Photo Credit: Honor
హానర్ జిటి ప్రోలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది
చైనాలో Honor GT Pro మొబైల్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. జీటీ సిరీస్ నుంచి వస్తోన్న ఈ కొత్త హ్యాండ్‌సెట్ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7200 mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో పరిచయమైంది. GT Pro 16 జీబీ వరకూ RAM , ఒక టీబీ స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతోంది. మూడు 50- మెగాపిక్సెల్ సెన్సార్‌లతోపాటు 50- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను దీనికి అందించారు. దీంతోపాటు నీరు, ధూళి నియంత్రణకు ఐపీ68+ఐపీ69 రేటింగ్‌తో ఇది వస్తోంది.చైనాలో కొనుగోలుకు,12జీబీ+256జీబీ RAM స్టోరేజీ వేరియంట్ ధర Honor GT Pro చైనాలో CNY 3699(సుమారు రూ.43000)గా ఉంది. అలాగే, 12జీబీ+512జీబీ, 16జీబీ+512జీబీ, 16జీబీ+1టీబీ RAM, స్టోరేజీ వేరియంట్‌ల ధరలు వరుసగా CNY 3999(సుమారు రూ.46000), CNY 4299(సుమారు రూ.50000), CNY 4799(సుమారు రూ.56000)గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మోడల్ బర్నింగ్ స్పీడ్ గోల్డ్, ఐస్ క్రిస్టల్, ఫాంటం బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో చైనాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఈ Honor GT Pro ఫోన్ డ్యూయల్ సిమ్(నానో)తో 6.78- అంగుళాల డిస్‌ప్లేతో ఆరు వేల నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ స్థాయితో వస్తోంది. అలాగే, అడ్రినో 830 జీపీయూ, 16 జీబీ వరకూ RAM, ఒక టీబీ వరకూ స్టోరేజీతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా మ్యాజిక్ఓఎస్ 9.0 పై రన్ అవుతోంది. ఇది ఒయాసిస్ ఐ ప్రొటెక్షన్ గేమింగ్ స్క్రీన్ Honor జెయింట్ రైనో గ్లాస్ కోటింగ్‌తో వస్తుంది.
ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను Honor GT Pro హ్యాండ్‌సెట్‌కు అందించారు. ఇందులో 50- మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్‌ను అమర్చారు. మరో 50- మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50- మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఐఓఎస్ మద్దతిస్తూ.. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50ఎక్స్ డిజిటల్ జూమ్ వంటి ఫీచర్స్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా 50- మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ స్మార్ట్ ఫోన్‌కు అమర్చారు.
ఇందులో బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, Wi-Fi 7, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ వంటివి అందించారు. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలెరో మీటర్, ఈ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరో స్కోప్‌తోపాటు పలు కీలక సెన్సార్‌లు ఇందులో ఉన్నాయి. మరింత మెరుగైన నెట్‌వర్క్‌ను అందించేందుకు సెల్ఫ్ డెవలప్‌మెంట్ ఆర్ఎఫ్ ఇప్లూడ్ చిప్ సీ1+ ను కూడా అందించారు. దుమ్ము, స్ప్లాష్ నియంత్రణకు ఐపీ68+ఐపీ69 రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంటుంది. బయోమెట్రిక్ కోసం 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను జోడించారు. హ్యాండ్‌సెట్ 162.1×75.7×8.58ఎంఎం పరిమాణంతో 212 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన