HMD బార్బీ ఫోన్ బాక్స్ ఓ అందమైన జ్యూయలరీ బాక్స్‌లా డబుల్ చేసుకోవచ్చు. ఇది గత ఏడాది ఆగస్టులో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల అయ్యింది. ఈ ఫోన్ 1450mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో వస్తోంది.
Photo Credit: HMD
గత ఏడాది ఆగస్టులో ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో HMD బార్బీ ఫోన్ విడుదలైంది
మన దేశంలో తొలిసారిగా HMD బార్బీ ఫోన్ ఏప్రిల్ 21న సేల్‌కు వచ్చింది. ఈ తాజా ఫ్లిప్- స్టైల్ మోడల్ హ్యాండ్‌సెట్ ఈ ఏడాది మార్చి నెలలో 2.8- అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 1.77- అంగుళాల కవర్ స్క్రీన్‌తో ఇండియాలో లాంఛ్ అయ్యింది. దీని పేరుకు తగ్గట్టుగానే HMD ఫోన్ బార్బీ థీమ్ కలిగి ఉంటుంది. కొన్ని కీలమైన accessories తో మొత్తం ఒకే పింక్ షేడ్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే, హ్యాండ్‌సెట్ బాక్స్ ఓ అందమైన జ్యూయలరీ బాక్స్‌లా ఉంటుంది. ఇది గత ఏడాది ఆగస్టులో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల అయ్యింది. ఈ ఫోన్ 1450mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో వస్తోంది.కేవలం పవర్ పింక్ కలర్‌లో,ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైల్ ద్వారా కొనుగోలుకు అవకాశం కల్పించారు. అలాగే, HMD బార్బీ ఫోన్ ధర రూ. 7999 గా కంపెనీ నిర్ణయించింది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ కేవలం పవర్ పింక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. గత ఏడాది ఈ హ్యాండ్‌సెట్ యూస్‌లో $129 అంటే, సుమారు రూ. 10800 ధరతో మార్కెట్‌కు పరిచయం అయ్యింది.
HMD బార్బీ ఫోన్ డ్యూయల్ సిమ్‌తో వస్తోంది. అలాగే, ఇది S30+ ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతోంది. అంతే కాదు, బార్బీ- థీమ్ కలిగిన వాల్ పేపర్‌లు, సంబంధిత యాప్ ఐకాన్‌లతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే, ఫోన్ రిటైల్ బాక్స్ జ్యూయలరీ బాక్స్ మాదిరిగా డబుల్ చేసేందుకు అవకాశం ఉంది. HMD ఈ accessories లో బార్బీ థీమ్ ఉన్న బ్యాక్ కవర్స్, స్టికర్స్, beaded lanyard strap ను అందిస్తోంది.
ఈ కొత్త మోడల్ ఫోన్ 2.8 - అంగుళాల QVGA ఇన్నర్ స్క్రీన్, 1.77- అంగుళాల QQVGA కలర్ డిస్‌ప్లేతో వస్తోంది. అలాగే, ఫోన్‌లోని ఔటర్ స్క్రీన్ కూడా మిర్రర్‌లా పని చేయడం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ బార్బీ పోన్ 64MB RAM, 128MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన Unisoc T107 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అలాగే, కంపెనీ 32GB వరకూ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకునే అవకాశం కల్పించింది.
ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్‌ల విషయానికి వస్తే.. HMD బార్బీ ఫోన్ బ్లూటూత్ 5.0, 3.5 mm ఆడియో జాక్, USB టైప్- C పోర్ట్‌లను కలిగి ఉంటుంది. అలాగే, ఇది వైర్డ్, వైర్‌లెస్ మోడ్‌లతో ఎఫ్ఎం రేడియో, MP3 ప్లేయర్‌తో వస్తోంది. ఫోన్‌కు LED ఫ్లాష్‌తోపాటు 0.3- మెగాపిక్సెల్ వెనుక కెమెరాను అందించారు. ఈ ఫోన్ 1450mAh సామర్థ్యంతో రిమూవబుల్ బ్యాటరీని అటాచ్ చేశారు. అంతే కాదు, ఫోన్ మూపివేసినప్పుడు 18.9x108.4x55.1mm పరిమాణంతో 123.5 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Motorola Edge 70 India Launch Teased; Flipkart Availability Confirmed: Expected Specifications, Features