Photo Credit: Infinix
Infinix Note 50 సిరీస్ ఏప్రిల్ 2024లో వచ్చిన Note 40 (చిత్రం) లైనప్‌ను విజయవంతం చేస్తుంది.
మార్చి నెలలో Infinix Note 50 సిరీస్ లాంఛ్ కానున్నట్ల కంపెనీ ప్రకటించింది. రాబోయే స్మార్ట్ ఫోన్ లైనప్ దాదాపు ఏడాది క్రితం విడుదలైన Infinix Note 40 మోడల్‌కు కొనసాగింపుగా వస్తోంది. ఈ సిరీస్ మొదటగా ఇండోనేషియాలో విడుదల కానుంది. అలాగే, కంపెనీ పబ్లిష్ చేసిన టీజర్‌లో Infinix Note 50 సిరీస్‌లోని హ్యాండ్‌సెట్‌లలో ఒక దాని వెనుక కెమెరా మాడ్యూల్‌ను కూడా చూడొచ్చు. ఈ రాబోయే Note 50 సిరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లకు కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.
Infinix Note 50 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లను వచ్చే నెల మార్చి 3న ఇండోనేషియాలో లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోని ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ గురించి కంపెనీ గతంలో ఇదే ప్లాట్‌ఫామ్‌పై మరొక పోస్ట్‌లో కూడా వెల్లడించింది. అయితే, రాబోయే ఈ Infinix Note 50 సిరీస్ నుంచి ఎన్ని మోడళ్లను లాంచ్ చేస్తారనే దానిపై Infinix నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదని మార్కెట్ వర్గాలు చబుతున్నాయి.
కంపెనీ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. రాబోయే Infinix Note 50 సిరీస్ AI ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే, Note 50 సిరీస్‌లోని ఒక మోడల్‌కు చెందిన వెనుక కెమెరా మాడ్యూల్‌ను కూడా ఇందులో మనం చూడొచ్చు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌ల గురించి ఇతర వివరాలు వాటి లాంఛ్‌కు ముందు రోజుల్లో వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Infinix తమ రాబోయే స్మార్ట్ ఫోన్‌ల వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త మోడల్ Infinix Note 50 ప్రో ఫోన్ గతంలో ఇండోనేషియా SDPPI వెబ్‌సైట్‌లో X6855 మోడల్ నంబర్‌తో లిస్ట్ అవుట్ చేయబడింది. అయితే, రెగ్యులేటర్ వెబ్‌సైట్‌లోని లిస్ట్‌లో దీని స్పెసిఫికేషన్‌లను మాత్రం వెల్లడించలేదు. కానీ, రాబోయే సిరీస్‌లోని కనీసం ఒక మోడల్‌ను నిర్ధారించినట్లు స్పష్టమైంది. దీంతో సిరీస్ నుంచి తర్వలోనే హ్యాండ్‌సెట్ రానున్నట్లు ఆన్‌లైన్ వేదికగా పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. కంపెనీ తాజా ప్రకటనతో అవి నిజమయ్యాయి.
గత ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన Note 40 ప్రో 5G మోడల్‌కు కొనసాగింపుగా Infinix Note 50 ప్రో ఫోన్ రానున్నట్లు భావిస్తున్నారు. ఆ హ్యాండ్‌సెట్‌లో 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ 3D AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుది. అలాగే, Infinix Note 40 ప్రో హ్యాండ్‌సెట్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. అయితే, రాబోయే సిరీస్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో గత సిరీస్ ఆధారంగా అంచనా వేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన