ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం

హానర్ X9c 5G, గ్లోబల్ వెర్షన్ లో ఉన్నట్టుగానే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్15 ఆధారిత MagicOS 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం

Photo Credit: Honor

హానర్ X9c 5G భారతదేశంలో జాడే సియాన్ మరియు టైటానియం బ్లాక్ రంగులలో అమ్మకానికి ఉంటుంది

ముఖ్యాంశాలు
  • 6000mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది
  • 108 మెగాపిక్స్ లు ప్రైమరీ కెమెరా ఉంటుంది
  • స్పెషల్ AI టూల్స్ అందుబాటులో ఉన్నాయి
ప్రకటన

ప్రతి నెల కొత్త కొత్త బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. ప్రముఖ బ్రాండ్ హానర్ నుండి కూడా ఈనెల ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. హానర్ సంస్థ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ X9c 5Gని భారత మార్కెట్లో ఈ నెల 7వ తేదీన అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2024లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ మోడల్, ఇప్పుడు ఇండియన్ వేరియంట్‌గా హానర్ X9bకి సక్సెసర్‌గా రానుంది. ఈ ఫోన్ అమెజాన్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది, జూలై 12 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.హానర్ కంపెనీ ప్రకటించిన డీటెయిల్స్ ప్రకారం, హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ రెండు డిఫరెంట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది. జేడ్ సియాన్ మరియు టైటానియం బ్లాక్ కలర్స్ లో ఇది దొరుకుతుంది.

ప్రధాన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు:

స్టోరేజ్ విషయానికి వస్తే 8GB RAM + 256GB స్టోరేజ్ కాంబినేషన్‌లో లభించనుంది. హానర్ X9c 5G, గ్లోబల్ వెర్షన్ లో ఉన్నట్టుగానే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్15 ఆధారిత MagicOS 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో మ్యాజిక్ పోర్టల్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. ఇది యాప్‌ల మధ్య స్మార్ట్ ఇంటరాక్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. అలాగే, AI మోషన్ సెన్సింగ్, AI ఎరేస్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

కెమెరా, డిస్‌ప్లే వివరాలు:

ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (f/1.7 అపెర్చర్) ఉంటుంది. ఇది 3x లాస్‌లెస్ జూమ్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ను అందిస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే... ఇది 6.78-ఇంచ్ 1.5K కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్, TÜV రెయిన్లాండ్ ఫ్లిక్కర్ ఫ్రీ మరియు లో బ్లూ లైట్ సర్టిఫికేషన్లతో వస్తుంది. ఫోన్ ఎక్కువ యూస్ చేసిన కూడా కళ్లకు డామేజ్ జరగకుండా ఇది కాపాడుతుంది.
డిజైన్, డ్యురబిలిటీ, బ్యాటరీ వివరాలు:

అమెజాన్ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం, హానర్ X9c 5G కు SGS డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్, IP65M రేటింగ్ తో వస్తుంది. వీటివల్ల ఫోను దుమ్ములో కానీ, నీటిలో కానీ పడిన ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ ఫోన్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే 7.98 మిల్లీమీటర్ల థిక్నెస్, 189 గ్రా బరువుతో వస్తుంది. ఈ మొబైల్ లో ప్రత్యేకతగా 6600mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఫోన్ ఎక్కువసేపు యూస్ చేసిన ప్రాబ్లం లేకుండా, అలాగే వెంటనే ఛార్జింగ్ ఎక్కేలా దీన్ని డిజైన్ చేశారు.

ఫైనల్ గా స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ మరియు న్యూ ఏజ్ సాఫ్ట్‌వేర్‌తో హానర్ X9c 5G మార్కెట్లోకి రానుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఇతర బ్రాండ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. జూలై 12 నుంచి అమెజాన్లో అందుబాటులో ఉంటుంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »