబర్ కోసం Google యొక్క Android సెక్యూరిటీ ప్యాచ్‌గా చెప్పొచ్చు.
మ‌రింత మెరుగుప‌డే అవ‌కాశాలు

HMD పల్స్ ప్రోతో పాటు Finnish స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ‌ నుండి అనేక ఇతర హ్యాండ్‌సెట్‌లు కూడా అప్‌డేట్‌ను స్వీకరిస్తున్నట్లు వెల్ల‌డైంది. Android 15కి అప్‌గ్రేడ్ చేయగల HMD డ్రైవ్‌ల‌ జాబితా కూడా అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఫీచ‌ర్స్ ద్వారా వీటి ప‌నితీరు మ‌రింత మెరుగుప‌డ‌డంతోపాటు వినియోగం కూడా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ అంచ‌నాలు ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తాయో చూడాల్సి ఉంది.

స్మార్ట్ ఫోన్‌ల జాబితా ఇదే..

  • నోకియా G42 5G
  • నోకియా G60 5G
  • నోకియా XR21 5G
  • నోకియా X30 5G
  • HMD పల్స్ సిరీస్
  • HMD క్రెస్ట్ సిరీస్
  • HMD ఫ్యూజన్
  • HMD స్కైలైన్
  • HMD XR21 5G
  • HMD T21

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు వచ్చేశాయ్, ఆరోగ్య లక్షణాలు చెప్పే సెన్సార్లు, 19 నుంచి సేల్స్ ప్రారంభం
  2. కళ్లు చెదిరే మోడల్స్, ధరతో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
  3. iPhone Air పూర్తిగా eSIM-only మోడల్‌గా వస్తుంది
  4. iPhone 17 లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది
  5. నేపథ్యంలో రాబోయే iPhone 17 సిరీస్పై వరుసగా లీకులు వెలుగులోకి వస్తున్నాయి
  6. iPhone 17 Pro మోడళ్ల రూపకల్పనలో కూడా కీలక మార్పులు జరగనున్నాయి
  7. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 లైనప్‌లో నాలుగు కొత్త మోడల్స్ ప్రకటించబడతాయని అంచనా
  8. మార్కెట్‌లోకి సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు, కళ్లు చెదిరే ఫీచర్లు
  9. ఐఫోన్ 17 సిరీస్ రెడీ టు లాంఛ్.. ఏ ఏ మోడల్స్ వస్తున్నాయంటే?
  10. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »