Photo Credit: Huawei
హువావే ఎంజాయ్ 80 అజూర్ బ్లూ, ఫీల్డ్ గ్రీన్, గోల్డ్ బ్లాక్ మరియు స్కై వైట్ షేడ్స్‌లో వస్తుంది
చైనాలో 6620mAh బ్యాటరీతో Huawei Enjoy 80 స్మార్ట్ ఫోన్ లాంఛ్ అయ్యింది. దీనిని పవర్ అడాప్టర్ సాయంతో 40W వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే, దీనికి 50- మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8- మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ HarmonyOS 4.0 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతోంది. 8జీబీ RAM తో అటాచ్ చేసిన 512జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీతో వస్తుంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌కు కూడా చైనాలో గతంలో విడుదల అయిన Enjoy 70 మోడల్ మాదిరిగా Enjoy X బటన్‌ను అందించారు. రాబోయే ఈ మోడల్‌కు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం.Huawei చైనా ఈ- స్టోర్ ద్వారా,కొత్త Huawei Enjoy 80 స్మార్ట్ ఫోన్ 8జీబీ+128జీబీ మోడల్ ధర CNY 1199(సుమారు రూ.14000). అలాగే, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ల ధరలు వరుసగా CNY 1399(సుమారు రూ. 16300), CNY 1699(సుమారు రూ. 19800)గా కంపెనీ నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్ Huawei చైనా ఈ- స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది అజూర్ బ్యూ, ఫీల్డ్ గ్రీన్, గోల్డ్ బ్లాక్, స్కై వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
ఈ Enjoy 80 హ్యాండ్‌సెట్‌ను 6.67- అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌తో కంపెనీ మార్కెట్‌కు పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకూ దీని ప్రాసెసర్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై మార్కెట్ వర్గాలలో వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొబైల్ 8జీబీ RAM, 512జీబీ వరకూ ఆన్‌బోర్డ్ స్టోరేజీతో రూపొందించబడింది. కెమెరా విషయంలోనూ కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇది 50- మెగాపిక్సెల్ వెనుక కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపర్చర్‌తో ఉన్న 8- మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ దుమ్ము, స్ప్లాష్ నియంత్రణకు IP64 రేటింగ్‌తో వస్తోంది.
40W సూపర్ ఛార్జ్ సపోర్ట్‌తో Huawei Enjoy 80 ఫోన్ 6620 mAh భారీ బ్యాటరీతో వస్తోంది. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందించారు. అలాగే, ఈ మొబైల్ స్పీడ్ యాక్సెస్ కోసం ఎడమవైపున అంచు భాగంలో ఎంజాయ X కీ ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్‌ల విషయానికి వస్తే.. 4జీ, బ్లూటూత్ 5.1, Wi-Fi 5, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తోపాటు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌లను అందించారు.
ఈ కొత్త మోడల్‌కు గృహోపకరణాలను ఆపరేట్ చేసేందుకు వినియోగించే ఐఆర్ బ్లాస్టర్‌ను కూడా అందించారు. Enjoy 80 ఫోన్ బ్లాక్, బ్లూ, గోల్డ్ వేరియంట్‌లు 166.05×76.58×8.25ఎంఎం పరిమాణంతో 203 గ్రాముల బరువుతో వస్తాయి. అలాగే, ఫాక్స్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌లో అందించబడుతోన్న ఆకుపచ్చ వేరియంట్ మాత్రం 8.33ఎంఎం ప్రొఫైల్‌తో 206 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన