HMD Fusion మోడల్ గరిష్టంగా 8GB RAMతో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది 108-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది
Photo Credit: HMD
HMD Fusion comes with Android 14 with a promise of two years of OS upgrades
IFA 2024 ఈవెంట్‌లో తాజాగా HMD కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ HMD Fusionను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌కు స్మార్ట్ అవుట్‌ఫిట్స్ అని పిలిచే మార్చుకోగలిగిన కవర్‌లతో అటాచ్ చేయవచ్చు. ఇది ఫోనుకు సంబంధించిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను మార్చగలదు. ఈ HMD Fusion మోడల్ గరిష్టంగా 8GB RAMతో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది 108-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది. HMD Fusion మాడ్యులర్ డిజైన్‌ను కలిగి ఉండడంతో రిపేర్ చేయడం సులభంగా ఉంటుంది.
HMD Fusion మోడల్ ఫోన్ త్వరలో UKలో అందుబాటులోకి రానున్నట్లు నిర్థారించబడింది. అక్కడి ప్రారంభ ధర దాదాపు EUR 249 (దాదాపు రూ. 24,000) వరకూ ఉంటుందని, ఈ ఏడాది చివర్లో పూర్తిస్థాయిలో హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా. HMD Fusion Android 14లో నడుస్తుంది. దీంతోపాటు కంపెనీ రెండు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌గ్రేడ్లను అందించనున్నట్లు ప్రకటించింది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. 600 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.56-అంగుళాల HD+ (720 x 1,612 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గరిష్టంగా 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో నడుస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా నిల్వను 1TB వరకు పెంచుకోవచ్చు.
దీనికి స్మార్ట్ అవుట్‌ఫిట్‌లను ఆరు పిన్‌ల ద్వారా ఫోన్‌కు జోడించవచ్చు. Flashy అవుట్‌ఫిట్‌లో ముందు, వెనుక కెమెరాలతో ఉపయోగించడానికి ఇంటర్నల్ బిల్డ్ రింగ్ లైట్‌ని అమర్చారు. ఇది మొబైల్‌లోని నియంత్రణల ద్వారా మూడ్ లైటింగ్‌తో కెమెరాపై ప్రభావం పడకుండా నియంత్రించడానికి సహాయపడుతుంది. రగ్డ్ అవుట్‌ఫిట్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. అలాగే, మాగ్నటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, అత్యవసర (ICE) బటన్‌ను అందించారు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. HMD Fusion ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), డెప్త్ సెన్సార్‌తో కూడిన 2-మెగాపిక్సెల్, మెయిన్ సెన్సార్‌తో కూడిన 108-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వీడియో కాలింగ్‌కు ఎంతో అనువుగా ఉంటుంది.
HMD Fusionలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందించారు. బ్లూటూత్ 5.2, GPS/AGPS, GLONASS, BDS, గెలీలియో, OTG, USB టైప్-సి పోర్ట్, WiFi 802.11a/b/g/n/ac/ax ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ IP52-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 65 గంటల వరకు పనిచేస్తుంది. 164.15x75.5x8.32mm పరిమాణంతో 202.5 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
This Strange New Crystal Could Power the Next Leap in Quantum Computing
The Most Exciting Exoplanet Discoveries of 2025: Know the Strange Worlds Scientists Have Found
Chainsaw Man Hindi OTT Release: When and Where to Watch Popular Anime for Free
Athibheekara Kaamukan Is Streaming Online: All You Need to Know About the Malayali Romance Drama