Photo Credit: Infinix
దేశీయ మార్కెట్‌లోకి Infinix Zero Flip త్వరలోనే విడుదల కానుంది. కంపెనీ యొక్క మొట్టమొదటి క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ గత నెలలోనే గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ అయ్యింది. తాజాగా అక్టోబర్ మధ్య నాటికి మనదేశంలో అడుగుపెట్టనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. Infinix Zero Flip మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే, 3.64-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో పాటు 6.9-అంగుళాల లోపలి స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ ఔటర్ కెమెరా సెటప్‌ను కూడా అందించారు. అయితే, మూడవ 50-మెగాపిక్సెల్ కెమెరా లోపలి స్క్రీన్‌పై హోల్-పంచ్ కటౌట్‌లో ఉంటుంది.
కంపెనీ వెబ్‌సైట్‌లోని మైక్రోసైట్ ప్రకారం.. Infinix Zero Flip ఈ అక్టోబర్ 17న భారతదేశంలో లాంచ్ కాబోతోంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రపంచవ్యాప్తంగా బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్‌వేస్ రంగులలో విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే, సైట్‌లో రాక్ బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు చూపిస్తోంది. దీంతోపాటు దేశీయ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధరతోపాటు ఎలా కొనుగోలు చేయవచ్చు లాంటి విషయాలు మన దేశంలో లాంచ్ చేసేందుకు ముందు రోజు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Infinix Zero Flip గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేసిన మోడల్ మాదిరిగానే స్పెసిఫికేషన్‌లతో వస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం.. ఇది MediaTek నుండి డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే, గరిష్టంగా 16GB వరకు RAM, 512GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజీతో అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే XOS 14పై రన్ అవుతుందని భావిస్తున్నారు. Infinix Zero Flip లోపలి భాగంలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అయితే, 3.64-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే కూడా 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.
ముఖ్యంగా.. ఫోటోలు, వీడియోల కోసం జీరో ఫ్లిప్ 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తున్నారు. ఇవి కవర్ డిస్‌ప్లేపై ఉన్నాయి. లోపలి డిస్‌ప్లేలో 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. లోపలి, బయట కెమెరాలను ఉపయోగించి 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ GoPro ఇంటిగ్రేషన్‌ను కూడా అందిస్తుంది. Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్ JBL ద్వారా ట్యూన్ చేయబడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. అయితే, ఇది రెండు OS అప్‌గ్రేడ్‌లను (ఆండ్రాయిడ్ 16 వరకు) అందుకోనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఛార్జింగ్ అడాప్టర్‌ని ఉపయోగించి 70W ఛార్జ్ చేయగల 4,720mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెడితే మాత్రం కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన