అవే ఫీచ‌ర్స్‌, స్పెసిఫికేష‌న్‌ల‌తో ఇండియాలోకి Honor X9c వ‌చ్చేస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్‌కు చెందిన ప‌నితీరు, డిజైన్‌తోపాటు కెమెరా విభాగాల గురించిన స‌మాచారాన్ని అందించింది. నిజానికి, Honor X9c హ్యాండ్‌సెట్‌ గ‌త ఏడాది ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో లాంఛ్ అయ్యింది.

అవే ఫీచ‌ర్స్‌, స్పెసిఫికేష‌న్‌ల‌తో ఇండియాలోకి Honor X9c వ‌చ్చేస్తోంది

Photo Credit: Honor

హానర్ X9c (చిత్రంలో) 7.98mm మందం కలిగి ఉంటుంది.

ముఖ్యాంశాలు
  • Honor X9c క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 6 Gen 1 ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది
  • ఇది యాండీ డ్రాప్ టెక్నాల‌జీ 2.0, ఐపీ65 ర‌క్ష‌ణ‌ను క‌లిగి ఉంటుంది
  • 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రూపొందించ‌బ‌డింది
ప్రకటన

ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ Honor మ‌న దేశీయ మార్కెట్‌లోకి Honor X9c పేరుతో స‌రికొత్త మొబైల్‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. ఈ మోడ‌ల్ అధికారికంగా లాంఛ్ చేసే ముందు హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కీల‌క‌మైన స్పెసిఫికేష‌న్‌ల‌తోపాటు ఫీచ‌ర్స్‌ను అమెజాన్ ఇండియా లిస్టింగ్ పేజ్ ద్వారా బ‌హిర్గ‌తం చేసింది. దీనిలో ఈ స్మార్ట్ ఫోన్‌కు చెందిన ప‌నితీరు, డిజైన్‌తోపాటు కెమెరా విభాగాల గురించిన స‌మాచారాన్ని అందించింది. నిజానికి, Honor X9c హ్యాండ్‌సెట్‌ గ‌త ఏడాది ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో లాంఛ్ అయ్యింది.

యాండీ డ్రాప్ టెక్నాల‌జీ 2.0

కంపెనీ నుంచి గ‌త సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన Honor X9b మోడ‌ల్‌కు కొన‌సాగింపుగా Honor X9c ప‌రిచ‌య‌మైంది. ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో ప‌రిచ‌య‌మైన స్పెసిఫికేష‌న్స్‌తోనే ఇండియాలోనూ లాంఛ్ కానున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇది 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రూపొందించ‌బ‌డింది. అలాగే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 6 Gen 1 ప్రాసెస‌ర్‌తో 108 మెగాపిక్సెల్ కెమెరాను అమ‌ర్చారు. అంతే కాదు, యాండీ డ్రాప్ టెక్నాల‌జీ 2.0, ఐపీ65 ర‌క్ష‌ణ‌ను క‌లిగి ఉంటుంది.

16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

ప్ర‌త్యేకంగా, ఫోటోగ్ర‌ఫీ కొర‌కు అందించిన 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమారు, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తోపాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వినియోగ‌దారుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అలాగే, ఇది 12GB RAM, 512GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటుంది. అంతే కాదు, దీని డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌, 4000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తోపాటు 3,840హెచ్‌జెడ్ పీడ‌బ్ల్యూఎం డిమ్మింగ్ రేట్‌ను క‌లిగి ఉంది.

ఏఐ సూప‌ర్ ప‌వ‌ర్ సేవింగ్ మోడ్‌

Honor X9c స్మార్ట్ ఫోన్ 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6600mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటుంది. అంతే కాదు, ఇది 25.8 గంట‌ల ఆన్ లైన్ వీడియో ప్లేబ్యాక్‌, 48.4 గంట‌ల మ్యాజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఈ హ్యాండ్‌సెట్ MagicOS 9.0 పై ర‌న్ అవుతుంది. అంతే కాదు, దీనికి ఏఐ సూప‌ర్ ప‌వ‌ర్ సేవింగ్ మోడ్‌ను కూడా అందించారు. అలాగే, ఇందులోని ప‌వ‌ర్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ కార‌ణంగా ఎక్కువ ఉష్ణోగ్ర‌త ఉన్న సంద‌ర్భాల‌లో సైతం మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తుంద‌ని కంపెనీ చెబుతోంది.

మ‌లేషియాలో ధ‌ర ఇలా

ఈ స్మార్ట్‌ ఫోన్ జాడే సియాన్‌, టైనానియం బ్లాక్‌, టైటానియం ప‌ర్సుల్ అనే మూడు క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ల‌భించ‌నుంది. Honor X9c మొబైల్ 7.98ఎంఎం మందంతో 189 గ్రాముల బ‌రువును క‌లిగి ఉంటుంది. అయితే, మ‌లేషియాలో 12GB+256GB, 12GB+ 512GB Honor X9c వేరియంట్ ధ‌ర‌లు వ‌రుస‌గా MYR 1499( సుమారు రూ. 28700), MYR 1699 ( సుమారు రూ. 32500)గా కంపెనీ నిర్ణ‌యించింది. గ్లోబ‌ల్ మార్కెట్‌ల ధ‌ర‌ల ప‌రిధిలోనే ఇండియాలోనూ విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

#తాజా కథనాలు
  1. Moto G37 Power: ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు వాడుకోవచ్చు.. మోటో G37 పవర్ వస్తోంది
  2. Google Shocking Decision: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. జీమెయిల్ ఫ్రీ స్టోరేజీపై కత్తెర.. కొత్త రూల్స్ ఇవే
  3. Thimmarajupalli TV : ఓటీటీలోకి తిమ్మరాజుపల్లి టీవీ.. నవ్వులు పూయిస్తూనే కన్నీళ్లు పెట్టించే ఈ సినిమా ఎక్కడ చూడాలంటే?
  4. Oppo FindX9s : ఒప్పో కొత్త ఫోన్ లో 7025mAh బ్యాటరీ.. ఇక ఛార్జర్ ను మర్చిపోవాల్సిందే
  5. Amazon Great Summer Sale 2026 : పాత ల్యాప్‌టాప్ కి గుడ్ బై.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై కళ్ళు చెదిరే ఆఫర్లు
  6. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ మ్యూజిక్ మ్యాజిక్... 11 వేల బోట్ స్పీకర్ కేవలం రూ. 2,999కే
  7. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ బంపర్ ధమాకా.. సగం రేటుకే ఎయిర్ ప్యూరిఫైయర్లు
  8. Amazon Great Summer Sale 2026: అమెజాన్ ఫ్రిజ్ మేళా.. రూ.58 వేల బాష్ ఫ్రిజ్ కేవలం రూ.33 వేలకే.. ఎగబడుతున్న జనం
  9. Google Gemini Spark : గూగుల్ జెమిని స్పార్క్ వచ్చేస్తోంది.. ఇక మీ ఫోన్ మీకు చెప్పకుండానే పనులు చేసేస్తుంది
  10. Amazon Great Summer Sale 2026: ఇంటిని థియేటర్‌లా మార్చేయండి.. అమెజాన్లో 65 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »