Photo Credit: HMD
పిల్లల కోసం ప్రత్యేకమై స్మార్ట్ వాచ్‌లను అందించే నార్వేజియన్ బేసిడ్ Xploraతో HMD వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మొదలుపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ కలయిక పిల్లలు, యుక్తవయస్కుల కోసం స్మార్ట్ ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రకం ఫోన్‌ను రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఏడాది మొదట్లో యువత స్మార్ట్‌ఫోన్ వినియోగం.. ప్రత్యామ్నాయ పరికరాలపై కంపెనీ నిర్వహించిన గ్లోబల్ సర్వే ఫలితంగా యువతకు అవసరమైన ఉత్పాదకతను పెంచే పరికరం అవసరం ఉందని తల్లిదండ్రులలో వ్యక్తమైంది. అయిఏ, కంపెనీ ఇంకా ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన మోనికర్, ప్రాబబుల్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలను ప్రకటించలేదు.
HMD, ఫిన్నిష్ OEM పిల్లలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ఫోన్‌ను రూపొందించడానికి Xploraతో కలిసి పనిచేస్తున్నట్లు అక్టోబర్ 29న ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ కంపెనీలు వినియోగదారుల కోసం బాధ్యతాయుతమైన, ఉపయోగకరమైన పరికరాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ సంవత్సరం ప్రారంభంలో HMD ది బెటర్ ఫోన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ ప్రారంభిస్తూనే.. 10,000 మంది తల్లిదండ్రులపై ప్రపంచ సర్వే నిర్వహించింది. సర్వే చేసిన తల్లిదండ్రులలో సగానికి పైగా తమ పిల్లల స్మార్ట్ ఫోన్ వినియోగంపై అసతృప్తి వ్యక్తం చేశారు. వారి అభిప్రాయం ప్రకారం.. స్మార్ట్ ఫోన్‌లు కుటుంబంతో గడిపే సమయం, నిద్ర సమయం, వ్యాయామ దినచర్యలతోపాటు పిల్లల మధ్య సాంఘిక అవగాహనలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు.
HMD వెల్లడించిన వివరాల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌లకు ఆచరణీయ ప్రత్యామ్నాయాలుగా పనిచేసే కొత్త పరిష్కార మార్గాన్ని రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపింది. ఇందులో పిల్లలు, యువత కోసం ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ ప్రత్యామ్నాయ స్థానంలో ఉండనుంది. ముఖ్యంగా, HMD గతంలో మాదిరిగా HMD స్కైలైన్, HMD ఫ్యూజన్ హ్యాండ్‌సెట్‌లలో డిటాక్స్ మోడ్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు వారి స్క్రీన్ సమయాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుందని కంపెనీ స్పష్టం చేసింది.
HMDతోపాటు Xplora సహకారంతో వస్తోన్న ఈ ఫోన్‌కు సంబంధించిన మోనికర్, ఫీచర్లు, లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించబడలేదు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే 2025 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మొదటి హ్యాండ్‌సెట్‌ను పరిచయం చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ప్రవేశంతో మార్కెట్‌లో సరికొత్త మార్పులు సంభవించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి.
అలాగే, HMD తదుపరి HMD సేజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇటీవల విడుదలైన HMD స్కైలైన్ లేదా HMD క్రెస్ట్ హ్యాండ్‌సెట్‌లకు సమానమైన డిజైన్‌తో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అంతేకాదు, Unisoc T760 5Gతో రన్ అవుతుండగా, 50-మెగాపిక్సెల్ వెనుక, సెల్ఫీ కెమెరాలతో పాటు 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
ప్రకటన
ప్రకటన