HMD బార్బీ ఫ్లిప్ ఫోన్ బార్బీ-థీమ్డ్ వినియోగదార ఇంటర్‌ఫేస్‌ను కూడా కలిగి ఉంటుంది. కవర్ డిస్‌ప్లే అద్దంలా పనిచేసే బార్బీ ఫ్లిప్ ఫోన్, జ్యువెలరీ బాక్స్-స్టైల్ కేసులో లభిస్తుంది.
Photo Credit: HMD
HMD బార్బీ ఫ్లిప్ ఫోన్ ఆగస్టు 2024లో ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో ఆవిష్కరించబడింది.
భారత్‌లో HMD బార్బీ ఫ్లిప్ ఫోన్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ టీజర్స్ ద్వారా వెల్లడైంది. ముందుగా, ఈ ఫోన్ ఆగస్టు 2024లో కొన్ని ప్రాంతాలలో లాంఛ్ అయ్యింది. ఫ్లిప్ ఫీచర్ ఫోన్ బార్బీ గులాబీ రంగులో అందంగా చూపరులను కట్టిపడేస్తుంది. బ్యాక్ కవర్లు, ఛార్జర్, బ్యాటరీ వంటి accessories గులాబీ రంగులోనే వివిధ షేడ్స్‌లో వస్తాయి. ఈ ఫోన్ బార్బీ-థీమ్డ్ వినియోగదార ఇంటర్‌ఫేస్‌ను కూడా కలిగి ఉంటుంది. కవర్ డిస్‌ప్లే అద్దంలా పనిచేసే బార్బీ ఫ్లిప్ ఫోన్, జ్యువెలరీ బాక్స్-స్టైల్ కేసులో లభిస్తుంది. చూడగానే మనసుదోచే ఈ అందమైన బార్బీ ఫ్లిప్ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
కంపెనీ ఓ X పోస్ట్‌లో HMD బార్బీ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే ఇండియాలో లాంఛ్ కానున్నట్లు స్పష్టం చేసింది. అయితే, మన దేశంలో హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన ఖచ్చితమైన లాంఛ్ తేదీని మాత్రం ఇంకా నిర్ధారించలేదు. కానీ, ప్రమోషనల్ ఇమేజ్‌లో కనిపించే ఫోన్ డిజైన్ ద్వారా ప్రస్తుత గ్లోబల్ వేరియంట్‌ని పోలి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే, ఇండియన్ కౌంటర్ ఫీచర్లు కూడా అలాగే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
HMD బార్బీ ఫ్లిప్ ఫోన్ గ్లోబల్ వెర్షన్ 2.8-అంగుళాల QVGA మెయిన్ స్క్రీన్‌తో వస్తుంది. అలాగే, 1.77-అంగుళాల QQVGA కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతే కాదు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఇది అద్దంలా పనిచేస్తోంది. దీనికి 64MB RAM, 128MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన Unisoc T107 ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 0.3-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతోపాటు LED ఫ్లాష్ యూనిట్‌ను కూడా అందించారు.
HMD నుంచి రాబోయే బార్బీ ఫ్లిప్ ఫోన్ పవర్ పింక్ షేడ్‌లో లభించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ బార్బీ ఫోన్ పింక్ కీప్యాడ్‌లో హెడెన్ palm trees, హార్ట్‌స్, చీకటిలో వెలిగే ఫ్లెమింగో మోటిఫ్‌లు ఉన్నాయి. అంతే కాదు, ఈ ఫోన్ ఆన్ చేసినప్పుడు హాయ్ బార్బీ అనే వాయిస్ వినియోగదారులను స్వాగతం పలుకుతుంది. అలాగే, ఫోన్ బార్బీ-థీమ్డ్ UIతో S30+ OSలో రన్ అవుతుంది. ఈ ఫోన్ ముందే ఇన్‌స్టాల్ చేయబడిన బీచ్-థీమ్డ్ మాలిబు స్నేక్ గేమ్‌తో లభిస్తుంది.
ఈ ఫోన్ 1,450mAh రిమూవబుల్ బ్యాటరీతో కంపెనీ రూపొందించింది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే తొమ్మిది గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. HMD బార్బీ ఫ్లిప్ ఫోన్‌తో వచ్చే బ్యాటరీ అలాగే ఛార్జర్ కూడా గులాబీ రంగులో ఉంటాయి. ఇది 4G, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. USలో దీని ధర $129 (సుమారు రూ. 10,800)గా ఉంది. ఇండియాలో ఈ ఫోన్‌కు మంచి ఆధరణ లభిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S26 Ultra Tipped to Cost Less Than Predecessor; Galaxy S26, Galaxy S26+ Price Hike Unlikely