HMD బార్కా ఫ్యూజన్, బార్కా 3210తోపాటు ఫ్యూజన్ X1 ఫోన్‌ను MWC 2025లో లాంఛ్ చేసిన కంపెనీ

ఇంటర్నెట్‌ను ఉపయోగించే యంగ్‌ యూజ‌ర్‌ల‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన HMD ఫ్యూజన్ X1 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

HMD బార్కా ఫ్యూజన్, బార్కా 3210తోపాటు ఫ్యూజన్ X1 ఫోన్‌ను MWC 2025లో లాంఛ్ చేసిన కంపెనీ

Photo Credit: HMD

HMD ఫ్యూజన్ X1 (ఎడమ), HMD బార్కా 3210 (మధ్య) మరియు HMD బార్కా ఫ్యూజన్

ముఖ్యాంశాలు
  • టీనేజర్స్‌ సురక్షితంగా ఫోన్‌ల‌ను ఉపయోగించేలా రూపొందిచ‌బ‌డిన‌ HMD ఫ్యూజన్
  • కొత్త HMD బార్కా ఫ్యూజన్ ఫోన్‌ ఫ్యూజన్ X1 రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు
  • HMD బార్కా 3210 క్లాసిక్ స్నేక్ గేమ్ థీమ్ వెర్షన్‌ను అందిస్తుంది
ప్రకటన

స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ FC బార్సిలోనాతో ఫిన్నిష్ కంపెనీ సహకారంలో భాగంగా HMD బార్కా ఫ్యూజన్, HMD బార్కా 3210లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025)లో ఆవిష్కరించారు. ఇది మునుపటిది కలెక్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అయినప్ప‌టికీ, ప్రత్యేకమైన థీమ్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. HMD బార్కా 3210 కంపెనీ క్లాసిక్ ఫీచర్ ఫోన్‌ను పోలి ఉండ‌డంతోపాటు 4G కనెక్టివిటీని అందిస్తుంది. ఇంటర్నెట్‌ను ఉపయోగించే యంగ్‌ యూజ‌ర్‌ల‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన HMD ఫ్యూజన్ X1 స్మార్ట్‌ఫోన్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ఈ కొత్త మోడళ్ల ధరలను మాత్రం కంపెనీ ఇంకా వెల్ల‌డించ‌లేదు. అలాగే, HMD బార్కా 3210 బ్లూ, గ్రానా రంగులలో లభించ‌నుంది.

HMD ఫ్యూజన్ X1 ఫీచ‌ర్స్‌

ఈ కొత్త మోడ‌ళ్లు రాబోయే నెలల్లో కొనుగోలుకు అందుబాటులోకి రావ‌చ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. HMD ఫ్యూజన్ X1 హ్యాండ్‌సెట్‌లో Snapdragon 4 Gen 2 ప్రాసెస‌ర్‌, 8GB వరకు RAM, 256GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజీని అందించ‌నున్నట్లు వెల్ల‌డైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే, 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 33W వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీతో రూపొందించ‌బ‌డింది. గ‌తేడాది వచ్చిన ఒరిజిన‌ల్‌ HMD ఫ్యూజన్ లాగానే, ఫోన్‌కు అనుకూలంగా ఉండే accessories అయిన వివిధ outfitsలను కూడా కంపెనీ అందిస్తోంది.

కంపెనీ చెబుతున్న‌దాని ప్రకారం..

HMD ఫ్యూజన్ X1 అనేది టీనేజర్స్‌ సహా యంగ్ యూజ‌ర్స్‌ ఇంటర్నెట్‌ను సురక్షితంగా స‌ర్చ్ చేయ‌డంలో సహాయపడటానికి రూపొందించబడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. తల్లిదండ్రులు లొకేష‌న్ సేఫ్టీ ఫీచ‌ర్స్‌ను యాక్సెస్ చేయ‌డంతోపాటు కాంటాక్ట్‌ల‌ను ఆమోదించ‌డం, కొన్ని యాప్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయడం, పిల్లల రియ‌ల్ టైం లొకేష‌న్ చూడ‌డం వంటివి చేయ‌వ‌చ్చు. అంతే కాదు, ఈ ఫీచ‌ర్స్‌ HMD Xplora పేరెంటల్ కంట్రోల్స్ సర్వీస్‌లో భాగంగా అందుబాటులో ఉంటాయి.

HMD బార్కా ఫ్యూజన్ ఫీచర్స్‌

కొత్త HMD బార్కా ఫ్యూజన్ హ్యాండ్‌సెట్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుంది. అయితే, కంపెనీ ఇంకా ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించనప్పటికీ, ఇది HMD ఫ్యూజన్ X1 రీబ్రాండెడ్, థీమ్డ్ వెర్షన్‌గా కనిపిస్తుంది. అలాగే, HMD బార్కా ఫ్యూజన్‌లో కస్టమర్‌లు ప్రత్యేకమైన థీమ్ కంటెంట్‌కు యాక్సెస్ పొందుతారు. ఇది కంపెనీ ఆటగాళ్ల సంతకాలను కలిగి ఉన్న కేసుతో వస్తుంది. ఇవి UV లైట్‌లో మెరుస్తాయి.

HMD బార్కా 3210 ఫీచ‌ర్స్‌

ఈ HMD బార్కా 3210 అనేది నోకియా 3210 థీమ్ వెర్షన్. ఇది యాప్‌లకు స‌పోర్ట్ చేయ‌ని ఫీచర్ ఫోన్. కొత్త‌ స్మార్ట్‌ఫోన్‌లో ప్రీలోడ్ చేయబడిన క్లాసిక్ స్నేక్ గేమ్ FC బారెసిలోనా-థీమ్డ్‌ వెర్షన్‌ను ఆడటానికి వినియోగ‌దారుల‌ను అనుమతిస్తుంది. అలాగే, బార్కా 3210లో ఒకే వెనుక కెమెరా, LED ఫ్లాష్ ఉన్నట్లు క‌నిపిస్తోంది. ఇది నోకియా 3210లోని అదే 2-మెగాపిక్సెల్ సెన్సార్ కావచ్చు.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు వచ్చేశాయ్, ఆరోగ్య లక్షణాలు చెప్పే సెన్సార్లు, 19 నుంచి సేల్స్ ప్రారంభం
  2. కళ్లు చెదిరే మోడల్స్, ధరతో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
  3. iPhone Air పూర్తిగా eSIM-only మోడల్‌గా వస్తుంది
  4. iPhone 17 లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది
  5. నేపథ్యంలో రాబోయే iPhone 17 సిరీస్పై వరుసగా లీకులు వెలుగులోకి వస్తున్నాయి
  6. iPhone 17 Pro మోడళ్ల రూపకల్పనలో కూడా కీలక మార్పులు జరగనున్నాయి
  7. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 లైనప్‌లో నాలుగు కొత్త మోడల్స్ ప్రకటించబడతాయని అంచనా
  8. మార్కెట్‌లోకి సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు, కళ్లు చెదిరే ఫీచర్లు
  9. ఐఫోన్ 17 సిరీస్ రెడీ టు లాంఛ్.. ఏ ఏ మోడల్స్ వస్తున్నాయంటే?
  10. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »