ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 లో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది IPS LCD స్క్రీన్‌తో రూపొందించబడింది. తక్కువ వెలుతురులో కూడా స్పష్టంగా కనిపించేలా దీని బ్రైట్నెస్ 700 నిట్స్ వరకు ఉంటుంది.
Photo Credit: Infinix
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 దుమ్ము మరియు స్ప్లాష్ నిరోధకత కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 భారత మార్కెట్‌లో జూలై 25న అధికారికంగా విడుదలైంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగంలో వచ్చిన ఈ మోడల్ ప్రత్యేకంగా నాలుగు సంవత్సరాలు పాటు ల్యాగ్‌ఫ్రీగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో IP64 సర్టిఫికేషన్‌తో వచ్చిన ఈ డివైస్, సాధారణ వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా రూపొందించబడింది.ఈ ఫోన్ ఐరిస్ బ్లూ, స్లీక్ బ్లాక్, టైటానియం సిల్వర్, ట్విలైట్ గోల్డ్ వంటి ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,799గా నిర్ణయించారు. ఆగస్టు 2 నుంచి ఇది ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ప్రధాన ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో లభ్యం కానుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 లో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది IPS LCD స్క్రీన్‌తో రూపొందించబడింది. తక్కువ వెలుతురులో కూడా స్పష్టంగా కనిపించేలా దీని బ్రైట్నెస్ 700 నిట్స్ వరకు ఉంటుంది. టచ్ రిస్పాన్స్ మెరుగ్గా ఉండేందుకు 240Hz టచ్ సాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ అనుభవం కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే విధంగా ఇందులో octa-core Unisoc T7250 ప్రాసెసర్ ఉపయోగించబడింది. దీని ద్వారా యాప్‌ల ఓపెనింగ్ స్పీడ్, మల్టీటాస్కింగ్ మెరుగ్గా ఉంటుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు, 2TB వరకు మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం కూడా ఉంది. ఈ ఫెసిలిటీ తో పెద్దపెద్ద డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలను ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టోర్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్ Android 15 ఆధారంగా పనిచేసే XOS 15.1 ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. అందులో భాగంగా Folax అనే వ్యక్తిగత వాయిస్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, రైటింగ్ అసిస్టెంట్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆప్షన్స్ వల్ల మన బేసిక్ వర్క్స్ అన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ ముందు మరియు వెనుక భాగాల్లో 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా అలాగే వెనుక కెమెరా రెండూ 2K రిజల్యూషన్‌లో వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి. డ్యూయల్ వీడియో మోడ్ ద్వారా ఒకేసారి ముందు మరియు వెనుక కెమెరాలతో వీడియో రికార్డ్ చేయగలగడం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తోంది. సాధారణ వినియోగానికి సరిపడే విధంగా దీని బ్యాకప్ ఉంటుంది. ఇది15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు. DTS ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్లు బెస్ట్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, FM రేడియో, OTG, 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీలు ఉన్నాయి. ప్రత్యేకంగా కంపెనీ అందించిన UltraLink ఫీచర్ ద్వారా సెల్ నెట్‌వర్క్ లేని ప్రదేశాల్లో కూడా ఇతర ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్లకు కాల్ చేయడం సాధ్యమవుతుంది.
ఈ ఫోన్ 187 గ్రాముల బరువుతో, 8.25mm థిక్నెస్ మాత్రమే ఉండటంతో ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. TÜV SÜD సర్టిఫికేషన్‌తో వచ్చిన ఈ ఫోన్ నాలుగేళ్ల పాటు ల్యాగ్ లేకుండా పనిచేస్తుందని కంపెనీ గట్టి నమ్మకంతో చెబుతోంది.
మొత్తానికి, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ఫోన్ బడ్జెట్ యూజర్ల కోసం ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ఈ స్థాయి ఫీచర్లు అందించగలగడం దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ముఖ్యంగా ఫోన్‌లోని ఆధునిక డిజైన్, లేటెస్ట్ Android వర్షన్, AI ఫీచర్లు, పెద్ద బ్యాటరీ వంటి అంశాలు దీన్ని మార్కెట్‌లో ఇతర ఫోన్లకు గట్టి కాంపిటీషన్ గా నిలబెడతాయని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన